Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్‌బాస్‌లో సుచీలీక్స్... వైల్డ్ కార్డ్ ఎంట్రీతో భయపెడుతున్న సుచిత్ర
అసలు ఈ ఏడాది బిగ్ బాస్ నిర్వాహకులకు పని ఉంటుందా లేదా అని అనుమానాలు ఎక్కువవుతున్న తరుణంలో కింగ్ నాగార్జున తెలుగులో ధైర్యంగా స్టార్ట్ చేశాడు. రేటింగ్ కూడా బాగానే ఉంటుందని కంటెస్టెంట్స్ విషయంలో పెద్దగా ఆలోచించలేదని అర్ధమయ్యింది. అయితే తమిళ్ లో మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు చాలా మంది కాంట్రవర్సీ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపారు. గత సీజన్స్ తో పోలిస్తే కమల్ హాసన్ కూడా సరికొత్త షోను నడిపిస్తున్నారు.
గోడవలతో తమిళ్ బిగ్ బాస్..
16 మంది కంటెస్టెంట్స్ తో తమిళ్ బిగ్ బాస్ షోను స్టార్ట్ చేశారు. అందులో సినీ నటులతో పాటు టెలివిజన్ యాంకర్స్, నటులు, సింగర్లు యూ ట్యూబ్ స్టార్స్ కూడా ఉన్మారు. ఇక గత వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో VJ అర్చన కూడా హౌజ్ లోకి అడుగు పెట్టింది. మొత్తంగా తమిళ్ బిగ్ బాస్ షో కాంట్రవర్సీ గోడవలతో బాగానే హైప్ క్రియేట్ చేస్తోంది.
తమిళ్ బిగ్ బాస్‌లో సూచి లీక్స్
అంతా బాగానే ఉంది కాని ఎదో తక్కువయ్యిందని అనుకున్నారో ఏమో గాని హౌజ్ లోకి నెవర్ బిఫోర్ అనేలా మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సూచి లీక్స్ తో కొన్నేళ్ల క్రితం సౌత్ ఇండస్ట్రీని గడగడ లాడించిన సింగర్ సూచిత్ర ఆదివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ లో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఈ న్యూస్ తో తమిళ్ బిగ్ బాస్ షో క్రేజ్ మరింత పెరిగింది.
సూచీ లీక్స్ తో భయపెట్టిన సింగర్
సూచీ లీక్స్ ట్యాగ్ తో అప్పట్లో ఈ సింగర్ పేరు ఒక్కసారిగా మారిపోయింది. ఆ లీక్స్ ద్వారానే ట్విట్టర్ గురించి తెలియని వారికి కూడా తెలిసింది అంటే ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ తరువాత తన ఎకౌంట్ హ్యాక్ కి గురయ్యిందని చెప్పినప్పటికీ కొంతమంది తారలు ఆమె మానసిక పరిస్థితిపై సెటైర్లు వేయడంతో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి.
మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ..
ఇక తమిళ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీలను సూచీలీక్స్ ఎంతగా బయపెట్టాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సూచిత్ర ఇప్పుడు బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో బిగ్ బాస్ లో ఆమె ఏ రేంజ్ లో హడావుడి చేస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా బిగ్ బాస్ లో ఒక కొత్త వాతావరణం క్రియేట్ అయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది.
షోలో ఇంకెంత రచ్చ చేస్తుందో..?
సూచిత్ర మానసిక పరిస్థితి బాగాలేదనే కారణంగా ఇండస్ట్రీలో ఎవరు కూడా ఆమెకి ఛాన్స్ లు ఇవ్వడం లేదని ఒక టాక్ అయితే వస్తోంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంటే ఆమె ఏ విధంగా మారుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక షో ద్వారా ఆమెకు ఏమైనా లాభం చేకూరుతుందా లేదా అనేది చూడాలి.