Bigg Boss Telugu 7: ఐ లవ్ యూ అంటూ కంటెస్టెంట్ షాక్... మొహం మీదే ఊసేసిన శోభా శెట్టి

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయి 7 వారాలు కావొస్తుంది. ఇక ఈ సీజన్ లో కరెక్ట్ లవ్ ట్రాక్ ఒక్కటి లేదు. బిగ్ బాస్ మొదట్లో ప్రశాంత్, రతికా లవ్ ట్రాక్ పెట్టాలని అనుకున్నాడు. కానీ అది కాస్త రివర్స్ అయింది. ఇప్పుడు మరో జంటను లవ్ ట్రాక్ లోకి ఇరికించడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అస్సలు సెట్ అవ్వట్లేదు. చూసే జనాలకు మాత్రం చిరాకు పుట్టించేలా ఉంటుంది. వాళ్లు ఎవరు అనేది ఈ పాటికి మీకే అర్థం అయి ఉంటుంది. టేస్టీ తేజ, శోభా శెట్టి లవ్ ట్రాక్.. చూసే వారికి మాత్రం చాలా చీదర పుట్టిస్తుంది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 7 షోలో 7వ వారం క్యాప్టెన్ కంటెండర్స్ కోసం పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జీలేబి పురం, గులాబీ పురం అంటూ రెండు టీములుగా చేసి... వారి మధ్య ఆసక్తికర టాస్కులు నిర్వహిస్తున్నాడు. ఇక ఆ టాస్కుల సంగతి పక్కన పెడితే... ఈ డ్రామాలో టేస్టీ తేజ, శోభా శెట్టి మధ్య లవ్ ట్రాక్ ఇరికించడానికి బిగ్ బాస్ తెగ కష్టపడుతున్నాడు. ఈ వారం అంతా తేజ.. శోభా శెట్టికి మాజీ భర్త అంటూ చెప్పిన బిగ్‌బాస్.. ఈరోజు సడెన్‌గా ఓ పెద్ద షాక్ నే ఇచ్చాడు.

 Tasty Teja Proposed To Shobha Shetty in Bigg Boss Telugu 7 Show

తేజ, శోభా, పూజా మూర్తి అందరూ కిచెన్ దగ్గర కూర్చోని టాటూ గురించి ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు. శోభా పేరును నుదిటిపై టాటూ వేయించుకో తేజ అంటూ పూజా సరదాగా అన్నది. దీనికి ఇంకా సరదాగా అది ఎక్కుడుందో అక్కడ వేయించుకుంటా.. అంటూ గుండె చూపించాడు తేజ. ఇక ఇదే అసలు సందు అనుకుని బిగ్ బాస్ ఎంటర్ అయ్యాడు. తేజ ఒక వేళ మీరు టాటూ వేయించుకోవాలంటే ఇంట్లో ఎవరి పేరు టాటూ వేయించుకుంటారంటూ ఫిటింగ్ పెట్టాడు. ఏదో సరదాగా అన్నాను అంటూ తేజ చెప్పుకువచ్చాడు.

ఇక శోభా ఎంటర్ అయి... తన పేరు గుండె మీద వేయించుకుంటాడంట బిగ్‌బాస్ అంటూ చెప్పుకువచ్చింది. దీంతో తేజ ఎవరి పేరు టాటూ వేయించుకుంటావ్.. అంటూ బిగ్‌బాస్ సీరియస్ గా అడిగాడు. దీంతో భయపడ్డ తేజ.. మా ఇంట్లో ఒప్పుకోరు... అది కూడా అమ్మాయిల పేర్లు అంటే వద్దు బిగ్ బాస్. అసలే పెళ్లి కావాల్సిన వాడిని అర్థం చేసుకో... కావాలంటే బిగ్ బాస్ టాటూ వేయించుకుంటా కానీ శోభా శెట్టి పేరు వేసుకోను అంటూ చెప్పుకువచ్చాడు.

దీంతో శోభా శెట్టిరెచ్పిపోయింది. ఇప్పటి దాకా అబద్ధాలు చెప్పావా... గుండెల్లో ఉన్నాను అన్నావ్... ఇదంతా సేఫ్ గేమ్ ఆ.. అంటూ శోభా రెచ్చిపోయి మాట్లాడింది. సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అంటే చెప్పు ఇప్పుడే వేసుకుంటా అంటూ తేజ చెప్పాడు. ఇక బిగ్ బాస్ కూడా.. డిజైన్స్ పంపి... అందులో డిజైన్ సెలెక్ట్ చేసుకో అంటూ తేజకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక ఇది చూసిన తేజ... ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్ అంటూ రెచ్చిపోయాడు. నాతో ఆడుకోవద్దు బిగ్‌బాస్.. పసిప్రాణం గిలగిల కొట్టుకుంటుందంటూ చెప్పుకువచ్చాడు.

 Tasty Teja Proposed To Shobha Shetty in Bigg Boss Telugu 7 Show

ఆ తర్వాత తేజ ఇది ముగింపు కాదు.. ముందుంది ముసళ్ల పండగ అంటూ ఒక లెటర్‌ తో పాటు శోభా అని రాసిన కేకును పంపించాడు బిగ్ బాస్. అసలు ఇది ఎందుకు పంపించాడు.. తనకి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తేజకి అసలు అర్థం కాలేదు. ఇక ఈలోపు కేకును చూసి మిగిలిన కంటెస్టెంట్లు కక్కుర్తి పడ్డారు. అమర్ ఓ కేక్ ముక్కను తినేశాడు. ఇక అమర్, శోభా శెట్టి మధ్య కాసేపు వాదన జరిగింది.

ఇక చాలా సేపటి తర్వాత అందరినీ పిలిచి శోభా-తేజ కేక్ కట్ చేసి ఇచ్చారు. అయితే అంతా అయిపోయిన తర్వాత నైట్ శోభాని గార్డెన్‌కి పిలిచాడు తేజ. అసలు కేకు ఎందుకు పంపించాడు.. నీ పేరు ఎందుకు రాశాడు.. లెటర్‌లో నాకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడంటూ తేజ అడిగాడు. పోరా ఏదో చెబుతావనుకుంటే సోది చెబుతున్నావంటూ శోభా కోపంగా లేచింది. దీంతో తేజ ఐ లవ్ యూ అంటూ శోభాకు చెప్పాడు. అది విన్న శోభా తూ అంటూ ఊసేసి వెళ్లిపోయింది. చెప్పమంటావ్.. చెబితే పట్టించుకోవంటూ తేజ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X