twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బూతు బూతే.... ఆలోచించండి రామోజీరావుగారు’, దర్శకుడి షాకింగ్ కామెంట్!

    ప్రముఖ తెలుగు దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.... ‘నా ఆలోచన’ పేరుతో సమాజంలో నిత్యం జరిగే అంశాలపై తన మనసులోని ఆలోచనలను వ్యక్త పరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈటీవీలో ప్రసారం అవుతున్న

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.... 'నా ఆలోచన' పేరుతో సమాజంలో నిత్యం జరిగే అంశాలపై తన మనసులోని ఆలోచనలను వ్యక్త పరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈటీవీలో ప్రసారం అవుతున్న కొన్ని అభ్యంతరకర కార్యక్రమాలపై తన అభిప్రాయం వ్యక్తం చేసారు.

    ఈ మధ్య కాలంలో ఈటీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు చూడలేక పోతున్నాం... బూతు కంటెంటు ఎక్కువ అవుతోంది, రామోజీ రావు లాంటి గొప్పవారు నిర్వహిస్తున్న ఛానల్స్ లో ఇలాంటివి చూడటం బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

    రామోజీరావుగారంటే గౌరవం

    రామోజీరావుగారంటే గౌరవం

    నాకు రెండు రాష్ట్రాల్లో ఒక పెద్దాయనంటే చాలా గౌరవం. ఒకరకంగా చెప్పాలంటే నాకు మార్గదర్శకుడు. ఆయన ప్రన్సిపల్స్, కష్టపడి జీవితంలో పైకొచ్చిన విధానం గానీ, తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్న విధానం గానీ... అలాంటి వాళ్లు దేశానికి చాలా అవసరం అని అనిపిస్తుంది... తమ్మారెడ్డి అన్నారు.

    విలువలు పాటించే ఆయన

    విలువలు పాటించే ఆయన

    రామోజీరావుగారు ఈ రాష్ట్రంలో చాలా కష్టపడి పైకొచ్చి ఒక న్యూస్ పేపర్ పెట్టి, తర్వాత టీవీ ఛానల్ పెట్టి, దాన్ని ప్రజలందరూ నమ్మేట్లు... ఫోర్త్ ఎస్టేట్ అంటే నిజమైన ఫోర్త్ ఎస్టేట్ లాగా, మీడియా అంటే మీడియాలాగా ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే చానల్స్ పెట్టారు. ఫ్యామిలీ విలువలు గానీ, సమాజం విలువలు గానీ పాటిస్తూ డబ్బు సంపాధించడం అనేది చాలా కష్టమైన విషయం... కానీ రామోజీరావు అవన్నీ పాటిస్తూ డబ్బు, పేరు సంపాదించారని తమ్మారెడ్డి అన్నారు.

    రామోజీరావు ఛానల్ లో ఇలాంటి కార్యక్రమాలా?

    రామోజీరావు ఛానల్ లో ఇలాంటి కార్యక్రమాలా?

    రామోజీరావుగారి ఛానల్ లో ఈ మధ్య కాలంలో చాలా భయంకరమైన డబల్ మీనింగ్ డైలాగులతో కూడిన షోలు వస్తున్నాయి. ఫ్యామిలీ ప్రేక్షకలు రామోజీ రావును నమ్మి ఆ ఛానల్ ఎక్కువ చూస్తారు. ఎక్కువ మంది రామోజీరావుగారిపై గౌరవంతో చూస్తారు...ఆయన ఛానల్ లో ఇలాంటి కార్యక్రమాలా? అంటూ తమ్మారెడ్డి అసహనం వ్యక్తం చేసారు.

    బ్రోతల్ హౌస్ నడిపిస్తారంట.. కానీ ఈయనకు తెలియదంట అంటే కరెక్టు కాదు కదా

    బ్రోతల్ హౌస్ నడిపిస్తారంట.. కానీ ఈయనకు తెలియదంట అంటే కరెక్టు కాదు కదా

    నాకో మిత్రుడు చెప్పాడు... రామోజీరావుగారు 9 గంటల వరకు వార్తలు చూసి ఆ కార్యక్రమం వచ్చే సమయానికి టీవీ కట్టేస్తారు... ఆయనకు తెలియదు అన్నట్లు మాట్లాడారు. అపుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. వారెవరో బ్రోతల్ హౌస్ నడిపిస్తారంట.. కానీ ఈయనకు తెలియదంట అంటే కరెక్టు కాదు కదా. అంత పెద్దాయన అన్నీ చేస్తారు ఇవన్నీ చూడలేదు అంటే కుదరదు కదా. ఆయన చూసినా చూడక పోయినా ఆయనే బాధ్యుడు అవుతాడు. ఒక వేళ చూసి ఉండకపోతే ఇప్పటికైనా చూడాలని, చూస్తారని ఆశిస్తున్నాను అని తమ్మారెడ్డి ఘాటుగా స్పందించారు.

    డబ్బు కోసం, టీఆర్పీల కోసం

    డబ్బు కోసం, టీఆర్పీల కోసం

    డబ్బు కోసం, టీఆర్పీల కోసం ఏదైనా చేయొచ్చు. చానల్స్ లో తప్పదు. కానీ రామోజీరావు లాంటి పెద్దాయన చానల్ లో ఇలాంటివి రావడం బాధగా ఉంది. ఆయన పట్టించుకుంటారనే ఆశతో, బాధతో చెబుతున్న మాట ఇది... అన్నారు.

    నిరోధించాల్సిన అవసరం ఉంది

    నిరోధించాల్సిన అవసరం ఉంది

    ఈ టీవీ అంటే ఫ్యామిలీసే చూస్తారు. ఇలాంటి వాటిని నిరోధించాల్సిన అవసరం ఉంది. కొందరు నీకెందుయ్యా ఇదంతా అంటారు. నేను ఇప్పుడనే కాదు నేను గతంలోకూడా మా టీవీ, జెమినీ టీవీ, జీ టీవీ యాజమాన్యానికి ఏదైనా బాగోలేక పోతే ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ రామోజీరావుకు ఫోన్ చేస్తే ఎత్తుతారో ఎత్తరో తెలియదు. నేను ఆయనకు రీచ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ చెబుతున్నాను.. అన్నారు తమ్మారెడ్డి.

    బూతు బూతే... ఆలోచించండి రామోజీరావుగారు

    నెంబర్ వస్తోంది కదా, అందరూ చూస్తున్నారు కదా అని వాదించొచ్చు...... ఎక్కడైనా బూతులు ఎక్కువే చూస్తారు. ఫ్యామిలీస్ తో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బూతు బూతే అవుతుంది.. ఆలోచించండి రామోజీ రావు గారు.... అంటూ తనదైన స్టైల్ లో హితవు పలికారు తమ్మారెడ్డి.

    English summary
    Tollywood Veteran Director Tammareddy Bharadwaj responds on present Reality TV Shows & other programmes which are full of double meaning dialogues especially in ETV. Taking a leaf from the show, Anchors / Hosts are speaking double meaning sentences to increase the TRPs of their shows. Finally, Tammareddy made Shocking Comments on Ramoji Rao Garu. Watch the video till the end and share your views in the comments section below.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X