Just In
Don't Miss!
- News
కూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హౌస్‌లోకి ఎంటరైన తమన్నా.. ఫస్ట్ డైలాగ్‌తోనే షాకిచ్చింది.. అవాక్కైన కంటెస్టెంట్స్
'బిగ్ బాస్' సీజన్ - 3 మొదలైన వారం రోజులకే చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తొలి ఎపిసోడ్ నుంచే కంటెస్టెంట్లు ఏడుపులు, గొడవలు, తిట్టుకోవడాలు చేస్తుండడంతో ఈ షో అప్పుడే చర్చనీయాంశం అయింది. ఇక, మొదటి ఎలిమినేషన్‌లోనైతే ఎటువంటి ట్విస్టులు కనిపించలేదు. మొదటి నుంచి అనుకున్నట్లు సీనియర్ నటి హేమ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాతే 'బిగ్ బాస్' భారీ ట్విస్ట్ ఇచ్చాడు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ
వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఇది ‘బిగ్ బాస్' ప్రేక్షకులకు కొత్త కాకపోయినా.. మొదటి ఎలిమినేషన్ అయిపోయిన రోజే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒకరిని లోపలికి పంపించడం షాకింగ్‌గా అనిపించింది. అంతకు మించిన ట్విస్ట్ అంటే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటరైంది తెలుగు రాష్ట్రాల్లోని అందరికీ సుపరిచితురాలైన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి కావడం విశేషం.

కాన్ఫిడెంట్‌గా చెప్పి..
స్టేజ్‌పై తమన్నా మాట్లాడుతూ.. తన కల నెరవేరిందని చెప్పారు. ట్రాన్స్‌జెండర్‌ను అయిన తనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. తానేంటో నిరూపించుకుంటానని.. హౌజ్‌లో చివరి వరకు ఉంటానని అన్నారు. బయటికి వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన కుటుంబం చేసుకుంటానని కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

సీక్రెట్‌గా ఉంచుతారనుకున్నారు
ఆదివారం ఎపిసోడ్ ఎండింగ్‌లో తమన్నా వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్నట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున చెప్పాడు. అయితే, ఆమె హౌస్ లోనికి ఎప్పుడు వెళ్లాలి అనేది మాత్రం ‘బిగ్ బాస్' నిర్ణయిస్తాడని వెల్లడించాడు. దీంతో తమన్నాను రెండు మూడు రోజుల సీక్రెట్‌గా ఉంచి, ఆ తర్వాత లోపలికి పంపుతారేమో అనుకున్నారు.
సోమవారమే ఎంట్రీ
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తమన్నాను సోమవారమే హౌస్ లోపలికి పంపించారు. ఈ మేరకు స్టార్ మా యాజమాన్యం ఓ ప్రోమోను కూడా విడుదల చేసింది. ఇందులో తమన్నా మెయిన్ డోర్ ద్వారా లోపలికి ప్రవేశించింది. ఆ సమయంలో ఆమెను చూసిన మిగిలిన కంటెస్టెంట్లు అవాక్కైపోవడం స్పష్టంగా కనిపించింది.

‘పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్'
డోర్ దగ్గర నుంచి తమన్నాను శ్రీముఖి, రోహిణి లోపలికి తీసుకు వెళ్లారు. తమన్నా లగేజ్‌ను శ్రీముఖి తీసుకెళ్లడం కనిపించింది. ‘పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్' అని ఆమె చెప్పిన డైలాగ్‌తో ఈ ప్రోమో ఎండ్ అయింది. ప్రస్తుతం హౌస్‌లో 15 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఏడుగురు మగాళ్లు, ఏడుగురు ఆడవాళ్లు, ఒక ట్రాన్స్‌జెండర్ కావడం విశేషం.