Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘అందుకే బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేశా.. కారణమేమిటంటే’
టెలివిజన్ రంగంలో గ్లామర్, యాక్టింగ్‌తో ఆకట్టుకొంటున్న నటి తేజస్వి ప్రకాష్ తాజాగా బిగ్‌బాస్ 13 సీజన్‌లో పాల్గొనబోతుందనే వార్తలు బాలీవుడ్ మీడియాను కుదిపేశాయి. తేజస్వి రాకతో బిగ్‌బాస్ హౌస్ హాట్ హాట్‌గా మారిపోతుందని అందరూ ఆశించారు. అయితే తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం లేదని చెప్పడం బుల్లితెర ప్రేక్షకులను షాక్ గురి చేసింది. అయితే బిగ్‌బాస్‌ను రిజెక్ట్ చేయడానికి కారణాలను ఇటీవల మీడియాతో పంచుకొన్నారు. తేజస్వి చెప్పిన విషయాలు ఇవే...

కంటి గాయంతో తప్పుకొని
తేజస్వి ప్రకాశ్ ప్రస్తుతం బల్గేరియాలో గాయాల బారిన పడి ఇబ్బందులు పాలైంది. జాతీయ టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఖత్రోంకి ఖిలాడి రియాలిటీ షోలో ఆమె పాల్గొంటున్నారు. అయితే ఈ షోకు సంబంధించి నీళ్లలో చేసిన షూటింగ్‌లో తేజస్వి కంటికి తీవ్రమైన గాయాలయ్యాయి. దాంతో ఆ షోలోని టాప్ ర్యాంకింగ్‌లో ఆరోస్థానం నుంచి అవుట్ అయ్యారు.

విశ్రాంతి తీసుకొంటున్నా
నేను ఇంకా బల్గేరియాలోనే ఉన్నాను. సెప్టెంబర్ 8న తిరిగి ఇండియాకు వస్తున్నాను. వాటర్ స్ట్రంట్స్ చేస్తుండగా కంటికి తీవ్రగాయమైంది. కంటి నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాను. గాయం పెద్దదేదని వైద్యులు చెప్పారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అందుకే ఖంత్రోకి ఖిలాడి షోలో టాప్ 6 ర్యాంకు నుంచి తప్పుకొన్నాను అని తేజస్వి చెప్పింది.

రోహిత్ శెట్టి అంటే ఇష్టం
ఖత్రోంకి కిలాడీ షోలో పాల్గొనడం గొప్ప అనుభూతి. నేనే ఆ షోలో అత్యంత తక్కువ వయసు ఉన్న యువతిని. దర్శకుడు రోహిత్ శెట్టి అద్బుతమైన వ్యక్తి. నాకు గాయమైతే ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ షో నుంచి తప్పుకోవడంతో బాధపడ్డారు. ఎప్పుడూ నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొనే వారు అని తేజస్వి చెప్పారు.

బిగ్‌బాస్ చేయడం లేదు
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ షోలో పాల్గొనడం లేదు. గత మూడేళ్లుగా నన్ను నిర్వాహకులు సంప్రదిస్తున్నారు. ఈ ఏడాది కూడా సంప్రదించారు. కానీ నేను వారికి అందుబాటులో ఉండనని చెప్పారు. వచ్చే ఏడాది బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు ట్రై చేస్తాను అని తేజస్వి మీడియాతో పంచుకొన్నారు.