Bigg Boss telugu 8 Voting : ఖరారైన ఎలిమినేషన్‌ .. రాయల్ క్లాన్‌ నుంచి ఫస్ట్ వికెట్? రెండు వారాలకే ఇంటికి!

బిగ్‌బాస్ తెలుగు 8 మరికొద్దిగంటల్లో ఏడో వారం పూర్తి చేసుకుని 8వ వారంలోకి అడుగుపెట్టనుంది. వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా ఒకరు ఎలిమినేట్ కావాల్సిందే. ఈ వారం 9 మంది నామినేషన్స్‌లో ఉండగా వారిలో ఒకరు హౌస్‌ను వీడనున్నారు. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే కావడంతో ఎవరో ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు కూడా టెన్షన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారో, ఎవరు లీస్ట్‌లో ఉన్నారో ఒకసారి పరిశీలిస్తే :

ఓవర్‌ స్మార్ట్ గేమ్ శుక్రవారం కూడా కంటిన్యూ అయ్యింది. మెగా చీఫ్ కంటెండర్‌షిప్ కోసం పెట్టిన ఈ టాస్క్ ప్రకారం ఎవరైతే ఛార్జింగ్‌తో నిలిచి ఉంటారో వాళ్లే మెగా చీఫ్ కంటెండర్లు. ఇందులో రాయల్ క్లాన్ గెలిచింది. ఆ టీమ్‌లో మెగా చీఫ్ అయ్యేందుకు పోటీపడుతున్న వారికి పట్టుకో లేదంటే వదులుకో అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ప్రకారం ఓ సర్కిల్‌లో ఓ ఎముకను ఉంచుతారు. దాని చుట్టూ అంతా తిరగాలి.

tasty teja May eliminated from the 7th week of Bigg Boss Telugu 8

ఎవరైతే బజర్ మోగినప్పుడు దానిని టచ్ చేస్తారో వాళ్లు ఈ గేమ్‌లో పాల్గొంటున్న ఇద్దరిని తీసేయొచ్చు.. ఈ టాస్క్‌లో గౌతమ్ ఎక్కువసార్లు గెలిచి మెగా చీఫ్ అయ్యాడు. అయితే హౌస్‌లో ఇంత మంది ఉన్నప్పుడు ఇంటిని మేనేజ్ చేయడం కష్టమన్న బిగ్‌బాస్.. ఇద్దరు మినీ చీఫ్‌లుగా గంగవ్వ, హరితేజలను నియమించాడు. తద్వారా మెహబూబ్ నుంచి గోల్డెన్ బ్యాండ్ గౌతమ్ చేతికి వెళ్లింది. వచ్చిన రెండు వారాల్లో ఇద్దరు రాయల్ క్లాన్ సభ్యులు మెగా చీఫ్‌లుగా నిలవడంతో ఓజీ క్లాన్ సభ్యులు షాక్‌లో ఉంటారు.

మరోవైపు.. విన్నర్ ప్రైజ్ మనీని పెంచుకునేందుకు బిగ్‌బాస్ అవకాశం ఇచ్చాడు. దీని ప్రకారం పృథ్వీ తన లాంగ్ హెయిర్, గడ్డాన్ని తీసేయాలి. హెయిర్ కట్ చేయించుకుంటే రూ.25 వేలు, గడ్డం తీసేస్తే రూ.50 వేలు.. గడ్డం, మీసం రెండూ తీసేస్తే రూ.లక్ష ప్రైజ్ మనీ ఇస్తామని చెబుతాడు. ఇదే డీల్ అవినాష్‌కి సైతం వస్తుంది. ఈ ఇద్దరిలో పృథ్వీ హెయిర్ కట్ చేయించుకోవడానికి ససేమిరా అనడగా అవినాష్ అంగీకరించినట్లుగా తెలుస్తుంది.

కాగా.. ఏడో వారం హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠలతో కలిపి మొత్తం 9 మంది నామినేషన్స్‌లో నిలిచారు. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను బట్టి ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో పరిశీలిస్తే . నబిల్ అఫ్రిదిని వెనక్కి నెట్టి ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచాడు నిఖిల్. నబిల్‌కు 17.48 శాతం ఓటింగ్‌ నమోదవ్వగా.. నిఖిల్‌ 19.24 శాతం ఓట్లతో నిలిచాడు.

నాగమణికంఠ (12.69 శాతం) ఓటింగ్‌తో మూడో స్థానంలో నిలిచాడు, ప్రేరణ (12.1 శాతం), పృథ్వీరాజ్ (9.21 శాతం), యష్మి (8.86 శాతం) , గౌతమ్ (7.34 శాతం) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో నిలిచారు. అయితే తాజా ఓటింగ్స్‌ ప్రకారం హరితేజ (6.62 శాతం), టేస్టీ తేజా (6.47 శాతం) ఓట్లు సంపాదించారు. దీని ప్రకారం టేస్టీ తేజా ఎలిమినేట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే కొద్దిగంటల్లో ఓటింగ్ లైన్స్ క్లోజ్ కానుండటంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X