Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లో దారుణం.. ఆమెతో తేజ అసభ్య ప్రవర్తన.. అక్కడ టచ్ చేసిన వీడియో వైరల్
తెలుగు బుల్లితెరపై ఊహకే అందని విధంగా ప్రేక్షకాదరణను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంట్‌తో నడిచేదే అయినా.. మన ప్రేక్షకులకు ఇది చాలా త్వరగానే చేరువైంది. అందుకే విజయవంతంగా చాలా సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడోది కూడా ప్రసారం అవుతోంది. ఇందులో ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టేస్టీ తేజ ఓ అమ్మాయితో అస్యంగా ప్రవర్తించాడు. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
ఆ రికార్డులు బ్రేక్ చేయాలని:ఇప్పటి వరకూ తెలుగులో బిగ్ బాస్ ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో పూర్తి చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఏడో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత రికార్డులను బ్రేక్ చేసేందుకు ఇందులో సరికొత్త ప్రయోగాలు చేస్తూ, షాక్‌లు, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు.

14 మందిలో అతడు క్రేజీగా:తాజాగా జరుగుతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుని స్పెషల్ ఫోకస్ అయ్యారు. వారిలో జబర్ధస్త్ మాజీ కమెడియన్, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ ఒకడు. యూట్యూబర్‌గా వచ్చిన అతడు ఆరంభం నుంచే తనదైన కామెడీని పంచుతూ, విచిత్రమైన డ్రెస్సింగ్‌తో క్రేజీగా అనిపించాడు.
బెస్ట్ ఎంటర్‌టైనర్ అనేలా:బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే టేస్టీ తేజ తనదైన రీతిలో కామెడీని పంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరినీ గౌరవంగానే పలకరిస్తూ, అప్పుడప్పుడూ పంచులు, సెటైర్లు వేస్తూ సందడి చేస్తున్నాడు. మధ్యలో కాస్త ఓవర్ యాక్షన్ చేసినా అతడిని అందరూ లైట్ తీసుకుంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఏడో సీజన్‌లో బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా మారుతున్నాడు.
నామినేషన్స్‌లో గొడవలు:తాజాగా జరుగుతున్న సీజన్‌లో టేస్టీ తేజ వ్యవహార శైలిపై అప్పుడప్పుడూ విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలతో అతడి ప్రవర్తన ఏమాత్రం బాలేదని కొందరు అంటున్నారు. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ రతికా వంటి వాళ్లు అతడి ముఖం మీదనే విమర్శించారు. ఇదే కారణం చెప్పి ఆమె టేస్టీ తేజను ఈ వారం నామినేట్ కూడా చేసిన విషయం తెలిసిందే.
శుభశ్రీతో అసభ్య ప్రవర్తన:గతంలో మాదిరిగా కాకుండా బిగ్ బాస్ ఏడో సీజన్‌లో అమ్మాయిలకు, అబ్బాయిలకు బెడ్‌రూంలు కలిపే ఇస్తున్నారు. దీంతో ఎవరు పడితే వాళ్లు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రూమ్‌లో బెడ్‌పై ఉన్న టేస్టీ తేజ దగ్గరకు శుభశ్రీ రాయగురు వెళ్లి కూర్చుంది. దీంతో అతడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
అక్కడ చేయి వేశాడుగా:టేస్టీ తేజ బెడ్ దగ్గరకు వెళ్లి కూర్చున్న శుభశ్రీ రాయగురు.. చిన్న గౌన్ వేసుకుని కనిపించింది. దీంతో ఆమె థైస్ బాగా కనిపిస్తున్నాయి. అందుకే టెంప్ట్ అయ్యాడో ఏమో కానీ.. తేజ ఆమె థైస్‌పై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఆమె తేరుకోవడంతో చేయి తీసేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను చాలా మంది నెటిజన్లు షేర్ చేసి అతడిని ఏకిపారేస్తున్నారు.
బిగ్ బాస్‌పై విమర్శలు:శుభశ్రీ రాయగురుతో టేస్టీ తేజ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బిగ్ బాస్ షోను వ్యతిరేకించే వర్గం మొత్తం దీన్ని హైలైట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్‌పై చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ఫలితంగా అటు టేస్టీ తేజ, ఇటు శుభశ్రీ పేర్లు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











