సీరియల్ నటితో టేస్టీ తేజ పెళ్లి.. ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ అప్పుడే.. బిగ్ బాస్ లైవ్‌లో లీకైన మేటర్

అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టుతో పరిచయమైనా.. తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుని సక్సెస్‌ఫుల్ షోగా మారింది బిగ్ బాస్. ఇండియాలో చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే దీనికి అత్యధిక రేటింగ్ దక్కుతోంది. ఫలితంగా మన షో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఇక, ఇందులో కంటెస్టెంట్‌గా ఉన్న టేస్టీ తేజ తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ హైలైట్ అయ్యాయి. ఆ వివరాలేంటో మీరే చూడండి!

షాక్‌లు, సర్‌ప్రైజ్‌లతోనే:తెలుగులో బిగ్ బాస్ షోకు దక్కే ఆదరణ మరో దానికి రాదన్న విషయం తెలిసిందే. దీనికితోడు ఏడో సీజన్ ఉల్టా పుల్టా కంటెంట్‌తో తీసుకు రావడంతో ఇది మరింత రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ముఖ్యంగా ఈ సీజన్ షాక్‌లు, సర్‌ప్రైజ్‌లతో పాటు కొత్త కొత్త అంశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ఇది గతంలో మాదిరిగా సక్సెస్‌ఫుల్‌గానే సాగుతోంది.

Tasty Teja Clarity about Marriage with Shobha Shetty In Bigg Boss Telugu 7 Show

అందరిలో అతడు ఫన్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుని హైలైట్ అయ్యారు. వారిలో జబర్ధస్త్ మాజీ కమెడియన్, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ ఒకడు. ఫన్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తోన్న అతడు.. మరింత ఫేమస్ అవుతున్నాడు.

విమర్శలతో మారాడుగా:బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే టేస్టీ తేజ తనదైన రీతిలో కామెడీని పంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరినీ గౌరవంగానే పలకరిస్తూ, అప్పుడప్పుడూ పంచులు, సెటైర్లు వేశాడు. మధ్యలో కాస్త ఓవర్ యాక్షన్ చేయడంతో విమర్శలు వచ్చాయి. దీంతో తనను తాను మార్చుకుని మంచితనంతో ముందుకెళ్తున్నాడు. ఫలితంగా తిట్టిన వాళ్లే పొగడుతున్నారు.

Tasty Teja Clarity about Marriage with Shobha Shetty In Bigg Boss Telugu 7 Show

ఆమెతోనే ఎక్కువ క్లోజ్:బిగ్ బాస్ హౌస్‌లో టేస్టీ తేజ అందరితోనూ కలివిడిగానే ఉంటున్నాడు. కానీ, ఎక్కువగా శోభా శెట్టితో అతడు సన్నిహితంగా మారాడు. తరచూ ఆమెతోనే ఉంటూ, ఆమె చెప్పినట్లే చేస్తూ సరదాగా సాగిపోతోన్నాడు. ముఖ్యంగా శోభను సైట్ కొడుతున్నట్లుగా టీజ్ చేస్తూ మజాను పంచుతున్నాడు. ఫలితంగా వీళ్లిద్దరి బంధం మరింత బలపడడంతో పాటు కంటెంట్ కూడా దొరుకుతోంది.

పెళ్లిపై టేస్టీ తేజ క్లారిటీ:తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టేస్టీ తేజ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. దీన్ని లైవ్‌ స్ట్రీమింగ్‌లోనే చూపించారు. పూజా 'తేజా.. షో అయిన వెంటనే పెళ్లి చేసుకుంటావా' అని అతడిని అడిగింది. దీనికి తేజ 'వెంటనే కాదు కానీ ఒక సంవత్సరంలో చేసుకుంటాను. అమ్మాయి కూడా మీ ఫ్రెండే. మీ అందరినీ పిలుస్తాను' అంటూ శోభా శెట్టిని పెళ్లి చేసుకుంటా అన్నట్లు చెప్పాడు.

అప్పుడే అంటూ లీక్స్:ఆ తర్వాత తేజ మాట్లాడుతూ.. 'ఎంగేజ్‌మెంట్ అయితే వచ్చే జనవరిలో చేసుకుంటాము. అది బెంగళూరులో జరుగుతుంది. పెళ్లి మాత్రం మా పద్దతి ప్రకారం మా ఇంటి దగ్గరే చేసుకుంటాము. నిశ్చితార్థానికి మీతో పాటు మా రెండు ఫ్యామిలీల వాళ్లు వస్తారు. పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేసుకుంటాము' అని చెప్పుకొచ్చాడు. ఇదంతా విన్న శోభా తనలో తాను తెగ నవ్వుకుంటూ కనిపించింది.

Tasty Teja Clarity about Marriage with Shobha Shetty In Bigg Boss Telugu 7 Show

ఫన్నీగానా? నిజంగా?:టేస్టీ తేజ తన పెళ్లి శోభా శెట్టితోనే అని పరోక్షంగా చెప్పడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, అతడు ఫన్నీగానే ఈ విషయం చెప్పాడా? లేక నిజంగానే అన్నాడా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. వాస్తవానికి గతంలో శోభా శెట్టి తన ఎంగేజ్‌మెంట్ జనవరిలో జరగబోతుందని చెప్పింది. దీంతో ఇద్దరి ఫ్యాన్స్ అయోమయంగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X