twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జార్జిరెడ్డి టీమ్‌తో సోహెల్ న్యూ మూవీ.. అభిజిత్ కంటే ముందే బిజీ అయ్యేలా..

    |

    బ్యాక్ గ్రౌండ్ తో వచ్చే హీరోల కన్నా కూడా కొన్నిసార్లు కష్టపడి పైకొచ్చే నటీనటులపై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇటీవల బిగ్ బాస్ లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచిన వారిపై కూడా జనాల ఫోకస్ ఎక్కువగా పడుతోంది. వారు ఎలాంటి సినిమాలు చేస్తారో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం వారు చేయబోయే ప్రాజెక్టులపై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సోహెల్ హడావుడి చూస్తుంటే అభిజిత్ కంటే ముందే అతడే హీరోగా బిజీ అయ్యేలా ఉన్నాడని అనిపిస్తోంది.

    సోహెల్ బ్రాండ్ గట్టిగానే పాతుకుపోయింది

    సోహెల్ బ్రాండ్ గట్టిగానే పాతుకుపోయింది

    బిగ్ బాస్ 4 సీజన్ మొత్తం ఒక లెక్క బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన సీన్ మరో లెక్క అనేలా ఒక డిఫరెంట్ బజ్ క్రియేట్ చేసుకున్నాడు సోహెల్. మెగాస్టార్ చిరంజీవి అతన్ని ఆకాశానికి ఎత్తేశాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ అభిత్ అయినప్పటికీ కూడా సోహెల్ బ్రాండ్ మాత్రం ఓ వర్గం జనాల్లో గట్టిగానే పాతుకుపోయింది.

     విన్నర్ అవ్వడని తెలుసు.. అందుకే..

    విన్నర్ అవ్వడని తెలుసు.. అందుకే..

    సోహెల్ 105రోజుల పాటు హౌజ్ లో చాలా తెలివిగా అడుగులు వేశాడు. తన హావభావాలతో ఆడియెన్స్ సపోర్ట్ ను పెంచుకున్నాడు. ఇక ఫైనల్స్ లో అతను ఆలోచించిన విధానం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎలాగూ విన్నర్ అవ్వడని తెలుసు అందుకే 25లక్షల ప్యాకేజ్ తో సేఫ్ జోన్ లో పడ్డాడు. ఇక అభి బిగ్ బాస్ విన్నర్ అవ్వగా రన్నరప్ గా నిలిచినా అఖిల్ కు బిగ్ బాస్ రెమ్యునరేషన్ తప్ప ఏమి మిగల్లేదు.

    సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోహెల్

    సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోహెల్

    ఇక రానున్న రోజుల్లో ఎవరు ఎంత బిజీ అవుతారో తెలియదు గాని ముందుగా సోహెల్ అయితే నటుడిగా చాలా స్పీడ్ పెంచేలా ఉన్నాడని అర్ధమవుతోంది. ఇక ఇటీవల అతను ఒక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో సోహెల్ ఆ ప్రాజెక్టును వీలైనంత త్వరాగా స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నాడట.

    జార్జిరెడ్డి నిర్మాతలతో..

    జార్జిరెడ్డి నిర్మాతలతో..

    బిగ్ బాస్ ద్వా రా వచ్చిన క్రేజ్ డోస్ తగ్గకముందే ఈ హడావుడిలోనే సినిమాని ఎనౌన్స్ చేయాలనీ అనుకుంటున్నాడు. ఇక ఆ సినిమాని జార్జిరెడ్డి నిర్మాతలు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు శ్రీన్వియాస్ డైరెక్ట్ చేయనున్నాడట. ప్రస్తుతం అందుకు సంబందించిన న్యూస్ వైరల్ గా మారింది. దాదాపు ఒక టీమ్ అయితే సెట్టయినట్లు సమాచారం చూస్తుంటే అభిజిత్ కంటే ముందే సోహెల్ హీరోగా బిజీ అయ్యేలా ఉన్నాడని అనిపిస్తోంది.

    English summary
    Bigg Boss Season 4 has successfully completed a total of 105 days of travel. Bigg Boss, which received a lot of craze as the biggest reality show in the middle of this season, gave some entertainment in the final but never before. Abhijit won the season 4 as expected. However, the Bigg Boss show has set a new record for most votes cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X