ఛానళ్లకు సహకరించుకుంటూ పోతే మనుగడకే ముప్పు: తమ్మారెడ్డి భరద్వాజ

By Srikanya

Tammareddy Bharadwaj
హైదరాబాద్: తమకు ఫలనా ఛానల్‌ అన్నం పెడుతోందని భావించి ఎవరికి వారు ఛానళ్లకు సహకరించుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఆర్టిస్టుల మనుగడకే ముప్పు ఏర్పడుతుందన్నారు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ డైరెక్టరీని ఫిలింనగర్‌లోని ఫిలింఛాంబర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఆయన ఆవిష్కరించారు. టీవీ ఆర్టిస్టులంతా ఒకటిగా ఉంటే ఏ ఛానల్‌ నడవని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

టీవీ ఆర్టిస్టులు సంఘటితమై డబ్బింగ్‌ సీరియల్స్‌ను అడ్డుకోవాలని... లేకుంటే రానున్న రోజుల్లో ఆర్టిస్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రెండు, మూడు నెలల్లో డబ్బింగ్‌ సీరియల్స్‌ను పూర్తిగా నిరోధించేలా ఆర్టిస్టులంతా కలిసి కట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. టీవీ ఆర్టిస్టులందరి కలర్‌ ఫొటోలు, ఫోన్‌ నెంబర్ల వివరాలతో డైరెక్టరీని విడుదల చేయడం ద్వారా టీవీ, సినీ షూటింగ్‌ల కోసం వారిని వినియోగించుకునే దర్శక, నిర్మాతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనిని ముద్రించడంపై ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ను ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

టీవీ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఎ.ప్రసాదరావు మాట్లాడుతూ తెలుగు టెలివిజన్‌ పరిశ్రమ ప్రస్తుతం సందిగ్ధ పరిస్థితిలో ఉందని ఇలాంటి పరిస్థితుల్లో టీవీ ప్రొడ్యూసర్స్‌, ఆర్టిస్ట్స్‌ కలిసి ఉద్యమిస్తే తప్ప పరిశ్రమను నిలబెట్టుకునే పరిస్థితి లేదన్నారు. ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ అధ్యక్షుడు డా||ఎం. వినోద్‌బాల, ప్రధాన కార్యదర్శి విజయ్‌యాదవ్‌ మాట్లాడుతూ టీవీ సీరియల్స్‌ల్లో నటించే ప్రతి ఆర్టిస్ట్‌ ముందుగానే నిర్మాతలతో ఫేమెంట్‌ విషయమై కమిట్‌మెంట్‌ చేసుకోవాలన్నారు.

అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న ఆర్టిస్టులకు మాత్రమే టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశం ఇవ్వాలని టీవీ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ప్రసాదరావును వారు కోరారు. కార్యక్రమంలో ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఉపాధ్యక్షుడు భార్గవ గుత్తికొండ, ఉపాధ్యక్షులు రామ్‌జగన్‌, జీఎస్‌ హరి, సహాయ కార్యదర్శులు పి.శ్రీనివాసులు, శ్రీశశాంక, కోశాధికారి చెన్నుపాటి సుబ్బారావు, కమిటీ మెంబర్స్‌ బి.క్రాంతి, రాగిణి తదితరులు పాల్గొన్నారు. డైరెక్టరీ ముద్రణకు సహకరించిన పలువురిని సత్కరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X