Bigg Boss Telugu Voting : ఓటింగ్‌లో టేస్టీ తేజ తుఫాన్ .. కన్నడ బ్యాచ్‌కి ముచ్చెమటలు
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 11వ వారంలోకి ప్రవేశించింది. మరికొద్దివారాల్లో సీజన్ ముగియనుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు ఉండగా.. వారిలో ఒకరు ఈ వీక్ ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్‌లో ఉన్నారు? ఈ వివరాల్లోకి వెళితే..
సోమవారంతో నామినేషన్స్ రచ్చ ముగియడంతో తిరిగి మంగళవారం నుంచి హౌస్‌మెట్స్ అంతా గొడవలన్నీ పక్కనపెట్టి చిల్ అయ్యారు. ఇక బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌కు శ్రీకారం చుట్టారు. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా ఇంట్లోకి తీసుకొచ్చాడు. తొలుత కంటెస్టెంట్స్‌కి ఓ ఫన్నీ టాస్క్ ఇవ్వడంతో ఇంటి సభ్యులంతా ఆడుతూ కనిపిస్తారు. ఇంతలో ఓ పిల్లాడు లోపలికి పరిగెత్తుకుంటూ రాగా.. వాడిని రోహిణి ఎత్తుకుని వీడు నా మేనల్లుడు సాత్విక్ అని అందరికీ పరిచయం చేస్తుంది. కాసేపటికి రోహిణి తల్లి వచ్చారు. అందరినీ పలకరించిన ఆమె మా అమ్మాయితో గొడవ పడొద్దంటూ పృథ్వీకి చెప్పారు. తర్వాత విష్ణుతో మీ అమ్మ లేదని బాధపడకు, నేనున్నా అని చెబుతారు.

తర్వాత నబీల్‌ను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి స్వీట్లు పెట్టాడు బిగ్‌బాస్. ఇంటి సభ్యులకు ఫుడ్ కోసం నబీల్ ఈ సీజన్ మొత్తం స్వీట్స్ తినకుండా ఉంటానని మాటిచ్చాడు. దీంతో అతని కోసం ప్రత్యేకంగా మిఠాయిలు పంపించాడు బిగ్‌బాస్. ఇంతలో డోర్ లోపలి నుంచి నబీల్ అమ్మ వచ్చారు. అందరితో మంచిగా ఉండు.. ఎవరో ఏదో అన్నారని బాధపడొద్దని కొడుక్కి సలహాలిచ్చింది తల్లి. ఇదంతా పరోక్షంగా కన్నడ బ్యాచ్ గురించేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తర్వాత ఇంటి సభ్యులందరికీ గులాబ్ జామున్లు తినిపించాడు నబీల్.
ప్రస్తుతానికి నబీల్, రోహిణిల ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో సరిపెట్టిన బిగ్‌బాస్ రాబోయే రోజుల్లో మిగిలిన కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి తీసుకురానున్నాడు. రోజూ అరుపులు, కేకలు, గొడవలతో హోరెత్తిపోయే బిగ్‌బాస్ హౌస్.. కొద్దిరోజులు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండిపోనుంది. ఇకపోతే.. 11వ వారం బిగ్‌బాస్ తెలుగు 8లో ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు. వారు గౌతమ్, టేస్టీ తేజ, యష్మి గౌడ, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు.

ఇక నామినేషన్స్ పూర్తి కాగానే సోషల్ మీడియాలో 11వ వారానికి సంబంధించి ఓటింగ్ ప్రారంభమైంది. దీని ప్రకారం.. వరుసగా రెండోసారి గౌతమ్ ఓటింగ్‌లో టాప్‌లో నిలిచారు. దాదాపు 24 శాతం ఓటింగ్‌తో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఇక సెకండ్ ప్లేస్ విషయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిన్న సెకండ్ ప్లేస్‌లో నిలిచిన యష్మిని టేస్టీ తేజ (17.04 శాతం) ఓవర్ టేక్ చేసి సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. యష్మి 16 శాతం ఓటింగ్‌తో థర్డ్ ప్లేస్‌లో నిలిచారు. తర్వాత అవినాష్ (15.30 శాతం), పృథ్వీరాజ్ (14.40 శాతం), విష్ణుప్రియ (13.97 శాతం) ఓటింగ్‌తో ఉన్నారు. ఎప్పుడు నామినేషన్స్‌లో నిలిచినా టాప్‌లో ఉండే విష్ణుప్రియ ఈసారి డేంజర్ జోన్‌లో ఉండటం షాకిస్తోంది. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి టైం ఉండటంతో రిజల్ట్స్ మారిపోయే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











