హౌస్‌లో పెద్ద విలన్ వాడే.. పశుపతిలాంటి వాడంటున్న తమన్నా.. షాకిచ్చిన ‘బిగ్ బాస్’

Recommended Video

Today Promo : #RahulSipligunj Secret Task... Can he manage to do it

'బిగ్ బాస్' సీజన్ - 3 రెండో వారం ప్రారంభమైంది. సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. నామినేషన్ ప్రక్రియలో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు ఈవారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ కావడం షో చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. దీంతో మంగళవారం ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

వాటర్ రేషన్ కట్

వాటర్ రేషన్ కట్

సోమవారం ఎపిసోడ్ ముగింపు సమయంలో ఇచ్చిన ప్రోమోలో.. ‘బిగ్ బాస్' హౌస్‌లోని కంటెస్టెంట్లకు ఊహించిన షాక్ ఇచ్చాడు. మంగళవారం నుంచి వాటర్, రేషన్ కట్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్ అందరూ అవాక్కైపోయారు. అంతేకాదు, వరుణ్ సందేశ్ ఒకింత ఆగ్రహంతో కెమెరా వైపు చూడడం కనిపించింది.

 సైకిల్ టాస్క్

సైకిల్ టాస్క్

వాటిని కట్ చేసినప్పటికీ తిరిగి పొందేందుకు కంటెస్టెంట్‌లు అందరికీ ‘బిగ్ బాస్' ఓ ఛాన్స్ ఇచ్చాడు. ఒకవేళ మళ్లీ వాటిని పునరుద్దరించాలంటే.. ఎవరైన ఇద్దరు కంటెస్టెంట్లు జిమ్ ఏరియాలో ఉన్న సైకిళ్లను ఆగకుండా తొక్కుతూనే ఉండాలన్న కండీషన్ పెట్టాడు. తమ నుంచి ఆదేశం వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగాలని చెప్పాడు.

రాహుల్‌కు స్పెషల్ టాస్క్

రాహుల్‌కు స్పెషల్ టాస్క్

కంటెస్టెంట్లలో ఒకరైన రాహుల్ సింప్లీగంజ్‌కు ‘బిగ్ బాస్' సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. దీనిని తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. అతడికి ఏం టాస్క్ ఇచ్చారన్నది సస్పెన్స్‌గా ఉంచారు షో నిర్వహకులు. అయితే, రాహుల్ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో హౌస్‌మేట్స్ అందరూ అతడికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని అనుకుంటూ ఉంటారు.

విలన్ అన్న తమన్నా

విలన్ అన్న తమన్నా

ఇదే ప్రోమో చివర్లో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటరైన తమన్నా.. ‘టాస్క్‌లో పశుపతి.. విలన్ వాడు ఇక్కడ' అంటూ సీరియస్ డైలాగ్ చెప్పింది. దీంతో ఈ ప్రోమో ముగిసింది. ఇది చూసిన తర్వాత మంగళవారం ఎపిసోడ్‌లో ఏదో జరగబోతుందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

స్పెషల్ అట్రాక్షన్‌గా తమన్నా

సీనియర్ నటి హేమ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటరైన విషయం తెలిసిందే. మొదటి రోజు ఇంటిలోకి అడుగు పెడుతూనే ‘పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్' అని డైలాగ్ చెప్పిన ఆమె.. పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X