అందంగా ఉన్నో హీరో కాదు.. సిక్స్‌ప్యాక్ ఉన్నంత మాత్రాన మగాడు కాలేడు.. తమన్నా రచ్చ రచ్చ
Recommended Video
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో గురువారం (ఆగస్టు 1న) మరోసారి గందరగోళం నెలకొన్నది. పవర్ గేమ్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య గొడవలు, మాటలు రువ్వుకోవడం జరిగింది. ఓ దశలో అలీ రజాపై తమన్నా ఒంటికాలిపై లేచింది. తీవ్ర పదజాలంలో దూషించింది. దాంతో ఇంటి సభ్యులకు, తమన్నా మధ్య వాడివాడిగా మాటల యుద్ధం జరిగింది. ఇంతకు ఈ గొడవకు కారణమేమింటంటే..

పవర్ టాస్క్ గేమ్ కోసం
ఇంటిలో కెప్టెన్ ఎంపిక కోసం పవర్ గేమ్ టాస్క్‌ను బిగ్‌బాస్ నిర్వహించాడు. అందులో భాగంగా ఓ కిరీటం, డైమండ్ లాన్‌లో పెట్టి.. బజర్ మోగగానే వాటిని ముట్టుకొన్న వ్యక్తి ఇంటి పెద్దగా వ్యవహరించే అవకాశం దక్కుతుంది. మొదటి బజర్ మోగగానే వరుణ్ సందేశ్ డైమండ్‌ను పట్టుకొన్నాడు. దాంతో మొదటి ఇంటి పెద్దగా వరుణ్ వ్యవహరించాడు. ఇంటి సభ్యులతో డ్యాన్సులు వేయించాడు.

రెండోసారి అలీ రజా
రెండోసారి బజర్ మోగగానే అలి రజా డైమండ్‌ను సొంతం చేసుకొని ఇంటి సభ్యులను లీడ్ చేసే అవకాశాన్ని దక్కించుకొన్నాడు. అప్పుడు ఇంటి పెద్దగా వ్యవహరించిన అతడు.. ఇంటి సభ్యులకు ఓ టాస్క్ పురమాయించాడు. అందులో మహిళలు, పురుషుల దుస్తులు.. పురుషులు మహిళల దుస్తులు ధరించాలని సూచించాడు. అప్పుడే ట్రాన్స్‌జెండర్ తమన్నా ఊగిపోయింది.

అలీపై తమన్నా మండిపాటు
తనను కించపరిచే విధంగా వ్యవహరించారనే కోపంతో అలి రజాను నోటికి వచ్చినట్టు తిట్టింది. అందంగా ఉండగానే సరిపోదు. సినిమా ఇండస్ట్రీలో నీవు ఎప్పటికీ సూపర్‌స్టార్ కాలేవు. అందంగా ఉంటే హీరో కాలేడు.. సిక్స్‌ప్యాక్ ఉన్నంత మాత్రాన మగాడు అనుకోవద్దు అని తమన్నా ఘాటుగా మాటలను సంధించింది.

కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు
తమన్నా అంతటితో ఆగకుండా అలీ రజాపై మాటల యుద్ధం కొనసాగించింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వీడికి కిరిటం దొరికింది. ఆడపిల్లను పక్కన కూర్చొపెట్టుకోవడానికి సిగ్గు, శరం లేదు అంటూ స్వరాన్ని పెంచింది. దాంతో సావిత్రి, ఇతర మహిళా సెలబ్రిటీలు తమన్నాతో వాగ్వాదానికి దిగారు. అయినా తమన్నా తన పట్టు వదలకుండా అందరితో గొడవకు సిద్ధమైంది.

లింగమార్పిడితో పోరాటం చేసి
ఇంటి సభ్యుల సమావేశంలో తన గురించి తమన్నా మాట్లాడుతూ.. నేను లింగమార్పిడి చేయించుకొని సమాజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను. కుటుంబాన్ని కోల్పోయాను. ఒంటరిగా పడుకోవడానికి భయపడుతున్నాను. అందంలో తక్కువేమీ కాదని.. గ్లామర్‌ను మెయింటెన్ చేస్తున్నాను. రాబోయే ట్రాన్స్‌జెండర్స్ తరానికి మార్గదర్శకంగా ఉండాలని పోరాటం చేస్తున్నాను అని తమన్నా కంటతడి పెట్టుకొన్నది.

ఇంటి కెప్టెన్‌గా వరుణ్ సందేశ్
ఇక పవర్ టాస్క్‌లో డైమండ్‌ను సొంతం చేసుకొన్న ముగ్గురిలో వరుణ్ సందేశ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. బిగ్‌బాస్ 3 సీజన్‌లో ఈయనే తొలి కెప్టెన్. ఇంటికి సంబంధించిన వ్యవహారాలను బిగ్‌బాస్ వరుణ్ చేతిలో పెట్టాడు. దాంతో ఈ ఎపిసోడ్ గందరగోళం మధ్య ముగిసిపోయింది.


Click it and Unblock the Notifications











