Bigg Boss Telugu 7: బాత్రూంలో శోభా శెట్టి దారుణమైన పని.. మొత్తం తీసేసి మరీ తేజతో అలా!

ఏ భాషలో వచ్చినా ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా మారిపోయింది బిగ్ బాస్. అంతలా ఈ కార్యక్రమం దేశంలోని ఎంతో మందిని అభిమానులుగా మార్చుకుంది. ముఖ్యంగా తెలుగులో అయితే అత్యంత భారీ స్పందనను సొంతం చేసుకుంటూ ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఇందులో ఎవరూ ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. తాజా ఎపిసోడ్‌లో శోభా శెట్టి దారుణమైన పని చేసింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో తొమ్మిదో వారం గౌతమ్ కృష్ణ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడు ఆడవాళ్లకు గౌరవం ఇచ్చేలా తనకు డిప్యూటీలుగా లేడీ కంటెస్టెంట్లు రతికా రోజ్, శోభా శెట్టిని తీసుకున్నాడు. అలాగే, ఈ వారం మొత్తం ఆడవాళ్లు పని చేయకుండా ఉండేలా లేడీస్ వీక్ ప్లాన్ చేశాడు. అతడి నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Tasty Teja Did Shobha Shetty Personal Works in Bigg Boss Telugu 7 Show

కెప్టెన్ గౌతమ్ కృష్ణ తీసుకున్న నిర్ణయంపై బిగ్ బాస్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో 'ఈ వారం మొత్తం లేడీస్ వీక్ చేయాలంటూ కెప్టెన్ గౌతమ్ కృష్ణ తీసుకున్న నిర్ణయాన్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. అలాగే, ఈరోజు ఇంట్లో ఆడవాళ్లు అందరినీ రాణీల్లా చూసుకోవాల్సిన బాధ్యతను అప్పగిస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ 'ఈ ఇంట్లో ఉన్న లేడీ కంటెస్టెంట్లు అందరికీ మగవాళ్లే ఈరోజు బ్రేక్‌ ఫాస్ట్ రెడీ చేయాలి. అలాగే, వాళ్లకు కడుపు నిండా పెట్టాలి' అని చెప్పాడు. దీంతో ఆడవాళ్లంతా సంతోషం వ్యక్తం చేయగా.. మగ కంటెస్టెంట్లు మాత్రం వాళ్లకు సపర్యలు చేయడానికి సన్నద్ధం అయ్యారు. ఆ సమయంలోనే శోభా శెట్టి ఓ రేంజ్‌లో ఓవర్ యాక్షన్ చేసి చిరాకు పుట్టించింది.

బ్రేక్ ఫాస్ట్ చేయాలంటే ముందుగా బ్రష్ చేయాలని అన్న ఆమె.. తనకు సహాయం చేయడానికి తేజ కావాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత 'నాకు నువ్వే బ్రష్ చేయించాలి. వాష్ రూం వరకూ కూడా నువ్వే ఎత్తుకుని తీసుకు వెళ్లాలి' అని తేజతో చెప్పింది. దీంతో అతడు శోభా శెట్టిని నిజంగానే వాష్ రూం వరకూ మోసుకుంటూ తీసుకుని వెళ్లాడు.

Tasty Teja Did Shobha Shetty Personal Works in Bigg Boss Telugu 7 Show

వాష్‌ రూంలోకి వెళ్లిన తర్వాత తనకు తేజనే బ్రష్ చేయించాలని శోభా శెట్టి పట్టుబట్టింది. అతడు ఎంత చెప్పినా వినకపోవడంతో స్వయంగా బ్రష్‌లో పళ్లు రుద్దాడు. అనంతరం 'పళ్లు ఒక్కటే చాలా ఇంకేమైనా రుద్దాలా' అని తేజ.. శోభా శెట్టిని ప్రశ్నించాడు. అనంతరం ఆమె తనకు బ్రేక్ ఫాస్ట్ కోసం ఏం కావాలో అంబటి అర్జున్‌కు చెప్పింది. దీంతో అతడు కూడా తెచ్చి ఇచ్చాడు.

ఇదంతా అయిపోయిన తర్వాత టేస్టీ తేజ పక్కన శోభా శెట్టి కూర్చుని యావర్‌ను 'పిచ్చోడు' అని అనకుండా ఉంటే బాగుండు అని బాధ పడింది. అలాగే, గేమ్ గురించి కూడా మాట్లాడింది. అనంతరం తన మైక్‌ను, టేస్టీ తేజ మైక్‌ను తీసేసి మరీ గుసగుసలు ఆడింది. ఆమె చెప్పిన తర్వాత తేజ షాకైనట్లు నోరెళ్లబెట్టాడు. అయితే, ఇది మాత్రం లైవ్‌లోనే చూపించారు.

మొత్తానికి నామినేషన్స్‌లో అడ్డదిడ్డంగా మాట్లాడి పరువు పోగొట్టుకుంటోన్న శోభా శెట్టి.. గత ఎపిసోడ్‌లో టేస్టీ తేజతో వ్యవహరించిన తీరుతో విమర్శలపాలు అవుతోంది. దీనికి సంబంధించిన లైవ్ వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శోభా శెట్టిని బండ బూతులు తిడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X