Bigg Boss Telugu 7 Finale: నక్కతోక తొక్కిన తేజ.. బిగ్ బాస్ కంటే డబుల్.. చెప్పకూడనిది చెప్పేశాడే!
బుల్లితెర చరిత్రలోనే దేశ వ్యాప్తంగా సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన షో బిగ్ బాస్. ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్న దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ భారీగానే లభిస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఇది దేశంలోనే ఎక్కువ రేటింగ్‌ను దక్కించుకుంటోంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఏడో సీజన్‌ను ఎన్నో ప్రయోగాలతో నడుపుతూ వచ్చారు. ఇలా పదిహేను వారాల పాటు సందడి చేసిన ఈ సీజన్ నేటితో ముగియనుంది. ఇందుకోసం ఇప్పుడు గ్రాండ్ ఫినాలేను జరుపుతున్నారు. ఇందులో మాజీ కంటెస్టెంట్ టేస్టీ తేజ తన సంపాదన గురించి చెప్పాడు. ఆ వివరాలు మీకోసమే!
తెలుగు బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకూ ప్రసారం అయిన సీజన్లు అన్నీ సూపర్ సక్సెస్ అవడంతో ఏడో దాన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఎన్నో అంశాలను చూపించి ప్రేక్షకులకు 105 రోజుల పాటు వినోదాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సీజన్‌ను తాజాగా జరుగుతున్న గ్రాండ్ ఫినాలేతో ముగించబోతున్నారు.

బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో ముందుగా మాజీ కంటెస్టెంట్ల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు చూపించారు. ఆ తర్వాత వాళ్లందరితో హోస్ట్ నాగార్జున మాట్లాడారు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది అని ఆయన ప్రశ్నించారు. దీనికి ఆ కంటెస్టెంట్లు అందరూ సమాధానాలను చెప్పారు.
బిగ్ బాస్ ఏడో సీజన్ నుంచి వెళ్లిన తర్వాత తన లైఫ్ సూపర్‌గా ఉందని టేస్టీ తేజ వెల్లడించాడు. దీంతో నాగార్జున 'మీ అమ్మ నాన్న ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారు' అని అడిగాడు. దీనికతడు 'మా అమ్మ మాత్రం ఒక మాట అంది సార్. నేను బిగ్ బాస్ హౌస్‌లోకి వద్దామని చీర కూడా రెడీ చేసుకున్నా. కానీ, ఇలా అయిందేంటి అని బాధ పడింది సార్' అని చెప్పుకొచ్చాడు.
టేస్టీ తేజ ఆ తర్వాత కంటిన్యూ చేస్తూ.. 'సార్ ఇక్కడ మొహమాటం లేకుండా గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నాను సార్. షో తర్వాత నాకు 15 సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు మూవీ ప్రమోషన్లు చేసే నాకు.. ఇప్పుడు 15 చిత్రాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. అస్సలు ఇది మాత్రం నేను ఊహించలేదు సార్' అని వెల్లడించాడు.
టేస్టీ తేజ చివర్లో తన సంపాదన గురించి కూడా వివరించాడు. 'సార్ అసలు ఈ మాట చెప్పొచ్చో లేదో తెలీదు కానీ చెబుతున్నా. నేను బిగ్ బాస్ షోలో ఉన్న తొమ్మిది వారాల్లో ఎంత అయితే సంపాదించానో.. దానికంటే డబుల్ మొత్తాన్ని బయటకు వచ్చిన ఆరు వారాల్లోనే సంపాదించేశాను' అని తెలిపాడు. ఆ తర్వాత తేజ జర్నీని తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు. మొత్తానికి బిగ్ బాస్ పుణ్యమా అని టేస్టీ తేజ బాగానే క్లిక్ అయ్యాడని అర్థం అవుతుంది.


Click it and Unblock the Notifications











