తనీష్ ప్రవర్తన తన ఫ్యామిలీకి కూడా నచ్చలేదా.. ఫోన్‌లోనే హెచ్చరిక, సునైనాతో క్లోజ్‌గా!
స్వామిరారా ఫేమ్ పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించడంతో షో మరింత రసవత్తరంగా మారింది. మరోవైపు ఎలిమినేట్ అయిన సభ్యులలో ఒకరిని తిరిగి హౌస్ లోకి పంపేందుకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో తాజగా జరుగుతున్న పరిణామాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. హౌస్ లోని సభ్యులు ఒక్కొక్కరుగా తమ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనీష్ కుటుంబ సభ్యులు అతడికి హెచ్చరిక జారీ చేశారు. దీనికి సంబందించిన ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది.
Recommended Video


ఇప్పటికీ అదేవిధంగా
దీప్తి సునైనా, తనీష్ క్లోజ్ గా ఉండడంపై ఇప్పటికే విమర్శలు చెలరేగుతున్నాయి. అయినప్పటికీ తనీష్, సునైనా అవేమి పట్టించుకోవడం లేదు. వీళ్లిద్దరి గురించి ఎలిమినేట్ అయిన భానుశ్రీ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇంటి నుంచి ఫోన్
బిగ్ బాస్ ఇచ్చిన అవకాశంమేరకు హౌస్ లోని ప్రతి సభ్యుడు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడే అవకాశం దక్కింది. ఈ క్రమంలో తనీష్ కూడా తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ప్రోమోలో చూపిన దానిప్రకారం తనీష్ కుటుంబ సభ్యుల నుంచి భిన్నమైన స్పందన ఎదుర్కున్నాడు.

సునైనా గురించేనా
తనీష్ ఫ్యామిలీ సునైనా విషయంలో అతడిని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. క్లోజ్ గా ఉండవద్దు, బ్రతిమాలాడవద్దు.. అలా చేయడంతో నీ ఫాన్స్ లోనే చెడు అభిప్రాయం నెలకొనివుంది అంటూ తనీష్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు.

ఒక్క కిస్ కొట్టు
బాబు గోగినేని తన సతీమణితో మాట్లాడుతూ ఏం పిల్ల ఓ కిస్ కొట్టు అంటూ సరదాగా మాట్లాడడం ఆకట్టుకునే విధంగా ఉంది. దీప్తి, గీత మాధురికి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం వచ్చింది.


Click it and Unblock the Notifications











