బంపర్ ఆఫర్ పట్టేసిన సోహెల్: బిగ్ బాస్‌లోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా.. సింగరేణి బిడ్డ దూకుడు

బుల్లితెరపై ప్రసారం అవుతోన్న షోలు అన్నింటిలో బిగ్ బాస్‌ది ప్రత్యేకమైన స్థానం. దీనికి కారణం ఇది ఎంతో మంది తలరాతలను మార్చేస్తుండడమే. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో... ఎంతో మందిని హీరోలను చేసింది. అలా.. ఈ రియాలిటీ షో ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో సయ్యద్ సోహెల్ రియాన్ ఒకడు. ఇటీవల ముగిసిన సీజన్‌లో పాల్గొన్న అతడు.. ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. అలాగే, ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నాడు. తాజాగా అతడు ఓ బంపర్ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

సీక్రెట్‌గా ఎంట్రీ.. కథ వేరే ఉంటుందని ఫేమస్

సీక్రెట్‌గా ఎంట్రీ.. కథ వేరే ఉంటుందని ఫేమస్

సీక్రెట్ రూమ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన సయ్యద్ సోహెల్ రియాన్.. ఆ తర్వాత గొడవతోనే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అన్నింట్లో ముందుంటూ తన మార్క్ చూపించాడు. ఫిజికల్ టాస్కులు మాత్రమే కాదు.. ఎలాంటి గేమ్ అయినా తానే కింగ్ అనిపించుకున్నాడు. అయితే, ‘కథ వేరే ఉంటది' అంటూ తరచూ గొడవలకు దిగడం అతడికి మైనస్‌గా మారినా.. తర్వాత దాన్ని అధిగమించాడు.

విన్నర్ అనుకుంటే.. అలా సరిపెట్టుకున్నాడు

విన్నర్ అనుకుంటే.. అలా సరిపెట్టుకున్నాడు

బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లలో ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువగా విలువ ఇచ్చేవాడు సోహెల్. తన స్నేహితుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అతడు.. ఎమోషనల్‌గా ఫీల్ అయ్యేవాడు. ఇలా అన్ని రకాలుగా ఆకట్టుకుని ప్రజాదరణను పొందాడు. ఈ కారణంగానే టాప్-5లోకి వచ్చాడు. అయితే, ఫినాలేలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

షో వల్ల సోహెల్ ఎంత సంపాదించాడో తెలుసా

షో వల్ల సోహెల్ ఎంత సంపాదించాడో తెలుసా

సయ్యద్ సోహెల్ రియాన్ బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగాడు. అతడు రోజుకు రూ. 25 వేలు చార్జ్ చేసినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా షోలో ఉన్నందుకు రూ. 26 లక్షల 25 వేలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడని సమాచారం. దీనికి బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షలు కలుపుకుంటే రూ. 51 లక్షల 25 వేలు మనీ తీసుకున్నాడు. దీనికితోడు ఫేమ్ కూడా అందుకున్నాడు.

వచ్చిన వెంటనే ప్రకటించి షాకిచ్చిన సోహెల్

వచ్చిన వెంటనే ప్రకటించి షాకిచ్చిన సోహెల్

సినిమా హీరోగా సత్తా చాటాలన్న లక్ష్యాన్ని బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే నిజం చేసుకున్నాడు సయ్యద్ సోహెల్ రియాన్. గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి ముందు ఇదే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ‘జార్జ్‌రెడ్డి' టీమ్‌తో సినిమా చేస్తున్నాడు. మూడుడు రోజుల క్రితం దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే.

మరో బంపర్ ఆఫర్ పట్టేసిన సింగరేణి బిడ్డడు

మరో బంపర్ ఆఫర్ పట్టేసిన సింగరేణి బిడ్డడు

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సయ్యద్ సోహెల్ రియాన్ అదరగొడుతున్నాడు. ఎక్కడ చూసినా అతడే కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ఎన్నో ఆఫర్లు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఒక సినిమాను ప్రకటించిన సోహెల్.. మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే మరో బంపర్ ఆఫర్ పట్టేశాడని తెలిసింది.

బిగ్ బాస్‌లోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా

బిగ్ బాస్‌లోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా

ప్రముఖ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్‌తో సోహెల్ దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కోన ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో అతడు నటించబోతున్నాడని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, మరికొన్ని చిన్న చిత్రాల్లో హీరోగానూ కనిపించనున్నాడని అంటున్నారు. అలాగే, పెద్ద చిత్రాల్లో కీలక పాత్రల కోసం అడుగుతున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X