ప్రెగ్నెన్సీపై స్టార్ యాంకర్ సంచలన వ్యాఖ్యలు .. ఎవరైనా కనిస్తే పెంచుతానంటూ

మాతృత్వం ఆడవాళ్లకి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. స్త్రీ జీవితం బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే పరిపూర్ణమవుతుంది. భారతదేశంలో ఓ 50 ఏళ్లు వెనక్కి వెళితే.. ఇంట్లో ఖచ్చితంగా 10 మంది పిల్లలు ఉండేవారు. కాలక్రమంలో ఈ సంఖ్య తగ్గుతూ ఇప్పుడు ఇద్దరు లేదంటే ఒక్కరు అన్నట్లుగా పరిస్ధితి తయారైంది. ప్రస్తుతం భారతీయ జంటలు సంతానలేమిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రెగ్నెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంకర్, సినీ నటి ధరణి ప్రియ.

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జెమినీ మ్యూజిక్‌లో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు ధరణి ప్రియ. అంతేకాదు.. పలు డ్యాన్స్ షోలలోనూ మెరిసింది. పలు షార్ట్‌ఫిల్మ్స్‌లోనూ నటించి తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగు పాపులర్ వార్తా సంస్థలో ప్రసారమైన తీన్మార్‌ అనే ప్రోగ్రామ్‌లో రాధగా తెలుగు నాట ఆదరణ దక్కించుకున్నారు ధరణి ప్రియ. ఈ కార్యక్రమంలో బాగా పాపులర్ అయిన ధరణికి తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కాయి. రవితేజ నటించిన నేల టిక్కెట్టు, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దువ్వాడ జగన్నాథం వంటి సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్ని పోషించింది. ఈ ఏడాది ది డీల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Teenmaar Anchor Dharani Priya made sensational comments on pregnancy

ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసే ధరణి ప్రియను చూసిన ఓ ప్రొడ్యూసర్ నువ్వు స్క్రీన్ మీద బాగుంటావ్, ట్రై చేయ్ అని ప్రోత్సహించడంతో ఆ దిశగా అడుగులు వేశారు. అయితే ఇండస్ట్రీ వైపు వెళ్తానంటే కుటుంబ సభ్యులు తొలుత వద్దన్నారని.. తర్వాత తన ఇష్టాన్ని అర్ధం చేసుకుని షూటింగ్స్‌కి వెళ్లడానికి అంగీకరించారని ప్రియ చెప్పారు. ఈ క్రమంలోనే జెమినీ టీవీలో యాంకరింగ్ ఛాన్స్ వచ్చిందని, తర్వాత రంగస్థలం అనే డ్యాన్స్ రియాలిటీ షో లోనూ ఆమె పాల్గొన్నారు.

అంతేకాదు.. స్టార్ యాంకర్ , సినీ నటి అనసూయ భరద్వాజ్ ఈమెకు బంధువు. వరుసకు అక్క అవుతుంది. ఆవిడను చూసే తాను ఇండస్ట్రీలోకి వెళ్లాలని అనుకున్నట్లుగా ధరణి ప్రియ చెప్పారు. కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు అనసూయ వచ్చినప్పుడు తాము ఉంతో ఎగ్జయిటింగ్‌తో ఉండేవాళ్లమని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈమెకు 2015లోనే ప్రేమ వివాహం జరిగింది. ధరణి భర్త పేరు మోహిత్. ఈ దంపతులకు ఓ కుమార్తె. తను పుట్టిన తర్వాత జీవితం మారిపోయిందని, ఆమె మా ఇంటి మహాలక్ష్మీ అని ధరణి తెలిపారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ధరణి ప్రియ.. ఎప్పటికప్పుడు తన షోలు, సినిమాలు, వ్యక్తిగత వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పెళ్లి, పిల్లలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ధరణి ప్రియ. నా ఇద్దరు అక్కల ప్రెగ్నెన్సీ చాలా బాగుందని, కానీ తన ప్రెగ్నెన్సీ చాలా కష్టమన్నారు. భగవంతుడు ఒక బిడ్డను ఇచ్చాడని.. నా కూతురు ఆమోద చాలని, అందరూ వచ్చి ఇంకో బిడ్డ ఉండాలని , తోడు ఉండాలని అంటూ ఉంటారని గుర్తుచేసుకున్నారు. నేనేమీ కనను , నువ్వు కంటానంటే హ్యాపీగా పెంచుకుంటానని చెప్పి వాళ్ల నోళ్లు మూయిస్తానని ధరణి ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: teenmaar movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X