Mirai: టీవీలో మిరాయ్ సరికొత్త చరిత్ర... టాప్ రేటింగ్‌తో తేజ సజ్జా ఆల్ టైం రికార్డ్!
యంగ్ హీరో తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రీయా శరణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం మిరాయ్. భారతీయ పురాణాలు, చరిత్ర, సైన్స్ ఫిక్సన్ కలయికలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. మిరాయ్‌లో తేజ సజ్జా సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్‌గా మిరాయ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన మిరాయ్.. తేజ సజ్జాకు మరో బ్లాక్‌బస్టర్‌ను అందించగా.. తాజాగా టెలివిజన్‌లోనూ ఈ మూవీ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ వివరాల్లోకి వెళితే...
మిరాయ్ తారాగణం
మిరాయ్‌లో జగపతి బాబు, జయరాం, రత్న శేఖర్ రెడ్డి, గెటప్ శ్రీను, పవన్ చోప్రాలతో పాటు దర్శకులు కిశోర్ తిరుమల, వెంకటేష్ మహా, హీరో రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ పోషించారు. గౌరా హరి సంగీత దర్శకత్వం వహించగా.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌తో పాటు సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా నాగేంద్ర తంగల వ్యవహరించారు.

మిరాయ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌లకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. నిర్మాణ విలువలకు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. దాంతో మిరాయ్‌కి 65 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ అంచనాల నేపథ్యంలో మిరాయ్‌కి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద వరల్డ్ వైడ్‌గా 85 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 66 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
మిరాయ్‌తో లాభాల పంట
మిరాయ్‌కి ఇండియాలో 94.86 కోట్ల రూపాయల నెట్.. 111.41 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఓవర్సీస్‌లో 32.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో వరల్డ్ వైడ్‌గా తేజ సజ్జా మూవీకి 144.21 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. తద్వారా డిస్ట్రిబ్యూషన్ మీద 45 కోట్ల రూపాయలు.. గ్రాస్ పరంగా 80 కోట్ల రూపాయల లాభాలను మిరాయ్ అందించింది. డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాతకు మరిన్ని లాభాలు అందాయని ట్రేడ్ పండితులు తెలిపారు.
టీవీలో మిరాయ్ సరికొత్త రికార్డ్
థియేట్రికల్ రన్ ముగించుకున్న అనంతరం మిరాయ్ ఓటీటీలోకి వచ్చింది. గతేడాది అక్టోబర్ 10న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జియో హాట్ స్టార్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలోనూ బాగానే పర్ఫార్మ్ చేసింది ఈ చిత్రం. తాజాగా టెలివిజన్‌లో తేజా సజ్జ మరో చరిత్ర సృష్టించాడు. ఇటీవల స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అయిన మిరాయ్‌కి ఏకంగా 9.1+ టీవీ రేటింగ్ వచ్చింది. ఇక సినిమా చివరి గంటలో అయితే అది పీక్స్‌ను చేరి 10.80 రేటింగ్స్‌ను సాధించినట్లు విశ్లేషకులు తెలిపారు.
హను-మాన్‌తో తేజ సజ్జా చరిత్ర
ఇటీవలి కాలంలో చిన్నా పెద్దా సినిమాలు ఓటీటీలో త్వరగా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. దాంతో టెలివిజన్ ప్రీమియర్స్‌లో ఆయా సినిమాలకు టీఆర్పీ రేటింగ్ తగ్గిపోతోంది. అలాంటిది ఓటీటీలోకి వచ్చినా మిరాయ్ ఏకంగా 10.80 టీఆర్పీ రేటింగ్‌ను సాధించడం పట్ల విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే కాదు.. తేజ సజ్జా గత చిత్రం హను- మాన్ కూడా టీఆర్పీ రేటింగ్స్‌లో ఆల్ టైం రికార్డ్ సాధించింది. ఈ మూవీ ఓటీటీ, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 28 2024న తొలిసారిగా జీ తెలుగులో ప్రసారమైన హను- మాన్ చిత్రం ఏకంగా 10.26 పాయింట్ల టీఆర్పీ రేటింగ్స్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆ సమయంలో భారతదేశాన్ని ఐపీఎల్ ఫీవర్ ఊపేస్తోంది. అలాంటి మెగా ఈవెంట్ నడుస్తున్న సమయంలోనూ హను- మాన్ సత్తా చాటడం విశేషం. ఇప్పుడు మిరాయ్‌తో ఈ రికార్డ్‌కు చేరువగా వచ్చిన తేజ సజ్జా.. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రేంజ్‌లో అరుదైన ఘనతను నమోదు చేశాడు.


Click it and Unblock the Notifications











