లైవ్‌లోనే ఆమెను కిస్ అడిగిన టేస్టీ తేజ.. ‘పాప ఉంటే పాలు అవసరం లేదు’ అంటూ షాకింగ్‌గా!
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు వెలుగులోకి వస్తున్నారు. వాళ్లు పలు రకాల షోలలో భాగం అవడంతో పాటు సోషల్ మీడియా వల్ల సెన్సేషన్‌గా మారుతున్నారు. అలాంటి వారిలో గతంలో జబర్ధస్త్ షోలో సందడి చేసి.. ఈ మధ్యనే బిగ్ బాస్‌లో సత్తా చాటిన టేస్టీ తేజ ఒకడు.
షోల కంటే ఫుడ్ వీడియోలతో క్రేజ్ తెచ్చకుంటోన్న అతడు.. ఇప్పుడు అలాంటి వాటినే కంటిన్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా టేస్టీ తేజ.. అశ్విని శ్రీతో ఓ వీడియో చేశాడు. ఇందులో అతడు ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. ఆ వివరాలను మీరే చూసేయండి!

బిగ్ బాస్‌లో వాళ్లిద్దరూ అలా: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుని స్పెషల్ ఫోకస్ అయ్యారు. వారిలో టేస్టీ తేజ ఒకడు. ఆరంభం నుంచే తనదైన కామెడీని పంచుతూ అతడు తెగ హైలైట్ అయ్యాడు. అలాగే, వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ కూడా యమ హైలైట్ అయిపోయింది.

బయటకు వచ్చాక రచ్చగా: బిగ్ బాస్ ఏడో సీజన్ పూర్తైన తర్వాత ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ తరచూ కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా టేస్టీ తేజ చాలా మంది తోటి కంటెస్టెంట్లతో కలిసి రచ్చ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తన ఫుడ్ వీడియోలను కూడా ప్రమోట్ చేసుకుంటున్నాడు. అతడితో అశ్విని శ్రీ కూడా కలిసి వీడియోలు చేస్తోంది.

అశ్వినితో కలిసి ఎంజాయ్: ఈ మధ్య కాలంలో తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రమోట్ చేసుకుంటోన్న టేస్టీ తేజ.. ఇటీవలే అశ్విని శ్రీతో కలిసి ఓ ఫుడ్ వీడియో చేశాడు. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి యమ ఎంజాయ్ చేశారు. అనంతరం దీనికి సంబంధించిన రీల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో వీళ్ల వీడియోలకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది.

పాలు అవసరం లేదు కదా: టేస్టీ తేజతో తీసుకున్న ఓ సెల్ఫీ వీడియోను అశ్విని శ్రీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అతడు పెరుగు బౌల్‌ను చూపిస్తూ.. 'ఇది పాలు అనుకునేరు. అశ్విని పాప పక్కన ఉంటే అందరూ పాలు అనుకుంటారు. ఎందుకంటే ఆమెవి పాల బుగ్గలు కదా. ఇది పెరుగు బౌల్' అని చెప్పాడు. ఇది అతడు డబుల్ మీనింగ్‌లో చెప్పాడని నెటిజన్లు అంటున్నారు.
కిస్ పెట్టమని అడిగిన తేజ: అదే వీడియోలో టేస్టీ తేజ తన బుగ్గను తుడుచుకుని 'నిన్న ప్రశాంత్‌ది ఏదో' అని అన్నాడు. దీంతో అశ్విని 'ఏంటి ముద్దు వీడియోనా? వాడు నా తమ్ముడు రా. అందుకే పెట్టాను. నీకు పెట్టను' అనేసింది. దీంతో టేస్టీ తేజ 'అంటే వాడు తమ్ముడు. నా మీద అలాంటి ఫీలింగ్ లేదా' అన్నాడు. అప్పుడు అశ్విని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా వద్దని పక్కకు వెళ్లిపోయాడు. మొత్తానికి ఈ వీడియోలో తేజ ఎప్పటి లాగానే తనదైన రీతిలో నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ, నెటిజన్లు మాత్రం అతడిపై ట్రోల్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











