అవినాష్‌కు ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి.. పిల్లలు కూడా పుట్టారు: పరువు తీసిన బిగ్ బాస్ కంటెస్టెంట్

ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్‌కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ షో తెలుగు బుల్లితెరపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఫలితంగా ఎన్నో రికార్డులను తిరగరాస్తోంది. అదే సమయంలో టాలెంట్ ఉండి అవకాశాలు దొరకని ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలాంటి వారిలో ముక్కు అవినాష్ ఒకడు. జబర్ధస్త్‌లో ఓ వెలుగు వెలిగిన అతడు.. బిగ్ బాస్ షోలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇలాంటి సమయంలో అవినాష్ ఇల్లీగల్ ఎఫైర్ల గురించి ఓ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం.!

ఆర్టిస్టు నుంచి టీమ్ లీడర్‌గా మార్పు

ఆర్టిస్టు నుంచి టీమ్ లీడర్‌గా మార్పు

కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా ఎన్నో స్టేజ్ షోలు చేశాడు అవినాష్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడి.. అందులో చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇలా ప్రముఖ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. అసాధారణ టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. ఆ సమయంలో అవినాష్‌లోని ప్రత్యేకతను గుర్తించిన నిర్వహకులు అతడిని టీమ్ లీడర్‌గా ప్రమోట్ చేశారు.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. పేరు వచ్చింది

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. పేరు వచ్చింది

జబర్ధస్త్ షోలో ఆర్టిస్టుగా, టీమ్ లీడర్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న అవినాష్.. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నాడు. షో ఆరంభం అయిన రెండు వారాలకు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అతడు.. మొదటి రోజు నుంచే తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ఫలితంగా బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకుంటున్నాడు.

ఆమెతో ప్రేమాయణంతో హాట్ టాపిక్

ఆమెతో ప్రేమాయణంతో హాట్ టాపిక్

బిగ్ బాస్ హౌస్‌లో ఎంతగానో కామెడీని పండిస్తోన్న అవినాష్.. సహచర కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీని పడేసే పనిలో బిజీగా ఉంటున్నాడు. ఇందుకోసం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్న అతడు.. ఆ రకంగానూ నవ్విస్తున్నాడు. ఆరియానా కూడా అవినాష్‌తో కలిసిమెలసి ఉండడంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఫలితంగా మనోడు హాట్ టాపిక్ అవుతున్నాడు.

మరో యాంగిల్‌తో పెరిగిన విమర్శలు

మరో యాంగిల్‌తో పెరిగిన విమర్శలు

బిగ్ బాస్ షోలో అవినాష్‌కు ఎంత మంచి పేరు వచ్చిందో.. అదే స్థాయిలో అతడిపై విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. దీనికి కారణం అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడన్న ఆరోపణలు వస్తుండడమే. జబర్ధస్త్ నుంచి తనను తీసేశారని తరచూ అబద్ధాలు చెబుతున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇది అవినాష్‌కు ప్రతికూలంగా మారిందనడంలో సందేహం లేదు.

పరువు తీసిన బిగ్ బాస్ కంటెస్టెంట్

పరువు తీసిన బిగ్ బాస్ కంటెస్టెంట్

బిగ్ బాస్ యూనిట్ తాజాగా ఓ ప్రోమోను విడుదల చేసింది. అందులో అఖిల్ సార్థక్, ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్‌లు అవినాష్‌ను టార్గెట్ చేసి మరీ ఆటపట్టించారు. మొదటిగా ఆరియానా మాట్లాడుతూ ‘అవినాష్ నువ్వు షర్ట్స్ వేసుకోకు. వాటి వల్ల పొట్ట కనిపించి అంకుల్‌లా ఉంటున్నావ్. నీ కంటే ముందు నీ పొట్టే నడుస్తున్నట్లుంది' అని ఏడిపించింది.

Recommended Video

Bigg Boss Telugu 2 Winner Kaushal Message To People On Corona Virus
అవినాష్‌కు ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి

అవినాష్‌కు ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి

ఇక, సోహెల్ మాట్లాడుతూ.. ‘అవును.. అవినాష్‌కు పొట్ట ఉంది. ఐతే ఏంటి.? ఆయనకు ఇల్లీగల్ ఎఫైర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మణికొండ, కూకట్‌పల్లిలో అకౌంట్లు ఉన్నాయి. అయితే ఏంటిప్పుడు?' అంటూ సరదాగా ఆటపట్టించాడు. దీంతో తల పట్టుకున్న అవినాష్ ‘ఏరయ్యా నేనేం పాపం చేశానురా అయ్యా' అంటూ బిక్కముఖం పెట్టేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X