వరుణ్, వితిక ప్రవర్తన నచ్చలేదు.. వాళ్లను విడగొట్టడమే నా లక్ష్యం: తమన్నా సెన్సేషనల్ కామెంట్స్
హేమ ఎలిమినేట్ అయిన తర్వాత సోమవారం నుంచి 'బిగ్ బాస్' సీజన్ - 3 రెండో వారం ప్రారంభమైంది. ఎప్పటి లాగే వారం మొదటి రోజు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇందుకోసం ఒక్కో కంటెస్టెంట్‌ను ఇద్దరి పేర్లను నామినేట్ చేయాల్సిందిగా కోరారు. మొత్తంగా ఎలిమినేషన్ ప్రక్రియ నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఈ సమయంలో ఆరోజే ఇంటిలోకి ప్రవేశించిన తమన్నా సింహాద్రి ఇద్దరి పేర్లను చెప్పింది. అంతేకాదు, ఆ సమయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

సీక్రెట్ నామినేషన్
సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందుకోసం ‘బిగ్ బాస్' ఒక్కో కంటెస్టెంట్‌ను కన్‌ఫెషన్ రూంకి పిలిచి.. నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరి పేర్లను, అందుకు కారణాలను వెల్లడించాలని ఆదేశించాడు. అయితే, ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన తమన్నాను నామినేట్ చేయడానికి వీలు లేదని చెప్పాడు.

ఒకేసారి ఎనిమిది మంది
నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చే కంటెస్టెంట్లుగా శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు నామినేట్ అయ్యారు. ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ కావడం షో చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.

తమన్నాకు వాళ్లే టార్గెట్
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ‘బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చిన తమన్నా సింహాద్రి.. వరుణ్ సందేశ్, వితిక షేరును నామినేట్ చేసింది. వీళ్లిద్దరి తీరు తనకు నచ్చలేదని తెలిపింది. అలాగే, తామంతా ఒంటరిగా ఉంటే వాళ్లిద్దరూ మాత్రం కలిసి ఉన్నారని, ఎలాగైనా విడదీయాలనే లక్ష్యంతో వీళ్లను నామినేట్ చేస్తున్నానని ఆమె చెప్పింది.

వచ్చిన వెంటనే ఫోకస్ చేసింది
తమన్నా వచ్చిన వెంటనే మహేశ్ విట్టాకు మద్దతుగా మాట్లాడింది. ఇక హౌస్‌లో మహేష్ విట్టాతో వరుణ్, వితికాలు వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదని.. అసలు మహేష్ వాళ్లకు సారీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు తమన్నా. నేను హౌస్‌లో వరుణ్ సందేశ్ ఆడుకుందామని వచ్చానని.. అతని ప్రవర్తన తనకు నచ్చలేదన్నారు తమన్నా.

తమన్నా తీరుతో విస్మయం
తమన్నా ఒక వారం బయట నుంచి షోను చూడడంతో ఆమెకు ఎవరెలాంటి వాళ్లో తెలిసిపోయింది. దీనికితోడు, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా అర్థం చేసుకుంది. దీంతో అక్కడ ప్లాన్ ప్రకారం అడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో వరుణ్, వితికల విషయంలో తమన్నా తీసుకున్న స్టాండ్ అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.


Click it and Unblock the Notifications











