Bigg Boss Telugu 7: బిగ్ బాస్ షోలో ముద్దులాట.. నైట్ టైంలో రొమాన్స్.. శివాజి చేసిన పనికి విమర్శలు

తెలుగు బుల్లితెర చరిత్రలోనే మొట్టమొదటి రియాలిటీ షోగా ప్రసారం అయినా.. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాంటిక్ సీన్స్‌తో రన్ అవుతోంది బిగ్ బాస్. మిగిలిన భాషల కంటే ఇక్కడ ఒక దానికి మించి ఒకటి భారీ స్పందనను అందుకుని సత్తా చాటాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ముద్దులాట, డేటింగ్ యమ హైలైట్ అయ్యాయి. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!

Dating In Bigg Boss Telugu 7 Show

ఉల్టా పుల్టాగానే సీజన్: బిగ్ బాస్ షో అంటేనే అన్నీ నిజమైన సంఘటనలతో నడిపిస్తూ ఉంటారు. ఉల్టా పుల్టా సీజన్‌ కావడంతో ఏడో దానిలో రియల్ కంటెంట్‌ను మరింత ఎక్కువగా ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లను చూపిస్తున్నారు. దీంతో ఈ సీజన్‌కు భారీ రేటింగ్ లభిస్తోంది. ఫలితంగా ఇది అత్యధిక రేటింగ్‌ను రాబడుతూ దూసుకుపోతోంది.

కిస్ టాస్క్‌తో సందడి: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా గత ఎపిసోడ్‌లో ఓ ప్రమోషనల్ టాస్క్ జరిగింది. ఇందులో హౌస్‌లోని అమ్మాయిలు లిప్‌స్టిక్ వేసుకుని ఒక టీ షర్ట్ మీద కిస్ చేయాల్సి ఉంటుంది. అందులో ఏ లిప్ మార్క్ ఏ అమ్మాయిదో అని మేల్ కంటెస్టెంట్లు కనిపెట్టాలి. అలా చేసిన అబ్బాయి.. ఆ లేడీతో డిన్నర్ డేట్‌కు వెళ్లే ఛాన్స్ ఇచ్చారు.

ఇద్దరు కనిపెట్టారుగా: బిగ్ బాస్ ఇచ్చిన కిస్ టాస్కులో ఐదుగురు అమ్మాయిలు తమ పెదాలతో టీ షర్ట్‌పై కిస్‌లు పెట్టారు. దాన్ని సంచాలకుడిగా ఉన్న శివాజి మినహా హౌస్‌లో ఉన్న అందరు మగాళ్లు కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఇందులో కేవలం అమర్‌దీప్ చౌదరి.. ప్రియాంక జైన్ లిప్ మార్కును, టేస్టీ తేజ.. శోభా శెట్టి ముద్దును కనిపెట్టారు. ఈ విషయాన్ని సంచాలకుడైన శివాజి ప్రకటించాడు.

అతడే విన్నర్ అని: కిస్ టాస్కులో అమర్‌దీప్ చౌదరి, టేస్టీ తేజలు కరెక్ట్‌గా గెస్ చేసినట్లు చెప్పినా.. అందులో ఒకరిని మాత్రమే సంచాలకుడు విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో శివాజి తనకు టేస్టీ తేజ ఇచ్చిన ఆన్సర్ నచ్చిందని అతడిని సెలెక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. ఫలితంగా ఈ టాస్కులో గెలిచిన అతడు.. శోభా శెట్టితో డిన్నర్ డేట్‌కు వెళ్లే అవకాశాన్ని అందుకున్నాడు.

Tasty Teja and Shobha Shetty Dating In Bigg Boss Telugu 7 Show

ఒకరికొకరు ప్రపోజ్: కిస్ టాస్కులో గెలిచిన తర్వాత శోభా శెట్టి, టేస్టీ తేజ ఇద్దరూ డిన్నర్ డేట్‌కు రెడీ అవ్వాలని బిగ్ బాస్ సూచించాడు. అలాగే, వాళ్ల కోసం క్యాండిల్ లైట్ డిన్నర్‌ సెటప్‌ను చేసి ఉంచాడు. ఇక, ఇందులో టేస్టీ తేజ హార్ట్ సింబల్‌తో ఉన్న బెలూన్‌ను శోభా శెట్టికి అందించి ఆమెకు ఫ్రెండ్‌గా ప్రపోజ్ చేశాడు. దీనికి శోభా కూడా ప్రతి స్పందించింది. ఇలా ఇద్దరూ తమ భావాలు వ్యక్త పరిచారు.

Tasty Teja and Shobha Shetty Dating In Bigg Boss Telugu 7 Show

రొమాంటిక్ సాంగ్‌తో: డిన్నర్ డేట్ స్టార్ట్ అయిన తర్వాత టేస్టీ తేజ ఓ రొమాంటిక్ సాంగ్ పెట్టమని అడిగాడు. దీంతో ఓ పాటను ప్లే చేయగా.. శోభా శెట్టితో కలిసి అతడు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. ఇక, ఈ ఎపిసోడ్ అంతా ఇలాగే సందడిగా సాగిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ టాస్కులో అమర్ గెలిచినా అతడిని విన్నర్‌గా ప్రకటించకపోవడంతో శివాజిపై అతడి అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X