దీప్తి సునైనా కోసం తనీష్ బలి.. నీవు ఎమోషనల్ అత్యాచారి.. గీతామాధురి ఫైర్!
బిగ్‌బాస్‌లో 58వ రోజు చాలా గందరగోళంతోపాటు పలువురు సభ్యులు గాయాల పాలయ్యారు. బిగ్‌బాస్ విధించిన నామినేషన్ టాస్క్‌లో భాగంగా ఆడిన గేమ్‌లో ఇంటి సభ్యుల్లో కొందరు కిందపడి గాయాల పాలయ్యారు. కొందరు సెలబ్రిటీలు తాము నామినేట్ కావడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనీష్ నామినేషన్ అంశం కొంత వివాదంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

నామినేషన్‌లో ఆరుగురు
టాస్క్‌లో భాగంగా సెలబ్రిటీలు టెంట్‌లోకి పరుగెత్తాల్సి ఉంటుంది. ఎవరైతే టెంట్ లోకి వెళ్లకుండా చివరిగా మిగులుతారో వారు నామినేషన్‌కు గురి అవుతారు. మొదటి వ్యక్తిగా బాబు గోగినేని నామినేట్ అయ్యారు. ఆ తర్వాత గణేష్, దీప్తి నల్లమోతు, గీతా మాధూరి, శ్యామల, తనీష్ నామినేట్ అయ్యారు.
Recommended Video


వివాదంగా తనీష్ నామినేషన్
అయితే తనీష్ నామినేషన్ వివాదాస్పదమైంది. నామినేషన్ ప్రక్రియలో మరో రౌండ్‌లో ఇంటి సభ్యులు పరుగెత్తగా దీప్తి సునైనా చివరి వ్యక్తిగా మిగిలారు. అది గమనించిన తనీష్ తాను వెనకకు వచ్చి దీప్తిని టెంట్‌లోకి పంపించారు. దాంతో తనీస్ తనంత తాను నామినేట్ చేసుకొన్నట్లయింది.

దీప్తి సునైన కోసం తనీష్
దీప్తి సునైనా కోసం తనీష్ చేసిన నిర్వాకంపై ఇంటి సభ్యులు గుసగుసలాడారు. తనీష్ గేమ్ ఆడటంలో వివక్ష చూపిస్తున్నారనే మాట వినిపించింది. తనీష్ అలా చేయకుండా ఉండాల్సిందని అన్నారు. దీప్తి కోసం స్వయంగా ముప్పును ఎదుర్కొనేందుకు సిద్దం కావడం సరికాదు అన్నారు.

నీరసపడిన దీప్తి, గీతా మాధురి
నామినేషన్ గురైన దీప్తి నల్లమోతు, గీతా మాధురి నీరసపడిపోయారు. వారిద్దరూ ఒకచోట కూర్చొని ఏదో మాట్లాడుకుంటుండగా వారి వద్దకు కౌశల్ వచ్చాడు. ఎమోషనల్‌గా కనిపించావని నేను రిలీఫ్ కోసం మీ వద్దకు వచ్చాను అని కౌశల్ అన్నాడు. దాంతో మాకు అవసరం లేదు అని చెప్పారు.

నీవు ఎమోషనల్ అత్యాచారివి
నీవు ఏదో బాధలో ఉన్నావని వచ్చాను. నా సపోర్ట్ తీసుకుంటావా? లేదా? అనేది మీ ఇష్టం అని కౌశల్ అన్నాడు. దానికి సమాధానంగా నీవు ఎమోషనల్ అత్యాచారివి. సమయం చూసి ఎదుటి వాళ్లను ఎమోషనల్‌గా ఏదో చేస్తుంటావు. అది మానుకో అని గీతా మాధురి అన్నారు.


Click it and Unblock the Notifications











