రవి అంటే నాకిష్టం.. అందుకే రెచ్చగొట్టా.. నా మీద ప్రేమ లేకుంటే అలా అడుగేవాడా: తమన్నా

సీనియర్ నటి హేమ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటరైన విషయం తెలిసిందే. మొదటి రోజు ఇంటిలోకి అడుగు పెడుతూనే 'పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్' అని డైలాగ్ చెప్పిన ఆమె.. అదే రీతిలో వ్యవహారాలు నడిపింది. మొదట ఆమె.. వరుణ్, వితికల విషయంలో తమన్నా తీసుకున్న స్టాండ్ అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక, తమన్నా ఎలిమినేషన్‌కు కారణమైన రవి ఎపిసోడ్ కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో అసలు రవిని ఆమె ఎందుకు టార్గెట్ చేసింది..? వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది..? అనే విషయాలపై తమన్నా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే....

 రవికి చీరలు కట్టుకుంటే ఇష్టం

రవికి చీరలు కట్టుకుంటే ఇష్టం

రవికృష్ణ గురించి చెబుతూ.. ‘రవికి నేను చీరలు కట్టుకోవడం అంటే ఇష్టం. చీరలు కట్టుకోమని నాతో రెండు మూడు సార్లు అన్నాడు. కానీ, నాకు మోడ్రన్ డ్రెస్‌లు అంటే ఇష్టం ఉండడం వల్ల చీరలు కట్టుకునే దాన్ని కాదు. నేను వైట్ డ్రెస్ వేసినప్పుడు.. ఇదే ఉంచుకో.. నేను కూడా వైట్ షర్ట్ వేసుకుంటా అన్నాడు. కానీ, నేను ఆ డ్రెస్ తీసేశాను. అప్పుడు తనకు కోపం వచ్చింది' అని తమన్నా చెప్పుకొచ్చింది.

అషు రెడ్డితో చెప్పి పంపాడు

అషు రెడ్డితో చెప్పి పంపాడు

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో రవి కోసం చేసిన ఒక పనిని వివరిస్తూ ‘నేను వెళ్లిపోతానేమోనని డౌట్ వచ్చి రవికి ఇష్టం అని తన కోసం ప్లెయిన్ శారీ కట్టుకున్నాను. అప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నప్పటికీ నా శారీ అతడికి నచ్చింది. అప్పుడు నేను చీరలో చాలా బాగున్నానని అషు రెడ్డికి చెప్పి పంపాను. అంతేకాదు, ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్‌లు వేసుకుంటుంది. చీరలో చాలా బాగుంది. ఇవే కట్టుకోమని చెప్పు అన్నాడంట' అని ఆమె వివరించింది.

రవిని అందుకే రెచ్చగొట్టాను

రవిని అందుకే రెచ్చగొట్టాను

రవితో జరిగిన గొడవ గురించి స్పందిస్తూ.. ‘నాకు రవి అంటే ఇష్టం. అందుకే అతడిని నేను రెచ్చగొట్టాను. కాబట్టే అతడు హీరోయిజం చూపించాడు. టాస్కులో చేత్తో అద్దం పగలగొట్టేశాడు. నేను అతడితో అలా ప్రవర్తించడం వల్ల రవి హీరోనే అయ్యాడు కదా. రవి అందరిలో దాక్కోవడం నాకు నచ్చలేదు. అందుకే అతడి కోసం మొదటి నుంచి నేను అదే ఫైట్ చేసే దాన్ని' తమన్నా సింహాద్రి పేర్కొంది.

నైట్ మాట్లాడుకునే వాళ్లం

నైట్ మాట్లాడుకునే వాళ్లం

అందరిలో కలువు.. నీ మార్క్ చూపించు అని రవితో చాలా సార్లు చెప్పానని తమన్నా చెప్పింది. అంతేకాదు, ‘నైట్ టైమ్‌లో కూర్చుని ఇద్దరం మాట్లాడుకునే సమయంలో కూడా అదే చెప్పేదాన్ని. ఎందుకంటే రవి బయట హీరో కాబట్టి.. హౌస్‌లో కూడా హీరోయిజం కనిపించాలని అనుకునేదాన్ని. అందుకే అతడిని స్టాండ్ తీసుకోమని చెప్తుండేదాన్ని. కానీ, తను మాత్రం స్వర్ధంతో ఉంటాడు' అని వెల్లడించింది.

 ప్రేమ లేకపోతే అడిగేవాడా?

ప్రేమ లేకపోతే అడిగేవాడా?

తామిద్దరి మధ్య గొడవలు జరిగినప్పటికీ రవి తనతో మాట్లాడడానికి ప్రయత్నించాడని తమన్నా తెలిపింది. ‘గొడవ జరిగిన తర్వాత.. నేను బయటకు వచ్చే వరకు నీతో మాట్లాడాలి అని రవి చాలా సార్లు అన్నాడు. ప్రేమలో అలకలు ఉంటాయి కాబట్టి నేను మాట్లాడలేదు. నా బాధ తనకు తెలియాలి కదా. ప్రేమ లేకుండానే రవి నాతో మాట్లాడాలి అని అడిగాడా..?' అని ఎదురు ప్రశ్న వేస్తూ అడిగింది తమన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X