»   »  అక్కడ ‘బిగ్ బాస్’ పెద్ద ప్లాప్... అలర్టయిన తెలుగు ‘బిగ్ బాస్’

అక్కడ ‘బిగ్ బాస్’ పెద్ద ప్లాప్... అలర్టయిన తెలుగు ‘బిగ్ బాస్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిందీలో తొలుత సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా 'బిగ్ బాస్' ప్రారంభమై సక్సెస్‍‌ఫుల్‌గా 10 సీజన్లు పూర్తి కావడంతో.... ఇతర భాషల్లో కూడా 'బిగ్ బాస్' రియాల్టీ షోను విస్తరిస్తున్నారు.

త్వరలో ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో 'బిగ్ బాస్' రియాల్టీ షో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో తెలుగులో ఈ షో ప్రారంభం కాబోతోంది. కాగా ఇప్పటికే తమిళంలో కమల్ హాసన్ హోస్ట్‌గా 'బిగ్ బాస్' షో ప్రారంభం అయింది. అయితే తమిళంలో 'బిగ్ బాస్' పెద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

 Tamil Bigg Boss Flop Talk

తమిళ బిగ్ బాస్ తొలి అడుగులోనే ఇలా కావడంతో ...తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. పోటీదారుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తమిళ 'బిగ్ బాస్' షో తొలి భాగం ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కాగా చాలా తక్కువ రేటింగ్ వచ్చిందట. ఈ షో అంత ఆసక్తికరంగా సాగడం లేదని, షోలో సెన్సాఫ్ హ్యూమర్ లేక పోవడం కూడా ఇందుకు కారణమని అంటున్నారు.

తమిళ బిగ్ బాస్ షోలో మొత్తం 15 మంది పోటీదారులు ఉండగా.... అందులో 5 ఫేసులు మాత్రమే బాగా పాపులర్. నమిత, ఓవియా, గాయత్రి రఘురామ్, గణేష్ వెంకట్రామన్, అనుయా మాత్రమే తమిళ ప్రేక్షకులకు బాగా తెలిసిన మొహాలు. మిగతా 10 మొహాలు ఎవరికీ పెద్దగా పరిచయం లేనివే.

ఇందులో ఇంకా జూలీ, వ్యాపురి, శ్రీ, స్నేహన్, హారతి, గంజా కరుపు, శక్తి వాసు, భరణి, అరవ్, రైజా విల్సన్ తదితరులు పోటీ పడుతున్నారు. ఇందులో జూలీ మాత్రమే సినిమా రంగంతో సంబంధం లేని వ్యక్తి. వీరంతా 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో గడుపుతారు. వారానికి ఒకసారి కమల్ హాసన్ ఎంటరై పోటీదారులను ఎలిమినేట్ చేస్తాడు. హౌస్ లో చివరి వరకు ఎవరు ఉంటారో వారే విజేతలు.

English summary
The maiden episode of Tamil Bigg Boss hosted by Kamal Haasan was aired on Sunday. To everyone's shock. The response for the reality show has been poor to say the least.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu