Bigg Boss Telugu 7 అతడి చేయి పడితే మూడినట్టే.. తేజాది ఐరెన్ హ్యాండా? గోల్డెన్ హ్యాండా?

బిగ్ బాస్ సీజన్ తెలుగు 7.. ప్రతీ విషయంలోనూ ఈ సీజన్ మునుపెన్నడూ లేని విధంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా ముందు కొంత మందిని పంపించడం, ఆ తర్వాత 2.0 పేరుతో ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీలను ఒకేసారి లోపలికి పంపించడం గతంలో ఎన్నడూ జరగలేదు. అంతే కాకుండా ఇప్పటికే ఎలిమినేట్ అయిన వారిలో మరొకరితో రీఎంట్రీ ఇప్పించడం కూడా ఇదే తొలిసారి. అలాగే తొమ్మిదో వారంలో కెప్టెన్ అయిన గౌతమ్ కృష్ణ వారం రోజుల పాటు ఆడోళ్లకు పని చేయకుండా.. ఉమెన్స్ వీక్ జరపడం కూడా ఏ బిగ్ బాస్ షోలోనూ జరగలేదు. ఇలా ప్రతీ విషయంలో కొత్తగా వెళ్తున్న ఈ సీజన్ లో మరో కొత్త రికార్డు కూడా క్రియేట్ అయింది.

ముఖ్యంగా టేస్టీ తేజ ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అవ్వడం ముందు నుంచే సాగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది వారాల్లో ఒక్క రెండో వారం తప్ప మిగిలిన అన్ని వారాల్లో తేజ నామినేట్ చేసిన వారే ఎలిమినేట్ కావడం నిజంగా షాకింగే. ఇది ఇప్పటి వరకూ ఎవరూ గుర్తించకపోయినప్పటికీ... సండే షోలో సందీప్ ఎలిమినేట్ అయిన రోజు నాగార్జున ఈ విషయాన్ని తెలిపారు. గత మూడు వారాలుగా నీవు నామినేట్ చేసిన వాళ్లే ఎలిమినేట్ అవుతున్నారని అన్నారు. కానీ మూడు వారాలే కాదు.. మొదటి నుంచి ఇదే జరుగుతుంది. కానీ దీన్ని ఎవరూ గుర్తించలేరు.

Tasty Teja Created a Record of All The People He Nominated Were Eliminated

ముఖ్యంగా మొదటి వారం టేస్టీ తేజ.. పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్ ను నామినేట్ చేయగా.. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. అయితే రెండో వారం తేజ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. కానీ రైతుబిడ్డ మాత్రం తప్పించుకున్నాడు. ఇక మూడో వారం టేస్టీ తేజ ధామినిని నామినేట్ చేయగా ఆమె కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత రతికా రోజ్ ను నామినేట్ చేశాడు. వెంటనే ఆమె కూడా ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఐదో వారం టేస్టీ తేజ శుభ శ్రీ రాయగురును నామినేట్ చేశాడు. ఈ వారం ఆమె ఎలిమినేట్ కావడం నిజంగా గమనార్హమే.

ఇక ఆరో వారం తేజ నయని పావనని నామినేట్ చేయగా.. ఆమె కూడా ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఏడో వారంలో పూజా మూర్తిని టేస్టీ తేజను నామినేట్ చేయగా ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఎనిమిదో వారం సందీప్ మాస్టర్ ను పాజిటివ్ వేలోనే నామినేట్ చేసినప్పటికీ ఆయన కూడా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. టేస్టీ తేజ నామినేట్ చేసిన వాళ్లంతా ఇంట్లోంచి వెళ్లిపోతున్నారని నాగార్జున చెప్పినప్పటి నుంచి ఈ విషయం మరింత హైలెట్ గా నిలిచింది.

ఈక్రమంలోనే టేస్టీ తేజ... తాజాగా అర్జున్ అంబటిని నామినేట్ చేశాడు. ఈయనకు కూడా పాజిటివ్ కారణాలే చెప్పాడు. అలాగే రతికా రోజ్ ను కూడా నామినేట్ చేశాడు. మరి ఈ వారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యారంటే టేస్టీ తేజకు నిజంగానే శక్తులు ఉన్నాయని.. అంతా సెంటిమెంట్ గా భావిస్తారు. చూడాలి మరి టేస్టీ తేజ పవర్స్ ఈ వారం పని చేస్తాయా.. రెండో వారంలాగే రిపీట్ అయ్యి వేరే ఎవరైనా ఎలిమినేట్ అవుతారా చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X