For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ షోలో స్టార్ హీరోయిన్.. సమంత తర్వాత వచ్చేది ఆ బ్యూటీనే!

  |

  గతంలో మాదిరిగా కాకుండా ఈ మధ్య కాలంలో సరికొత్త కాన్సెప్టులతో వచ్చే షోలను బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుకే ఐదారేళ్లుగా టెలివిజన్‌పై ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ఇందులో అన్ని షోలూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నాయి. అయితే, ఒక్కటి మాత్రం ప్రేక్షకలను కోటీశ్వరులను చేసే ఉద్దేశంతో ప్రసారం అవుతోంది. అదే క్విజ్ ఆధారంగా నడిచే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ సారథ్యంలో మరొకటి మొదలైంది. దీనికి ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. ఈ క్రమంలోనే మరో స్టార్ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుందట. ఆ వివరాలు మీకోసం!

   నాలుగు సీజన్లు.. ఇద్దరు స్టార్ హీరోలు

  నాలుగు సీజన్లు.. ఇద్దరు స్టార్ హీరోలు

  ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ' ఆధారంగా తెలుగులోకి పరిచయం అయిన కార్యక్రమమే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. సామాన్యులను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మొదలైన ఇది హిట్ అయింది. ఫలితంగా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం చిరంజీవి హోస్ట్ చేశారు.

  హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  రామరావు రాకతో మొత్తం మారిందిగా

  రామరావు రాకతో మొత్తం మారిందిగా

  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' షో విజయవంతం అయినా నిర్వహకులు గ్యాప్ తీసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ‘ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్‌తో ఐదో సీజన్ మొదలు పెట్టారు. దీన్ని స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేస్తున్నారు. ఈ సీజన్‌ను టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ రామారావు నడిపిస్తున్నాడు.

  రామ్ చరణ్ ఎంట్రీ.. రికార్డులు బద్దలు

  రామ్ చరణ్ ఎంట్రీ.. రికార్డులు బద్దలు

  ఎన్నో అంచనాలతో ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షోను ఆగస్టు 22న అంగరంగ వైభవంగా ప్రారంభించారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సారథ్యంలో మొదలైన ఈ సీజన్‌ కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఎపిసోడ్‌కు 11.40 రేటింగ్ దక్కింది. దీంతో ఈ షో చరిత్రలో సరికొత్త రికార్డు సొంతం అయింది.

  స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

  జక్కన్న, కొరటాల శివ కూడా వచ్చారు

  జక్కన్న, కొరటాల శివ కూడా వచ్చారు

  గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకు ప్రతి ఆదివారం ఎవరో ఒక సెలెబ్రిటీ గెస్టుగా వచ్చేవారు. అయితే, ఈ సారి మాత్రం ఇది సోమవారం నుంచి గురువారం వరకే ప్రసారం అవుతోంది. దీంతో స్పెషల్ డేన మాత్రమే గెస్టులు వస్తున్నారు. రామ్ చరణ్ తర్వాత ఈ షోకు దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ కలిసి వచ్చారు. ఈ ఎపిసోడ్‌కు కూడా మంచి స్పందనే వచ్చింది.

  దసరాకు సమంత.. దీపావళికి మహేశ్

  దసరాకు సమంత.. దీపావళికి మహేశ్

  ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు మరింత మంది సెలెబ్రిటీలను తీసుకు రావాలని షో నిర్వహకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ హీరోయిన్ సమంతతో రెండు స్పెషల్ ఎపిసోడ్స్ కూడా చేసేశారు. వీటికి సంబంధించిన వివరాలూ బయటకు వచ్చాయి. సామ్ ఎపిసోడ్‌ దసరాకు, మహేశ్ పాల్గొన్న దానిని దీపావళికి ప్రసారం చేస్తారు.

  Bigg Boss: ఐదో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. తక్కువ ఓట్లు ఆమెకు.. బయటకు వెళ్లేది మాత్రం అతడే!

   ఎన్టీఆర్ షోలో మరో స్టార్ హీరోయిన్

  ఎన్టీఆర్ షోలో మరో స్టార్ హీరోయిన్

  స్పెషల్ గెస్టులు వచ్చిన ఎపిసోడ్ల వల్ల ‘ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు మరింత ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మందిని ఇందులో భాగం చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ షోకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకు రాబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ షూట్ చేయబోతున్నారని టాక్.

   ఆ షో నుంచి తప్పుకున్నా.. ఇందులో

  ఆ షో నుంచి తప్పుకున్నా.. ఇందులో

  గతంలో మాదిరిగా వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. తమన్నా ఇప్పుడు షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే జెమినీలో ‘మాస్టర్ చెఫ్' అనే వంటల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తుంది. అయితే, దీని నుంచి ఆమె తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడామె అదే ఛానెల్‌లో వచ్చే ‘ఎవరు మీలో కోటీశ్వరులు'కు రాబోతుందని అంటున్నారు.

  English summary
  Jr NTR's Doing Evaru Meelo Koteeswarulu Show in Gemini Tv. Tamannaah Will Entry to This Show in Coming Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X