twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోహెల్‌కు అఖిల్ నమ్మక ద్రోహం: వీడియోతో బండారం బయటపెట్టాడు.. కొట్టుకుంటారన్న భయంతోనే అలా!

    |

    టీనేజ్‌లోనే చిత్ర సీమలోకి అడుగు పెట్టి.. అప్పటి నుంచి ఎన్నో సినిమాలు.. సీరియళ్లలో నటిస్తూనే ఉన్నాడు సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహెల్ రియాన్. చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్నా.. అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయాడు. అయితే, ఈ మధ్య జరిగిన బిగ్ బాస్ షో వల్ల మాత్రం విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన స్నేహితుడు అఖిల్ సార్థక్ బండారం బయట పెట్టాడు సోహెల్. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? వివరాల్లోకి వెళితే....

    మరింత గ్లామర్‌గా శృతి హాసన్.. క్రాక్ విజయంతో మరింత జోష్‌గా

    అలా మొదలైన కెరీర్... స్టార్ హీరోలతోనూ

    అలా మొదలైన కెరీర్... స్టార్ హీరోలతోనూ

    'కొత్త బంగారు లోకం' అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు యంగ్ సెన్సేషన్ సయ్యద్ సోహెల్ రియాన్. అప్పటి నుంచి ఎన్నో చిత్రాల్లో నటించాడతను. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్', అల్లు అర్జున్ చిత్రం 'సరైనోడు' వంటి బడా మూవీలలో కీలక పాత్రలు పోషించాడు. అదే సమయంలో కొన్ని సీరియళ్లలోనూ నటించి పేరు తెచ్చుకున్నాడీ యాక్టర్.

    అందరిలా కాదు.. వెరైటీగా ఎంట్రీ ఇచ్చాడు

    అందరిలా కాదు.. వెరైటీగా ఎంట్రీ ఇచ్చాడు

    సినిమాలు.. సీరియళ్లతో బిజీగా గడుపుతోన్న సమయంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు సోహెల్. అయితే, అందరిలా కాకుండా ఆరియానా గ్లోరీతో కలిసి సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ రెండు రోజుల పాటు రచ్చ రచ్చ చేసిన అతడు.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు. వెళ్లడమే గొడవ మొదలెట్టాడు.

    ఆటతీరు.. గొడవలు.. ఫినాలేకు చేరువగా

    ఆటతీరు.. గొడవలు.. ఫినాలేకు చేరువగా

    బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించాడు సోహెల్. ఇందులో భాగంగానే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఏ టాస్క్ అయినా తానే నెంబర్ వన్ అనేలా ఆడుతూ వచ్చాడు. అదే సమయంలో తోటి కంటెస్టెంట్లతో గొడవలు పడుతూ విమర్శల పాలయ్యాడు. మొత్తానికి ప్రేక్షకుల మద్దతులో ఫినాలేలో అడుగు పెట్టాడతను.

    బిగ్ బాస్ ఆఫర్‌.. చిరు ప్రశంసలు.. హీరోగా

    బిగ్ బాస్ ఆఫర్‌.. చిరు ప్రశంసలు.. హీరోగా

    గ్రాండ్ ఫినాలేలో టాప్-3లో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్. అందులో నుంచి కొంత మొత్తాన్ని అనాథలకు ఇస్తానని చెప్పి హీరో అయ్యాడు. అప్పుడే మెగాస్టార్ చిరంజీవి సోహెల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక, బయటకు వచ్చిన తర్వాత హీరోగా ఓ మూవీని కూడా మొదలెట్టాడీ సింగరేణి బిడ్డ.

    సోహెల్‌కు అఖిల్ నమ్మక ద్రోహం.. వీడియో

    సోహెల్‌కు అఖిల్ నమ్మక ద్రోహం.. వీడియో

    బిగ్ బాస్ హౌస్‌లో సోహెల్.. అఖిల్ సార్థక్‌తో బాగా క్లోజ్ అయిన విషయం తెలిసిందే. బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్లిద్దరూ అదే రీతిలో బాండింగ్ చూపిస్తున్నారు. ఎక్కువగా ఇద్దరే కలిసి కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోహెల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేశాడు అఖిల్. ఈ విషయాన్ని వీడియో ద్వారా చూపించిన అతడు.. స్నేహితుడిపైనే షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    చివరికలా ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ షాక్

    చివరికలా ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ షాక్

    సోహెల్ పోస్ట్ చేసిన వీడియో కారణంగా చాలా మంది అఖిల్‌పై విమర్శలు చేశారు. దీనికి అతడు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. 'కావాలని చేయలేదు. అయినా ఇలాంటివి ఎవరైనా పోస్ట్ చేస్తారా' అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా వీళ్లిద్దరూ కలిశారు. ఈ సందర్భంగా 'మాకు గొడవ జరిగిందనుకుని ఫ్యాన్స్ కొట్టుకుంటారేమో అని భయపడ్డాం. అందుకే ఇప్పుడు కలిశాం' అంటూ మరో వీడియో వదిలారు.

    English summary
    Syed Sohel Ryan is an Indian actor who mostly works in the Telugu Film Industry. He was born in a middle-class family in Hyderabad. Syed Sohel Ryan in childhood He desired to become an actor since childhood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X