నా కొత్త ప్రయాణం మొదలు.. బిగ్ బాస్ టేస్టీ తేజ ఎమోషనల్

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు టెస్టీ తేజ (Tasty Teja) పేరు కొత్త కాదు. యూట్యూబ్‌లో ఫుడ్ వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించిన తేజ.. తన ప్రత్యేక స్టైల్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఆ క్రేజ్‌తో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu)లోకి అడుగుపెట్టి మరింత పాపులర్ అయ్యారు. ఒక్కసారి కాదు, ఏకంగా రెండు సార్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించారు. సీజన్ 7లో మెయిన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తేజ.. తొమ్మిది వారాలు హౌస్‌లో కొనసాగి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ హౌస్‌లోకి వెళ్లి 13వ వారం వరకు నిలిచి మరోసారి తన క్రేజ్‌ను నిరూపించారు.

బిగ్‌బాస్ ద్వారా వచ్చిన గుర్తింపును సరిగ్గా వినియోగించుకున్న టేస్టీ తేజ ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, సినిమా ప్రమోషన్లు, ఫుడ్ వ్లాగ్స్‌తో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు, నటీనటులతో కలిసి ప్రత్యేక వీడియోలు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారని సమాచారం. ఇక వ్యాపార రంగంలో కూడా తేజ దూసుకుపోతున్నారు. 'ఇరానీ నవాబ్స్ టీ' పేరుతో టీ బ్రాండ్ ప్రారంభించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర నగరాల్లో కూడా ఫ్రాంచైజీలు విస్తరిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా మొదలైన ప్రయాణాన్ని విజయవంతమైన వ్యాపారవేత్త స్థాయికి తీసుకెళ్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఇంతకీ కొత్త బిజినెస్ ఎంటీ?

Tasty Teja Starts New Event Business After Bigg Boss Fame Fans Celebrate His Journey

బిగ్‌బాస్ పాపులరిటీ టేస్టీ తేజ సరిగ్గా ఉపయోగించుకున్నారు. షో ద్వారా వచ్చిన గుర్తింపును క్యాష్ చేసుకుంటూ టీవీ షోలు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, సినిమా ప్రమోషన్లలో బిజీగా మారారు. ముఖ్యంగా కొత్త సినిమాల ప్రమోషన్ల కోసం హీరోలు, దర్శకులు కూడా ఆయనతో కలిసి ప్రత్యేక వీడియోలు చేయించడం గమనార్హం. దీంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా ఆయన డిమాండ్ పెరిగింది. ఇక వ్యాపార రంగంలో కూడా టేస్టీ తేజ దూసుకుపోతున్నారు. ఇప్పటికే "ఇరానీ నవాబ్ టీ" పేరుతో టీ బ్రాండ్ ప్రారంభించి పలు ప్రాంతాల్లో ఫ్రాంచైజీల రూపంలో విస్తరిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా ఈ బ్రాండ్‌కు స్పందన వస్తోందని సమాచారం.

తాజాగా ఇప్పుడు "శ్రీ టేస్టీ తేజ సెలబ్రేషన్స్" పేరుతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ కొత్త వ్యాపారం ద్వారా పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు, వెడ్డింగ్ యానివర్సరీలు, సంగీత్, హల్దీ, రిసెప్షన్, హౌస్ వార్మింగ్, ఫుడ్ క్యాటరింగ్, డెకరేషన్ వంటి సేవలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఒకే చోట అన్ని సేవలు అందించే సెలబ్రేషన్ బ్రాండ్‌గా దీనిని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల ఈ కొత్త బిజినెస్‌కు గ్రాండ్ ఓపెనింగ్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు, సన్నిహితులు, స్నేహితులు హాజరై సందడి చేశారు. ప్రారంభోత్సవ వీడియోను టేస్టీ తేజ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ "నా కల నెరవేరింది" అని క్యాప్షన్ ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా తేజకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. "యూట్యూబర్‌గా మొదలై బిజినెస్‌మ్యాన్‌గా ఎదిగావు", "కష్టపడితే సాధ్యం అవుతుందని నిరూపించావు", "ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలి" అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక రంగంలో వచ్చిన ఫేమ్‌ను మరో రంగంలో అవకాశంగా మలుచుకోవడం తెలివైన నిర్ణయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X