బిగ్ బాస్2: హౌస్‌లోకి తేజస్వి, అమిత్ మళ్ళీ ఎంట్రీ.. ఒప్పుకునే ప్రసక్తే లేదు!
Recommended Video

బిగ్ బాస్ హౌస్ సందడి ఇక కేవలం మూడు రోజులు మాత్రమే. ఈ మూడు రోజులు హౌస్ లో వినోదాన్ని అందించేందుకు నిర్వాహకులు వివిధ రకాలుగా ప్లాన్ చేస్తున్నారు. శుక్రవారం రోజు బిగ్ బాస్ హౌస్ క్రేజీగా మారబోతోంది. సందడి తారాస్థాయికి చేరబోతోంది. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో చాలా ప్రత్యేకంగా నిలవనుంది. ఆదివారం రోజు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగబోతున్న సంగతి తెలిసిందే. నేటి ఎపిసోడ్‌కి సంబందించిన ప్రోమో ఆసక్తికరంగా మారింది.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

అమిత్, తేజస్వి మళ్ళీ ఎంట్రీ
నేడు జరగబోయే ఎపిసోడ్ చాలా సందడిగా ఉండబోతోంది. ఎందుకంటే తేజస్వి, అమిత్ మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎలిమినేట్ అయిపోయినవాళ్లు మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం ఏంటనే ఆశ్చర్యం అవసరం లేదు. వాళ్ళు ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తోంది అతిధులుగా మాత్రమే.

కిరీటి కూడా
బిగ్ బాస్2 రెండవ వారంలోనే కిరీటి ఎలిమినేట్ అయిపోయాడు. అతడుకూడా నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో కనిపించబోతున్నాడు. సునైనా, నందిని కూడా హౌస్ లోకి రాబోతున్నట్లు అర్థం అవుతోంది. గత వారం ఎలిమినేట్ అయిన రోల్ రైడ కూడా హౌస్‌లో ప్రత్యక్షమయ్యాడు.

ఆనందానికి అవధులు లేవు
కేవలం ఐదుగురు సభ్యులతోనే ఉన్న బిగ్ బాస్ హౌస్ బోసిపోయినట్లు కనిపిస్తోంది. మాజీ ఇంటి సభ్యులంతా ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో కోలాహలంగా మారింది. పాత మిత్రులని చూడగానే ప్రస్తుతం ఇంట్లో ఉన్నవారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు.

నువ్వింకా ఎలిమినేట్ కాలేదా
తేజస్వి ఇంట్లోకి రాగానే హడావిడి మొదలుపెట్టేసింది. నా వంట అందరూ మిస్సయ్యారా.. గీతా నువ్వింకా ఎలిమినేట్ కాలేదా వంటి సరదా కామెంట్స్ చేస్తూ హౌస్ మేట్స్ అందరిని పలకరిస్తుంది. అమిత్, రోల్ రైడ ఎప్పటిలాగే సందడి చేస్తున్నారు.

ఎప్పటికీ ఒప్పుకోను
తేజస్వి, తనీష్ మధ్య కాస్త వేడివేడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హౌస్ లో పాత సంగతులని గుర్తు చేసుకుంటున్న తేజస్వి తనీష్ తో మాట్లాడుతూ.. నేను చేసింది ఎప్పటికీ తప్పు అని ఒప్పుకోను. ఇంటి సభ్యులందరితో నాకు మంచి స్నేహం ఉందని తేజస్వి చెబుతోంది.


Click it and Unblock the Notifications











