Bigg Boss 8 Voting : షాకిస్తోన్న ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఏకంగా ముగ్గురు, ఈ వీక్ అతనేనా?
బిగ్‌బాస్ తెలుగు 8 మరో రెండ్రోజుల్లో ఏడో వారం కంప్లీట్ చేసుకుని 9వ వారంలోకి ప్రవేశించనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీదారుల రాకతో హౌస్ కళకళలాడుతోంది. టాస్క్‌లు, ఫన్‌ను ఇవ్వడంలో రాయల్ క్లాన్ సభ్యులు దూకుడుగా ఉంటున్నారు. పాత కంటెస్టెంట్స్ కూడా వీరికి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. గత వారం కిర్రాక్ సీత హౌస్‌ను వీడటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ సరళిని ఒకసారి పరిశీలిస్తే :
బుధవారం నాటి ఓవర్ స్మార్ట్ గేమ్ గురువారం కూడా కంటిన్యూ అయ్యింది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి రాయల్ క్లాన్ సభ్యులు.. ఛార్జింగ్ కాపాడుకోవడానికి ఓజీ క్లాన్ సభ్యులు కుస్తీలు పడ్డారు. ఫిజికల్ టాస్క్‌లలో ఇరగదీస్తారని పేరున్న నిఖిల్ - గౌతమ్‌లు ముఖాముఖిగా తలపడ్డారు. గౌతమ్‌ని సోఫాలోకి విసిరేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఓజీ క్లాన్ నుంచి ప్రతిఘటన వస్తుండటంతో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేయాలని రాయల్ క్లాన్ డిసైడ్ అయ్యింది.

దీనిలో భాగంగా మణికంఠను కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశారు. దీనిని గమనించిన నిఖిల్ ఇతర ఓజీ క్లాన్ మెంబర్స్ అతనిని కాపాడారు. అంతా మణికంఠ దగ్గర ఉండటంతో అవినాష్ ఓవర్ స్మార్ట్‌గా ఆలోచించి యష్మీని లోపలికి లాగేశాడు.. అతనికి టేస్టీ తేజ అద్భుతంగా సహకరించి వెంటనే డోర్ లాక్ చేసేశాడు. ఆమెను విడిపించాలని ట్రై చేసినా సాధ్యం కాలేదు. ఈలోపు అవినాష్ ఛార్జింగ్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు.
ఆవిడ తెలివిగా ఛార్జింగ్ పిన్ తీసేసి బయటికొచ్చేసింది. మరోవైపు ఫిజికల్ టాస్క్‌లు చూసి మణికంఠ భయపడ్డాడు. తనను గేమ్ తప్పించాలని రాయల్ క్లాన్‌ను బతిమలాడుకున్నాడు.. కానీ పృథ్వీని తప్పించి తెలివిగా వ్యవహరించారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. లైటర్ ద్వారా పాయింట్స్ కొట్టేద్దామని అనుకున్న హరితేజకి రోహిణి షాకిచ్చింది. అలా గేమ్ గురువారం కూడా తేలకుండా శుక్రవారం కూడా కంటిన్యూ అయ్యిది.

కాగా.. ఏడో వారం హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠలతో కలిపి మొత్తం 9 మంది నామినేషన్స్‌లో నిలిచారు. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను బట్టి ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో పరిశీలిస్తే . టాప్‌లో ఉన్న నిఖిల్‌ను నబిల్ అఫ్రిది వెనక్కి నెట్టి ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. నబిల్‌కు 21.13 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. నిఖిల్ 19.76 శాతం ఓట్లతో నిలిచాడు.
నాగమణికంఠ (17.5 శాతం) ఓటింగ్‌తో మూడో స్థానంలో నిలిచాడు, ప్రేరణ (13 శాతం), యష్మి (9.3 శాతం) , గౌతమ్ (8.7 శాతం) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో నిలిచారు. అయితే తాజా ఓటింగ్స్ ప్రకారం ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లో నిలిచారు. పృథ్వీరాజ్ (7.2 శాతం), హరితేజ (6.9 శాతం), టేస్టీ తేజా (5.7 శాతం) ఓట్లు సంపాదించారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడానికి ఇంకా గడువు ఉండటంతో ఈలోపు ఎలాంటి ఏ ప్లేస్‌లో నిలుస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











