For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పబ్లిక్‌లోనే బిగ్ బాస్ జంట ముద్దులు: అంతా బానే జరిగింది.. కానీ మా అమ్మే అంటూ!

  |

  చాలా భాషలతో పోల్చుకుంటే హిందీ పరిశ్రమకు చెందిన నటీనటుల మధ్య ఎక్కువగా ప్రేమాయణాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ డేటింగ్‌లు, బ్రేకప్‌లు సర్వసాధారమైన విషయాలుగా చెప్పుకుంటారు. ఇలా ఇప్పుడు ఎంతో మంది సినీ, బుల్లితెరకు చెందిన సెలెబ్రిటీలు రిలేషన్‌షిప్‌లో మునిగిపోతూ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. అలాంటి వారిలో బాగా ఫేమస్ అయిన వారిలో బుల్లితెర ప్రముఖులు తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా జంట ఒకటి. చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతోన్న వీళ్లిద్దరూ తరచూ కలుస్తూ రచ్చ చేస్తోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ టెలివిజన్ జోడీ పబ్లిక్ ప్లేస్‌లోనే రొమాన్స్‌లో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ సంఘటనపై వీళ్లిద్దరూ స్పందించారు. అసలేం జరిగిందో మీరే చూడండి!

  తేజస్వి ప్రకాష్ కెరీర్ అలా

  తేజస్వి ప్రకాష్ కెరీర్ అలా

  తేజస్వి ప్రకాష్ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే 'సంస్కార్' అనే సీరియల్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 'స్వరాగిణి'తో ఫుల్ పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఎన్నో సీరియళ్లలో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న 'నాగిన్ 6'లో తేజస్వి లీడ్ రోల్ చేస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది.

  పాయల్‌ను ఏమీ లేకుండా చూపించమన్న నెటిజన్: ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్

  కరణ్ కుంద్రా కెరీర్ ఇలా

  కరణ్ కుంద్రా కెరీర్ ఇలా


  కరణ్ కుంద్రా 'కితానీ మొహబత్ హై' అనే సీరియల్‌తో కెరీర్‌ను మొదలు పెట్టాడు. దీని తర్వాత ఎన్నో సీరియళ్లలో హీరోగా నటించాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అలా దేశ వ్యాప్తంగా పేరును తెచ్చుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సీరియళ్లు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తున్నాడు. ఫలితంగా మరింత పాపులర్ అవుతున్నాడు.

  తేజస్వి, కరణ్ లవ్ ట్రాక్

  తేజస్వి, కరణ్ లవ్ ట్రాక్

  బుల్లితెరపై హీరోగా, హీరోయిన్‌గా సందడి చేస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్.. చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. మొదట్లో సీక్రెట్‌గా వ్యవహారాన్ని నడిపిన ఈ జంట.. ఆ తర్వాత ఓపెన్ అయిపోయింది. అప్పటి నుంచి అందరికీ తెలిసేలానే కలిసి తిరుగుతున్నారు. దీంతో ఒంటరిగా కంటే జోడీగానే వీళ్లు ఫేమస్ అయ్యారు.

  హాట్ షోలో హద్దు దాటిన దివి: ఏకంగా స్నానం చేస్తోన్న పిక్ వదలడంతో!

  బిగ్ బాస్‌లో సందడిగానే

  బిగ్ బాస్‌లో సందడిగానే

  బిగ్ బాస్ 15వ సీజన్‌లో తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో అద్భుతమైన ఆటతీరుతో పాటు తరచూ రొమాన్స్ చేస్తూ తెగ హైలైట్ అయిన వీళ్లిద్దరూ ఫినాలేలో సైతం అడుగు పెట్టారు. ఇక, ఈ సీజన్‌లో తేజస్వీ ప్రకాశ్ విజేతగా నిలిచి ట్రోఫీని అందుకుంది. అయితే, కరణ్ కుంద్రా మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

  రచ్చ చేస్తూ... ట్రెండింగ్

  రచ్చ చేస్తూ... ట్రెండింగ్

  బిగ్ బాస్ తర్వాత తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా జంట దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ మరింతగా రెచ్చిపోతోన్నారు. తరచూ కలిసి పార్టీలు చేసుకోవడం.. పబ్లిక్‌లోనే రొమాన్స్ చేయడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు, ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్త పరుస్తూ పోస్టులు చేస్తున్నారు. దీంతో తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా నిత్యం ట్రెండ్ అవుతోన్నారు.

  Bigg Boss 6: సీజన్ ముందు బిగ్ బాస్‌కు షాక్.. చివరి నిమిషంలో ఇద్దరు బిగ్ స్టార్స్ ఔట్

  పబ్లిక్‌లోనే కిస్‌ పెట్టుకుని

  పబ్లిక్‌లోనే కిస్‌ పెట్టుకుని

  ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోన్న బుల్లితెర జంట తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా.. రొమాన్స్‌ను పండిస్తూ ఫ్యాన్స్‌కు మజాను పంచుతోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ షాపింగ్‌ మాల్‌లో వీళ్లిద్దరూ వేరు వేరే ఎస్కలేటర్లపై విరుద్ధంగా (పైకి ఒకరు.. కిందకు ఒకరు) ప్రయాణిస్తూ లిప్ కిస్‌లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

  అమ్మ ఏమంటుందోనని

  అమ్మ ఏమంటుందోనని


  మాల్‌లో రొమాన్స్ చేయడంపై తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికామె సిగ్గు పడుతూ పక్కకు వెళ్లిపోయింది. కానీ, అతడు మాత్రం 'అదంతా బాగానే జరిగింది. కానీ, సోషల్ మీడియాలో ఈ వీడియోను మా అమ్మ చూస్తే ఏమంటుందో అని భయంగా ఉంది' అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. దీంతో ఈ జంట మరోసారి ట్రెండింగ్ అవుతోంది.

  English summary
  Bigg Boss Winner Tejasswi Prakash and Karan Kundrra Recently Did Romance and Kisses in Public Place. Now They Reacts on This Incident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X