Tamannaah Bhatia's November Story review.. అదరగొట్టిన మిల్కీ బ్యూటీ!

నటీనటులు: తమన్నా భాటియా, పశుపతి, జీఎం కుమార్, వివేక్ ప్రసన్న, అరుల్‌దాస్ తదితరులు
రచన, దర్శకత్వం: ఇంద్ర సుబ్రమణ్యం,
నిర్మాత: ఆనంద వికటన్
మ్యూజిక్: శరణ్ రాఘవన్
సినిమాటోగ్రఫి: విధు అయ్యన్న
ఎడిటర్: శరణ్ గోవింద్‌సామి
ఓటీటీ స్ట్రీమింగ్: డిస్నీ+హాట్ స్టార్
రిలీజ్: 2021-05-20

ఏడు ఎపిసోడ్స్‌గా నవంబర్ స్టోరీ

ఏడు ఎపిసోడ్స్‌గా నవంబర్ స్టోరీ


మిల్కీ బ్యూటీ తమన్నా వెండితెరపైనే కాకుండా వెబ్ సిరీస్‌తో ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల 11th hour‌తో పూర్తిస్థాయిలో మెప్పించ లేకపోయిన తమన్నా మరోసారి నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్నది. మొత్తం 7 ఏపిసోడ్స్‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందింది.

ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడే..

ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడే..

నవంబర్ స్టోరి వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడే తండ్రి కోసం తప్పన పడే అనురాధ క్యారెక్టర్‌లో తమన్నా నటించింది. క్లాసిక్ మర్డర్ మిస్టరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సీరిస్‌లో తొలి ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మలిచి తర్వాత ఎపిసోడ్స్‌పై మరింత క్రేజ్‌ను పెంచేలా దర్శకుడు ఇంద్ర సుబ్రమణ్యం సఫలమయ్యారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా తమన్నా

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా తమన్నా

తమిళనాడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అనురాధ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటారు. అయితే గత సంవత్సరాలుగా గుట్టలు పేర్కొని పోయిన ఎఫ్ఐఆర్‌‌ను డిజిటలైజ్ చేసి సర్వర్‌లోకి అప్‌లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కానీ ఆ డేటాను హ్యాక్ చేసేందుకు ఓ అజాత హ్యాకర్‌కు చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు. ఇలా ప్రొఫెషనల్‌గా ఒత్తిడిలో ఉన్న అనురాధకు తండ్రి రూపంలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి.

శవం ముందు తండ్రి

శవం ముందు తండ్రి

ఇదిలా ఉండగా, తన తండ్రి సంపాదించిన ఇంటిని అమ్మేందుకు కష్టాలు పడుతుంటుంది. ఆ క్రమంలో తన ఇంటిలో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిన తండ్రి తమ పాత ఇంటిలో ఓ శవం ముందు కనిపించే ట్విస్టుతో తొలి ఎపిసోడ్‌ను ముగించారు. దీంతో రెండో ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచారు. టెక్నికల్‌గా, స్క్రిప్టు పరంగా అద్బుతమైన విలువలు ఉన్నట్టు తొలి ఎపిసోడ్ హింట్ ఇచ్చింది.

Recommended Video

Super Star Krishna And Vijaya Nirmala’s Grandson Sharan New Movie Opening | Filmibeat Telugu
అదరగొట్టిన తమన్నా భాటియా

అదరగొట్టిన తమన్నా భాటియా

నవంబర్ స్టోరి వెబ్ సిరీస్‌లో తొలి ఎపిసోడ్‌లోనే తమన్నా భాటియా తన నటనతో ఆకట్టుకొన్నారు. రకరకాల ఎమోషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, తండ్రి ఆరోగ్యం కోసం ఆరాటపడే కూతురిగా, కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఇబ్బందులను ఎదుర్కొనే యువతిగా తమన్నా భాటియా బాగా నటించింది. మిగితా నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు రాణించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X