దీప్తి సునైనాతో ఎఫైర్ గురించి తొలిసారి.. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక మాటల్లేవు!
Recommended Video

బిగ్ బాస్ సీజన్ 2 లో హీరో తనీష్ గట్టి పోటీ ఇచ్చి ఫైనలిస్ట్ గా నిలిచాడు. బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమాల్లో నటిస్తున్నాడు. బిగ్ బాస్ లో తనీష్ విజేతగా కాదు. అయినా కూడా తనీష్, కౌశల్, గీత మాధురి మధ్య గట్టి పోటీ కొనసాగింది. తనీష్, దీప్తి సునైనా రిలేషన్ గురించి అనేక రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా తనీష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. దీప్తి సునైనా, కౌశల్ ఆర్మీ గురించి తన మనసులో మాట బయట పెట్టాడు.

దీప్తి సునైనతో ఎఫైర్
దీప్తి సునైనాకు తనకు మధ్య ఎఫైర్ సాగుతోందంటూ జరుగుతున్న ప్రచారమై తనీష్ స్పందించారు. అలాంటి వార్తలు వింటుంటే నాకు నవ్వొస్తుంది తెలిపాడు. జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని నేను గతంలోనే వివరణ ఇచ్చాను. కానీ ఇంకా అలాగే మాట్లాడుతున్నారంటే అలాంటి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మారారని తనీష్ తెలిపాడు.

అమ్మాయి, అబ్బాయి కనిపిస్తే చాలు
ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక అమ్మాయి, అబ్బాయి పక్క పక్కనే కనిపిస్తే చాలు.. రకరకాల కామెంట్లు వినిపిస్తాయి. నాకు, దీప్తీసునైనా విషయంలో కూడా అదేజరిగిందని తనీష్ తెలిపాడు. ఇకపై ఈ విషయం గురించి అను మాట్లాడనని, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అని తనీష్ తెలిపాడు. కానీ నా గురించి చేస్తున్న ట్రోలింగ్ వలన మా అమ్మ చాలా భాదపడిందని తనీష్ ఆవేదన వ్యక్తం చేశాడు.

కౌశల్ ఆర్మీకి హ్యాట్సాఫ్
కౌశల్ ఆర్మీ ఆయన్ని ఎంతో ప్రేమతో గెలిపించారని తనీష్ అభిప్రాయపడ్డారు. అందుకు వాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాలి. అలాగే నన్ను అభిమానించేవాళ్ళు కూడా ఉన్నాయి. హౌస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కు అభిమానులు ఉన్నారని తనీష్ తెలిపాడు. ఈ అభిమానులందరితో నాకు ఒకటే సమస్య. వాళ్ళు ట్రోలింగ్ చేసే కామెంట్స్ ని వారి ఇంట్లో చూపించగలరా అని తనీష్ ప్రశ్నించాడు. అలాచేస్తే చెంపపగిలేలా వాళ్ళ తల్లిదండ్రులు కొడతారు.

మా ఇద్దరికీ మాటల్లేవు
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నేను, కౌశల్ ఇంతవరకు కలుసుకోలేదు. నేను నా పనులతో బిజీ అయిపోయాను. కౌశల్ తన పనులతో బిజీగా ఉన్నాడు. అందువలనే కనీసం మాట్లాడుకోవడం కుదరలేదని తనీష్ తెలిపాడు. అంతే కానీ బిగ్ బాస్ లో గొడవ పడడం కారణం కాదని తనీష్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











