బిగ్ బాస్ తమిళ్ రియాల్టీ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ ఆమెకేనా? రోజుకు ఎంతంటే?
తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్ 3' ఆసక్తికరంగా సాగే ఎపిసోడ్లతో పాటు పలు వివాదాల కారణంగా సూపర్ రేటింగ్స్ సాధిస్తూ దూసుకెళుతోంది. ప్రస్తుతం ఈ షోలో మొత్తం 9 మంది కొనసాగుతున్నారు. వారిలో వనితా విజయ్ కుమార్ ఒక సారి ఎలిమినేట్ అయి... వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ పాల్గొన్న కొందరి రెమ్యూనరేషన్ వివరాలు లీకవ్వడం తమిళ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈ షోలో పాల్గొన్న అందరి కంటే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునేది ఆవిడేనంట. ఆమెకు మంచి డిమాండ్ ఉండటం వల్లనే నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ ఇంట్లోకి పంపినట్లు తెలుస్తోంది.

వనితా విజయ్ కుమార్ రోజుకు రూ. 2.5 లక్షలు
వనితా విజయ్ కుమార్ బిగ్ బాస్ షో కోసం కోసం రోజుకు రూ. 2.5 లక్షలు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇంట్లో క్రియేట్ చేస్తున్న వివాదాలు, బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో చలాకీగా పాల్గొనడం, ఇతర ఇంటి సభ్యులతో ప్రవర్తిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉండటంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉందట.

ఇపుడు డిమాండ్ మరింత పెరిగింది
వనితా విజయ్ కుమార్ మొదట ఇంట్లోకి ప్రవేశించినపుడు రోజుకు రూ. 1.5 లక్షలు మాత్రమే చార్జ్ చేశారు...ఇది కూడా ఇంట్లో ఉండే అందరికంటే అత్యధిక మొత్తమే. ఆమె ఉండటం వల్ల షో రేటింగ్స్ పెరుగుతుండటంతో రెండో సారి రోజుకు రూ. 2.5 లక్షలు ఆఫర్ చేసి మరీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చేరన్ రోజుకు రూ. 1 లక్షల
చేరన్ అనే మరో కంటెస్టెంట్ రోజుకు రూ. 1 లక్ష చొప్పున చార్జ్ చేసినట్లు సమాచారం. ఆయనకు ఆల్రెడీ రూ. 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మరీ షోలోకి తీసుకున్నట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరికొందరు కంటెస్టెంట్ల పేమెంట్స్ వివరాలు కూడా బయటకు లీక్ అయ్యాయి.

ఇతర సభ్యులు ఎవరు ఎంత?
శరవణన్ రోజుకు రూ. 80 వేలు, కవిన్ రోజుకు రూ. 50 వేలు, థర్శన్ రోజుకు రూ. 50 వేలు, ముగెన్ రోజుకు రూ. 50 వేలు, లోస్లియా రోజు రూ. 50 వేలు, మధుమిత రోజుకు రూ. 80 వేలు, కస్తూరి రోజుకు రూ. 1.25 లక్షలు, షెరిన్ రోజుకు రూ. 80 వేలు చార్జ్ చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











