‘బిగ్ బాస్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: తనీష్‌కు మరో అవకాశం ఇచ్చి స్టార్ మా

'బిగ్ బాస్'.. తెలుగులో అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో. గతంలో ఎన్నో షోలు వచ్చినప్పటికీ దీనికి వచ్చినంత క్రేజ్ ఇంకే షోకీ రాలేదు. దీనికి కారణం ఈ షో చుట్టూ అల్లుకుని ఉన్న వివాదాలే. అంతేకాదు, హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలు.. కొట్లాటలు.. రొమాన్స్ వగైరావన్నీ 'బిగ్ బాస్'కు ఎనలేని పాపులారిటీని తీసుకు వచ్చాయి. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. మూడో సీజన్ గత వారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టారట షో నిర్వహకులు.

 సరికొత్తగా షో

సరికొత్తగా షో

గత రెండు సీజన్లతో పోలీస్తే ఈ సారి ‘బిగ్ బాస్' నిర్వహకులు సరికొత్త పంథాను ఫాలో అయిపోతున్నారు. హౌస్‌లో మార్పులు చేయడంతో పాటు ఓటింగ్ సిస్టమ్‌ను కూడా పూర్తిగా చేంజ్ చేసేశారు. గతంలో గూగుల్ నుంచి ఓట్లు వేసే పద్దతిని పెట్టిన స్టార్ మా యాజమాన్యం.. ఇప్పుడు హాట్ స్టార్‌లో ఈ సౌకర్యాన్ని కల్పించింది.

నాగార్జునను తీసుకొచ్చారు

నాగార్జునను తీసుకొచ్చారు

‘బిగ్ బాస్' మొదటి సీజన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను హోస్ట్‌గా పరిచయం చేశారు. ఆ తర్వాతి సీజన్‌ను అతడు అందుబాటులో లేకపోవడంతో నేచురల్ స్టార్ నాని ఆ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే, ఆ సీజన్ తర్వాత నాని ఇకపై ఇలాంటి షోలు చేయనని చెప్పేశాడు. దీంతో ఈ సారి కింగ్ నాగార్జునను తీసుకు వచ్చారు.

రూల్స్ మార్చేశారు

రూల్స్ మార్చేశారు

గత సీజన్లలో జరిగిన వ్యవహారాలను బట్టి ఈ సారి చాలా మార్పులు చేశారు ‘బిగ్ బాస్' నిర్వహకులు. ఇందులో భాగంగానే హౌస్‌లో నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు మొదట స్టార్ మాకే ఇంటర్వ్యూ ఇవ్వాలని, వేరే ఏ చానెల్‌కూ వెళ్లడానికి వీలు లేదని కొత్త రూల్ పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విధంగానూ క్యాష్ చేసుకోవాలని స్టార్ మా భావిస్తున్నట్లు టాక్.

 తనీష్‌ను తీసుకొస్తున్నారు

తనీష్‌ను తీసుకొస్తున్నారు

గత సీజన్‌లో ఫైనల్ వరకు వచ్చిన కంటెస్టెంట్లలో హీరో తనీష్ ఒకడు. చివరి వరకు పోరాటం చేసినప్పటికీ అతడు టైటిల్ గెలవలేకపోయాడు. దీంతో అతడికి మరో ఛాన్స్ ఇవ్వాలని స్టార్ మా భావిస్తోంది. అయితే, హౌస్‌లోకి వెళ్లడానికి మాత్రం కాదు.. ఇంట్లోంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు చేయడానికి. అవును.. ఇందుకోసం తనీష్‌తో షో నిర్వహకులు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.

ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

శనివారం జరిగిన ఎపిసోడ్‌లో నామినేషన్‌లో ఉన్న ఆరుగురులోంచి హిమజ, పునర్నవిలు సేఫ్‌ అయినట్లుగా నాగ్‌ ప్రకటించాడు. అంటే.. ఇంక నలుగురు రాహుల్, జాఫర్, వితిక, హేమలు ఎలిమినేషన్ జోన్‌లోనే ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వెళ్లిపోతారు..? అన్నది ఆదివారం తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X