Bigg Boss: శ్రీహాన్ బండారం బట్టబయలు.. సిరి ఉన్నా ఆ అమ్మాయితో.. ఒకేసారి ఇద్దరితో అంటూ ట్విస్ట్

తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ దేశ వ్యాప్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఇది ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఓ సెలెబ్రిటీ గెస్ట్ శ్రీహాన్ చోటు బండారం బయటపెట్టి షాకిచ్చాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

ఆరంభంలో తక్కువ.. ఇప్పుడేమో

ఆరంభంలో తక్కువ.. ఇప్పుడేమో

తెలుగులో బిగ్ బాస్ షో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆరో దానిపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. దీనికి అనుగుణంగానే ఈ సీజన్‌ను సరికొత్త హంగులతో ఎంతో ఆసక్తికరంగా నడుపుతున్నారు. కానీ, రేటింగ్ మాత్రం పెద్దగా రాలేదు. అయితే, క్రమంగా ఇందులో ట్విస్టులు చూపిస్తున్నారు. ఫలితంగా ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ పెరుగుతూ ఉంది.

ఫ్యామిలీ వీక్‌.. అందరూ వచ్చారు

ఫ్యామిలీ వీక్‌.. అందరూ వచ్చారు

బిగ్ బాస్ ప్రతి సీజన్‌లోనూ చివరి వారాల్లో కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుంటారు. ఇందులో మంగళవారం ఆది రెడ్డి, రాజశేఖర్ ఫ్యామిలీలు.. బుధవారం ఫైమా, శ్రీ సత్య, రోహిత్ కుటుంబాలు.. గురువారం శ్రీహాన్, ఇనాయా, కీర్తి భట్ ఫ్యామిలీలు.. శుక్రవారం రేవంత్ మదర్ వచ్చారు. వీళ్ల రాకతో నాలుగు రోజులూ ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా కనిపించాయి.

శనివారం ఎపిసోడ్‌లోనూ సందడి

శనివారం ఎపిసోడ్‌లోనూ సందడి

బిగ్ బాస్ ఆరో సీజన్ చివరి దశకు చేరడంతో 12వ వారం మొత్తం కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శనివారం జరిగిన ఎపిసోడ్‌లో మరోసారి వాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు స్టేజ్ మీదకు వచ్చారు. అలా ఎంటరైన గెస్టులు అంతా హోస్ట్ నాగార్జునతో కలిసి సందడి చేశారు. దీంతో నిన్నటి ఎపిసోడ్ మొత్తం చాలా సరదాగా సాగింది.

ఇనాయా కోసం సోహైల్.. బ్రదర్

ఇనాయా కోసం సోహైల్.. బ్రదర్

ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి.. తనదైన ఆటతీరుతో భారీ స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ ఇనాయా సుల్తానా. ఈ అమ్మడి కోసం గత వారంలో వాళ్ల అమ్మగారు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, శనివారం జరిగిన ఎపిసోడ్‌లో మాత్రం మాజీ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్‌తో పాటు ఇనాయా బ్రదర్ వచ్చారు. వీళ్లు ఆమెను బాగా ఎంకరేజ్ చేశారు.

క్రష్ సోహైల్... జిమ్‌లో ఇద్దరితో

క్రష్ సోహైల్... జిమ్‌లో ఇద్దరితో

సోహైల్ తన కోసం బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వగానే ఇనాయా సుల్తానా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సమయంలో ఆమె 'సోహైల్ గారు మొదటి క్రష్. ఆయన కోసం మణికొండ షిఫ్ట్ అయ్యాను. ఆయన కోసం జిమ్‌లో చేరాను. నెంబర్ కోసం కూడా ప్రయత్నించాను. కానీ, తను వేరే ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడడం బాధేసింది' అంటూ చెప్పి పెద్ద ట్విస్టే ఇచ్చింది.

కూకట్‌పల్లిలో అమ్మాయితో అని

ఆ తర్వాత సోహైల్ కూడా ఇనాయా సుల్తానా గురించి ఎంతో చక్కగా మాట్లాడాడు. అంతేకాదు, నెంబర్ కావాలా అంటూ అడిగేశాడు. ఇదంతా సరదాగా సాగిపోయింది. ఇక, వెళ్లేముందు అతడు శ్రీహాన్ - సిరి ప్రస్థావన తీసుకొచ్చాడు. 'సార్ శ్రీహాన్ మామూలోడు కాదు సార్. కూకట్‌పల్లిలో ఓ అమ్మాయితో కనిపించాడు' అని చెప్పాడు. దీనికతడు అది షూటింగ్‌లో భాగం అని చెప్పుకొచ్చాడు.

 సిరి లేనప్పుడు ట్రిప్ వెళ్లాడంటూ

సిరి లేనప్పుడు ట్రిప్ వెళ్లాడంటూ

కూకట్‌పల్లి అమ్మాయి గురించి ఇరికించిన సోహైల్ ఆ తర్వాత 'సార్.. సిరి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో మనోడు ట్రిప్‌కు వెళ్లాడు. అది ఎవరితో వెళ్లాడో చెప్పమంటారా' అంటూ మరో షాకిచ్చాడు. దీనికి శ్రీహాన్ 'అయ్యబాబోయ్.. నేను ఆ ట్రిప్‌కు ఒక్కడినే వెళ్లాను. ఆ అమ్మాయితో కూడా షూటింగ్ కోసమే కలిశాను' అని చెప్పాడు. ఈ సంభాషణ అంతా ఎంతో సరదాగా సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X