దొంగతనానికి పాల్పడిన టెలివిజన్ నటి.. మాయమాటలు చెప్పి..

పరిస్థితులు ఎలాంటివారినైనా తప్పటడుగులు వేసేలా చేస్తాయని ఒక అందమైన సీరియల్ నటి ద్వారా మరోసారి ఋజువయ్యింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఒక బుల్లితెర నటి ఏకంగా దొంగగా మారింది. అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రియుడితోనే కలిసి ఆమె దొంగతనం చేసిన విధానం హాట్ టాపిక్ గా మారింది.

సహజీవనం చేస్తునే దొంగతనం

సహజీవనం చేస్తునే దొంగతనం

తమిళ సీరియల్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సూచిత్ర. దైవమగల్ అనే సన్ టీవీ సీరియల్ ద్వారా ఆమెకు తమిళ జనాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ నటి పేరు ఇప్పుడు న్యూస్ ఛానెల్స్ లలో చర్చనీయాంశంగా మారింది. సహజీవనం చేస్తున్న వ్యక్తితోనే ఆమె దొంగతనం చేసింది.

 డ్రైవర్ తో ఎఫైర్..

డ్రైవర్ తో ఎఫైర్..

లాక్ డౌన్ కి ముందు సూచిత్ర కొన్ని సీరియల్స్ ద్వారా మంచి ఆదాయాన్ని అందుకుంది. అయితే గత కొన్ని నెలలుగా తమిళ సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ నిలిచిపోయాయి. షూటింగ్స్ లేక ఆర్టిస్టులు ఆర్థికంగా ఎంతగానో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక సూచిత్ర కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది. ఇక ఆమె ఒక డ్రైవర్ తో గత కొంతకాలంగా రహస్యంగా ఎఫైర్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

స్నేహం ప్రేమ వరకు వెళ్లింది.

స్నేహం ప్రేమ వరకు వెళ్లింది.

ఈ నటి ఇటీవల తమిళనాడు పన్రుతికి చెందిన మణికందన్‌ అనే డ్రైవర్ ని రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో చేరాలనే లక్ష్యంతో చెన్నైకి వచ్చిన అతను మనుగడ కోసం సీరియల్ నటీమణులకు డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించారు. ఇక మణికందన్ కి సుచిత్ర పరిచయమైన తరువాత వారి స్నేహం ప్రేమ వరకు వెళ్లింది.

ఎలాగైనా వాటిని దోచుకోవాలని

ఎలాగైనా వాటిని దోచుకోవాలని

ఇక లాక్ డౌన్ అనంతరం చెన్నైలో జీవితాన్ని కొనసాగించడం కష్టమని అనిపించడంతో నటి దొంగతనం చేయాలని అనుకుంది.

అందుకు మణికందన్‌ సొంత ఇంటిని ఎంచుకుంది. వారి సొంత ఊరికి వెళ్లి వారి ఇంటిలో ఆభరణాలను డబ్బును గమనించిన సుచిత్రా ఎలాగైనా వాటిని దోచుకోవాలని అనుకుంది.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
పరారీలో సీరియల్ నటి

పరారీలో సీరియల్ నటి

షార్ట్ ఫిల్మ్, యూ ట్యూబ్ ఛానెల్ కోసం డబ్బు తప్పక అవసరమని మణికందన్‌ కి మాయమాటలు చెప్పిన సూచిత్ర అతనితో కలిసి సొంత ఇంట్లోనే డబ్బును కాజేసింది. బంగారం, డబ్బు కనిపించకపోవడంతో మణికందన్‌ తల్లీ దండ్రులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఇక చివరకు సూచిత్రనే ఈ దొంగతనం చేసినట్లు బయటపడింది. కానీ ఆమె అప్పటికే పారిపోయింది. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X