Bigg Boss Telugu 7 టాప్ 3 కంటెస్టెంట్లు ఎవరంటే? టేస్టీ తేజ షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ తెలుగు 3 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొంటున్నది. 12వ వారంలోకి ప్రవేశించిన ఈ గేమ్‌లో కంటెస్టెంట్లు విజేతగా నిలువడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే రియాలిటీ షోలో టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 3లో ఎవరు ఉంటారనే చర్చ జోరుగా సాగుతున్నది. అలాంటి క్రమంలో ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ..
యూట్యూబర్‌గా, ఫుడ్ వ్లాగర్‌గా కెరీర్ ప్రారంభించిన టేస్టీ తేజ బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా మారాడు. మూడు నాలుగు వారాలు ఉంటాడనుకొన్న ఆయన దాదాపు 8 వారాలకుపైగా ఇంటిలో ఉన్నాడు. తనదైన శైలిలో ఇంటిలో వినోదాన్ని పంచి ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. కానీ అనూహ్యంగా 9వ వారం ఇంటి నుంచి ెలిమినేట్ అయ్యాడు.

బిగ్‌బాస్ తెలుగు నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం చాలా మందికి షాక్ ఇచ్చింది. ఇంటిలో మంచి కంటెంట్ ఇస్తున్న తేజ ఎలిమినేట్ కావడం ఏమిటనే ప్రశ్న అందరి నుంచి వచ్చింది. కానీ సోషల్ మీడియాలో బలంగా లేకపోవడం వల్ల ఓట్లు తక్కువగా రావడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఎలిమినేషన్ తర్వాత తేజకు అభిమానుల నుంచి భారీ స్పందన కనిపిస్తున్నది.
ఎలిమినేషన్ తర్వాత పలు మీడియాలకు ఇంటర్వ్యూ ఇచ్చిన టేస్టీ తేజ ఇంటిలోని చాలా విషయాలను బయటకు చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంటిలోని గ్రూపుల మధ్య జరుగుతున్న విషయాలను తనదైన శైలిలో చెప్పారు. ఇంటి నుంచి బయటకు రావడం చాలా బాధగా ఉంది అని అన్నారు.
అయితే ఇంటిలో కప్ ఎవరు గెలుస్తారు? టాప్ 3 స్థానాల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని క్లారిటీగా చెప్పలేకపోయారు. ఆ ప్రశ్నలకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. టాప్ 5 గానీ, టాప్ 3లో గానీ ఎవరు ఉంటారనే విషయాన్ని చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ తన సమాధానంతో ముసుగులో గుద్దులాట మాదిరిగా ఓ సమాధానం చెప్పారు. ప్రేక్షకులు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్లు టాప్ 3లో నిలుస్తారని ఇంటిలో మాదిరిగానే బయట కూడా సేఫ్ గేమ్ ఆడినట్టు కనిపించాడు.
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 12వ వారం నామినేషన్ల ప్రక్రియ ఎప్పటిలానే రచ్చగా మారింది. ఈ వారం నామినేట్ అయిన వారిలో అమర్‌దీప్, గౌతమ్, రతిక, అర్జున్ అంబటి, ప్రశాంత్, అశ్విని ఉన్నారు. ఈ వారం డబుల్ నామినేషన్ ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











