Bigg Boss Telugu 7: సందీప్ మాస్టర్ బండారం బయటపెట్టిన తేజ.. ఎలిమినేషన్‌కు అసలు కారణం ఇదేనా!
కంటెంట్ కొత్తదే అయినా కనీవినీ ఎరుగని రీతిలో బుల్లితెరపై ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్న ఏకైక షోనే బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో నిర్వహకులు ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్టులను తీసుకు వచ్చి సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏడో దాన్ని ఎంతో గ్రాండ్‌గా మొదలు పెట్టారు. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సందీప్ మాస్టర్ ఎలిమినేషన్ వెనుక కారణాన్ని టేస్టీ తేజ బయట పెట్టేశాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీరే చూడండి!
8 మందిలో సందీప్ ఒక్కడే:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారం దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ రాయగురులు వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆరో వారంలో నయని పావని, ఏడో వారంలో పూజా మూర్తి, ఎనిమిదో వారంలో సందీప్ వెళ్లిపోయారు.

సందీప్‌కు ప్లస్సే మైనస్‌గా:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని కంటెస్టెంట్లు అందరిలోనూ సందీప్ మాస్టర్ స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకున్నాడు. అందుకే ఫస్ట్ హౌస్‌మేట్‌గానూ నిలిచాడు. అయితే, అతడు మొదటి ఏడు వారాలూ నామినేషన్స్‌లోకి రాలేదు. దానివల్ల సందీప్‌కు ఓట్ బ్యాంక్ ఏర్పడలేదు. ఈ పరిస్థితుల్లో ఎనిమిదో వారం నామినేట్ అవడంతో అతడికి తక్కువ ఓట్లు పోలై ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
తేజ నామినేషన్ వల్లే ఔట్:వాస్తవానికి సందీప్ మాస్టర్ ఓట్లు పడని కారణంగానే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, అతడిని టేస్టీ తేజ సిల్లీ రీజన్ ఇచ్చి నామినేట్ చేయడం వల్లే బయటకు వెళ్లిపోవాల్సి వచ్చిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని సండే ఎపిసోడ్‌లో నాగార్జున కూడా ప్రస్తావించడంతో సందీప్ మాస్టర్ అభిమానులు అందరూ టేస్టీ తేజపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

శివాజి నామినేట్ చేశాడు:టేస్టీ తేజ సిల్లీ నామినేషన్ అంశం తాజా ఎపిసోడ్‌లో జరిగిన నామినేషన్స్ టాస్కులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఈ ప్రక్రియలో హీరో శివాజి.. టేస్టీ తేజను నామినేట్ చేస్తూ.. 'పాపం వాడు (సందీప్ మాస్టర్) మంచి ప్లేయర్‌రా. ఫినాలే వరకూ ఉండాల్సిన వాడు. కానీ, నువ్వు సరదాగా నామినేట్ చేయడం వల్లే వాడు వెళ్లిపోవాల్సి వచ్చింది అనిపించింది' అంటూ కారణం చెప్పాడు.
నిజాన్ని చెప్పేసిన తేజ:శివాజీ తనను నామినేట్ చేయడానికి సందీప్ మాస్టర్‌ను తీసుకు రావడంతో టేస్టీ తేజ స్పందించాడు. 'అన్నా నువ్వే చెప్పావుగా నామినేట్ చేస్తే ఎలిమినేట్ చేసినట్లు కాదని. అయినా ఈ వారం నన్ను నామినేట్ చేయరా అని సందీప్ మాస్టరే నాతో చెప్పారు. నేను నిజంగా చెబుతున్నా అన్నా.. నామినేషన్స్ ముందు రోజు మేమిద్దరం మాట్లాడుకున్నాం. అందుకే చేశా' అని చెప్పాడు.

తన గోతిలో తానే పడ్డాడు:సందీప్ మాస్టర్ ఎలిమినేషన్ తర్వాత టేస్టీ తేజ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. దీంతో తనకు ప్రేక్షకుల్లో సింపతీ వచ్చి.. ఓట్ బ్యాంక్ పెరగడం కోసమే తనను నామినేట్ చేయమని ఉంటాడా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో మరికొందరు మాత్రం సందీప్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











