Bigg Boss Telugu 7: నాగార్జునకే షాకిచ్చిన కంటెస్టెంట్.. శివాజి ఆపినా ఆగకుండా.. ఏం జరిగిందో తెలిస్తే!

కాన్సెప్ట్ ఎలాంటిదైనా అదిరిపోయే కంటెంట్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సత్తా చాటుతోన్న షోనే బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఇది.. చాలా రికార్డులను కూడా నమోదు చేసుకుంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇప్పుడు ఏడో సీజన్‌ను నడుపుతున్నారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుస్తోన్న ఇందులో ఎన్నో జనరంజకమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఫలితంగా దీనికి భారీ రేటింగ్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్ నాగార్జునకే షాకిచ్చాడు. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!

బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో యమ రంజుగా సాగుతోంది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని టాస్కులు ఇస్తూ ఆసక్తికరంగా నడుపుతున్నారు. ముఖ్యంగా అప్పుడప్పుడూ సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం దసరా స్పెషల్ ఎపిసోడ్‌ను తీసుకు వచ్చారు. ఇది దాదాపు మూడు గంటల పాటు ఎంతో కలర్‌ఫుల్‌గా సాగిపోయింది.

Tasty Teja Crying After Saw His Father In Bigg Boss Telugu 7 Show

బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్‌ ఎంతో కలర్‌ఫుల్‌గా సాగింది. ఇందులో పాయల్ రాజ్‌పుత్, డింపుల్ హయాతి, రెబా మౌనికా జాన్ వంటి హీరోయిన్లు అదిరిపోయే డ్యాన్స్‌లతో అలరించారు. అలాగే, తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవి సహా కొందరు సింగర్లు పాటలతో మాయ చేశారు. ఇలా సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చి ఈ ఎపిసోడ్‌ను ఎంతో సందడిగా మార్చేశారు.

బిగ్ బాస్ స్టేజ్‌పై అలా ఉంటే.. హౌస్‌లోని కంటెస్టెంట్లతో హోస్ట్ నాగార్జున ఎన్నో ఆటలు ఆడించారు. ఇంట్లోని సభ్యులను రెండు గ్రూపులుగా మార్చి వాళ్లకు కొన్ని టాస్కులు ఇచ్చాడు. వాటిలో ఎవరు గెలిస్తే వాళ్లకు గిఫ్టులు ఇస్తామని చెప్పాడు. వీటిలో బతుకమ్మను పేర్చే టాస్క్ కూడా ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్ వాళ్లు గెలిచారు. తర్వాత పాటలు కనిపెట్టే ఆటలు కూడా ఆడించాడు.

Tasty Teja Crying After Saw His Father In Bigg Boss Telugu 7 Show

రెండు వారాల క్రితం జరిగిన టాస్కులో లెటర్స్ త్యాగం చేసిన కంటెస్టెంట్లకు వాళ్ల కుటుంబ సభ్యులు రాసిన లేఖలను అందించాడు. ఇందులో భాగంగానే శివాజి, అమర్‌దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిలకు లెటర్స్ వచ్చాయి. వీళ్లు ఆ లేఖలను చదువుతోన్న సమయంలో ఎంతగానో ఎమోషలన్ అయ్యారు. దీంతో ఈ లెటర్స్ ప్రక్రియ అంతా కన్నీరు పెట్టించేలా సాగిపోయింది.

దసరా స్పెషల్ ఎపిసోడ్ కావడంతో నామినేషన్స్‌లో ఉన్న వారిని నాగార్జున సేఫ్ చేయలేదు. కానీ, ఆయా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు స్క్రీన్‌పై కనిపించి 'నువ్వు సేఫ్ అయ్యావు' అని చెప్పాడు. వాళ్ల ఫ్యామిలీ మెంబర్లను చూసిన వాళ్లంతా ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా టేస్టీ తేజ తన తండ్రి ముఖాన్ని చూసిన వెంటనే వెక్కి వెక్కి ఏడుస్తూ నాగార్జునకే షాకిచ్చాడు.

Tasty Teja Crying After Saw His Father In Bigg Boss Telugu 7 Show

అప్పుడు 'సార్.. ఈరోజు మా నాన్న పుట్టినరోజు సార్. ఎలా విష్ చేయాలా అనుకుంటున్నా. అంతలోనే ఆయనతోనే నేను సేఫ్ అయినట్లు చెప్పించారు. ఈరోజు మర్చిపోలేను' అంటూ తేజ ఏడ్చేశాడు. దీనికి నాగార్జున 'తేజ నిన్ను ఇలా ఎప్పుడూ చూడలేదు. నీ ముఖంలో రియల్ ఎమోషన్ కనిపిస్తుంది. రెడ్డి గారూ హ్యాపీ బర్త్‌డే' అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక, తండ్రిని చూసిన తర్వాత టేస్టీ తేజ ఎమోషన్ ఆపుకోలేకపోయాడు. అతడిని శివాజి సహా పలువురు ఓదార్చినా ఆగకుండా ఏడ్చాడు. తర్వాత 'సార్ మా నాన్నతో నేను బిగ్ బాస్‌కు వెళ్తే ఫ్యామిలీ వీక్‌లో నువ్వే రావాలి అన్నాను. అప్పుడాయన నిన్ను ఎవరు పిలుస్తారురా అని ఆటపట్టించారు. కానీ, ఈరోజు ఆయనే నన్ను సేవ్ అని చెప్పారు' అంటూ బాగా ఏడ్చేశాడు. మొత్తానికి తేజను అలా చూసి నాగార్జునతో పాటు అందరూ ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X