బిగ్ బాస్2: తనీష్, తేజస్వి రొమాన్స్ అదిరిందిగా.. దూరంగానే సునైనా!
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో 100 రోజులకు పైగా ఆడియన్స్‌ని అలరిస్తూ వస్తోంది. ఈ ఆదివారంతో బిగ్ బాస్ సమరం ముగియబోతోంది. ఐదుగురు ఇంటి సభ్యులు ఫైనల్ కు చేరుకోగా రేపు ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో ఎవరో ఒకరే విజేతగా నిలవబోతున్నారు. బిగ్ బాస్ సమరం ముగియడానికి ఒకరోజు ముందు హౌస్ లో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఎలిమినేట్ అయిన ఇంటిసభ్యులంతా తిరిగి హౌస్ లోకి చేరుకొని పార్టీ చేసుకుంటున్నారు. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజగా విడుదలయింది.

సందడిగా మారిన హౌస్
ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులంతా హౌస్ లోకి చేరుకున్నాడు. డాన్సులు చేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడుపుతున్నారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన బాబు గోగినేని, గణేష్, తేజస్వి, సునైనా, పుజారామచంద్రన్ సహా అంతా హౌస్ లో కనిపిస్తున్నారు.

తనీష్, తేజస్వి రొమాన్స్
ప్రోమోలో చూపిన విధంగా నేటి ఎపిసోడ్ లో తనీష్, తేజస్వి రొమాన్స్ హైలైట్ గా నిలవనునట్లు తెలుస్తోంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు తనీష్ ని అంటిపెట్టుకుని ఉన్న సునైనా మాత్రం దూరంగా ఉంటోంది.

కనిపించని నూతన్
నూతన్ నాయుడు మాత్రం హౌస్ లో కనిపించలేదు. తనకు అత్యధిక ఓటింగ్ వచ్చినా బిగ్ బాస్ నుంచి తనని ఎలిమినేట్ చేశారనే ఆగ్రహంతో నూతన్ నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి రాలేదు.

అందరి దృష్టి నానిపైనే
రేపు జరగబోయే గ్రాండ్ ఫినాలేతో బిగ్ బాస్2 ముగుస్తుంది. నాని ఎవరిని విజేతగా ప్రకటిస్తాడనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉండడం విశేషం. తనీష్, కౌశల్, సామ్రాట్, గీత, దీప్తి ఫైనల్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











