చెడ్డవాళ్లం కాదు.. అందుకే బిగ్‌బాస్‌కు వచ్చా.. జాఫర్‌కు తమన్నా ఝలక్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో తమన్నా సింహాద్రిని ఇంటిలోకి పంపడం సెన్సేషన్‌గా మారింది. అయితే తమన్నా ట్రాన్స్‌జెండర్ (లింగ మార్పిడి చేసుకొన్న మహిళ) కావడమే ఆ సన్సేషన్‌కు కారణమన్న సంగతి తెలిసిందే. తమన్నా ముక్కుసూటిగా మాట్లాడటం కొన్ని సందర్బాల్లో వివాదాలకు కేంద్ర బిందువు అయింది. కొద్ది రోజుల క్రితం ఆడ, మగ అంటూ అలి రజా చేసిన వ్యాఖ్యలపై తమన్నా తీవ్రంగా మండిపడింది.

తాజాగా జాఫర్ ఎలిమినేట్ అయ్యాక బిగ్‌బాస్ వేదికపై జాఫర్ నిర్వహించిన వేదికపై నుంచి తమన్నాను ఓ ప్రశ్న అడిగారు. తమన్నా మీరు ఎందుకు బిగ్‌బాస్‌కు వచ్చారు అంటూ ప్రశ్నించారు. అందుకు తమన్నా సమాధానం ఇస్తూ.. ట్రాన్స్‌జెండర్స్‌పై తప్పుడు అవగాహన ఉంది. టాన్స్‌జెండర్స్ అంటే చెడ్డవాళ్లే కాదు. మంచి వాళ్లు కూడా ఉంటారు. ఆ విషయాన్ని తెలియజేయడానికి బిగ్‌బాస్ నాకు చక్కటి అవకాశం ఇచ్చింది. అందుకే ఈ హౌస్‌ను నేను వచ్చాను అని తమన్నా చెప్పారు.

Tamannah Simhadri clarity on Transgender issue

ఆ తర్వాత తమన్నా మాట్లాడిన అంశంపై అలి రజా మాట్లాడుతూ.. తనతో గొడవ జరిగిన తర్వాత నేను తమన్నాతో కలిసి మాట్లాడాను. ఆమె ఇంటెన్షన్ ఏమిటో తెలుసుకొన్నాను. ఆమె మనోభావాలకు నేను గౌరవించాలనుకొంటున్నాను అని అన్నారు. తమ మధ్య ఉన్న అభిప్రాయబేధాలు అంతటితో ముగిసిపోయాయి అని అన్నారు.

బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్‌లో గత కొద్దిరోజులుగా ఇంట్లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకొన్నాయి. ఒకరికి ఇంకోకరికి మధ్య గొడవలు అప్పుడే మొదలయ్యాయి. పలువురు సెలబ్రిటీల మధ్య మధ్య మాటల యుద్ధం ఊపందుకొన్నది. ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X