Bigg Boss Telugu 7: పెద్ద తప్పు చేసిన శివాజి.. పాపం అసలైన కోరిక తీరకుండానే!

దేశంలోనే ది బెస్ట్ అని నిరూపించుకున్న షో బిగ్ బాస్. అందులోనూ తెలుగులో ప్రసారం అయ్యే కార్యక్రమమే టాప్ రేసులో దూసుకుపోతోంది. దీనికి కారణం అన్ని భాషలతో పోలిస్తే దీనికి భారీ స్థాయిలో రేటింగ్ వస్తుండడమే. ఇప్పటి వరకు జరిగిన సీజన్లు అన్నీ ఇదే తరహా ఫలితాన్ని అందుకున్నాయి.

ఇక, ఈ మధ్యనే ప్రారంభమైన ఏడో సీజన్ సైతం సరికొత్త టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సహా కొన్ని సర్‌ప్రైజ్‌ల కారణంగా రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోలో ఎలిమినేషన్ జరిగింది. దాని వెనుక ఓ చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే....

Tasty Teja Unexpected Words with Sivaji After Eliminate From Bigg Boss Telugu 7

ఊహకే అందని ఏడో సీజన్: బిగ్ బాస్ అనేది తెలుగు ప్రేక్షకులకు ఒక ఎమోషనల్‌లా మారిపోయింది. అంతలా దీన్ని ఎప్పుడు వచ్చినా ఆదరిస్తున్నారు. ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతుండడంతో ఇందులో ఎన్నో కొత్త కొత్త అంశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇది ఊహకే అందని విధంగా సాగుతోంది. దీంతో ఈ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ దూసుకుపోతోంది.

వరుసగా ఆడవాళ్లే వెళ్లగా: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎలిమినేషన్స్ అన్నీ షాకింగ్‌గా అవుతున్నాయి. దీనికి కారణం ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో జరిగిన ఏడు ఎలిమినేషన్లలోనూ లేడీ కంటెస్టెంట్లే బయటకు వెళ్లిపోయారు. అసలే బిగ్ బాస్ షోలో లేడీ విన్నర్లు లేరని అనుకుంటే.. ఇందులో రికార్డు స్థాయిలో వరుసగా ఫీమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడంతో ఈ సీజన్‌పై విమర్శలు కూడా వచ్చాయి.

సందీప్ తర్వాత తేజనే: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో వరుసగా ఏడుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన తర్వాత ఎనిమిదో వారం సందీప్ మాస్టర్ బయటకు వెళ్లాడు. ఇక, తొమ్మిదో వారంలో ఎనిమిది మంది నామినేషన్‌లోకి రాగా.. టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. చివరి రౌండ్‌లో రతికా రోజ్ తాను ఎలిమినేట్ అవుతుందేమో అనుకుని వెక్కి వెక్కి ఏడ్చి హైడ్రామాను క్రియేట్ చేసేసింది.

ఎమోషనల్‌ అయ్యారుగా: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో తొమ్మిదో వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్‌మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖ్యంగా శివాజి, శోభా శెట్టి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లు బాగా ఎమోషనల్ అయ్యారు. మిగిలిన వాళ్లు కూడా తేజతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండింగ్ అంతా భావోద్వేగంగా సాగిపోయింది.

సిల్లీ వాడికే సిల్లీ రీజన్‌తో: వాస్తవానికి తొమ్మిదో వారం జరిగిన నామినేషన్స్‌లో టేస్టీ తేజకు రెండు నామినేషన్లే పడ్డాయి. అందులో ఒకటి పల్లవి ప్రశాంత్ తనను కెప్టెన్సీ టాస్కు నుంచి తీసేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. కానీ, రెండో వ్యక్తి శివాజి మాత్రం 'నువ్వు సిల్లీ రీజన్స్ చెప్పి సందీప్‌ను నామినేట్ చేయడం తప్పురా. నువ్వు ఎలాగో సేవ్ అవుతావు' అంటూ నామినేట్ చేశాడు.

లెక్క తప్పింది.. షాక్‌లో: టేస్టీ తేజ ఈ వారంలో సేఫ్ అవుతాడని శివాజి పదే పదే షోలో చెప్పాడు. కానీ, అతడి లెక్క తప్పని ప్రేక్షకులు నిరూపించారు. ఫలితంగా తేజ ఈ వారంలో షో నుంచిఎలిమినేట్ అయిపోయాడు. వాస్తవానికి ఈ సీజన్‌లో శివాజి ఏదైనా కరెక్టుగా ఊహించేవాడు. కానీ, తేజ విషయంలో అతడి లెక్క తప్పింది. చాలా మంది శివాజి తప్పు వల్లే తేజ ఎలిమినేట్ అయ్యాడని విమర్శిస్తున్నారు.

ఆ కోరిక తీరకుండానే: ఎలిమినేషన్ అయినట్లు ప్రకటించిన తర్వాత టేస్టీ తేజ బయటకు వెళ్లే ముందు అతడు శివాజితో 'అన్నా ఫ్యామిలీ వీక్‌లో అమ్మను హౌస్‌లోకి తీసుకు రావాలని కోరిక ఉండేది. కానీ, ఇప్పుడు అది తీరకుండానే వెళ్లిపోతున్నా. అందుకే నామినేషన్ వేయొద్దు అని బ్రతిమాలాను కదా. మీరు వినలేదు. సరే మీరు ఇది మనసులో పెట్టుకోకండి' అంటూ ఎమోషనల్‌గా కామెంట్స్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X