నన్ను నేను చంపుకోవాలా.. సామ్రాట్‌తో పెళ్లి.. కెమెరాలు కిందపెట్టి.. తేజస్వి

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Tesjaswi Responds To Fans Comments

బిగ్‌బాస్2 తెలుగు రియాలిటీ షోలో తేజస్వి మదివాడ తనదైన శైలిలో రాణించింది. తొలుత అందరితో కలిసి మెలిసి హడావిడి చేసిన ఆమె.. ఆ తర్వాత సామ్రాట్‌కు దగ్గరైంది. సామ్రాట్‌తో దగ్గరైన అంశం తేజస్వికి ప్రతికూలంగా మారింది. దాంతో ప్రేక్షకుల్లో, నెటిజన్లలో ఆమెపై ద్వేష భావం పెరిగింది. అలాగే కౌశల్‌తో గొడవ ఆమె అస్థిత్వానికి ముప్పు తెచ్చింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో తేజస్వి బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలు వెల్లడించింది.

సామ్రాట్ బాగా కనెక్ట్ అయ్యాడు

సామ్రాట్ బాగా కనెక్ట్ అయ్యాడు

ఒక ఇంట్లో ఉంటే మనకు ఎవరో ఒకరు నచ్చడం సహజం. నాకు సామ్రాట్ బాగా కనెక్ట్ అయ్యాను. మేమిద్దరం కలిసి మెలిసి తిరిగాం. మాకు సంబంధాన్ని మరో విధంగా చూపించారు. మా మధ్య జరిగిన మిగితా విషయాలను చూపించలేదు. కేవలం రొమాంటిక్ సీన్లనే చూపించారు. ఇంకో నెల ఉంటే పెళ్లి కూడా చేసేవారేమో.

హ్యాపీగానే ఉన్నా

హ్యాపీగానే ఉన్నా

బిగ్‌బాస్ హౌస్ నుంచి హ్యాపీగానే బయటకు వచ్చాను. ఎందుకంటే ఇంకా ముందు ముందు ఉంటే సామ్రాట్, తనీష్‌ను నామినేట్ చేయాల్సి ఉంటుంది. కానీ అది నా మనస్పూర్తిగా చేయలేను. ఒకవేళ నేను నామినేట్ చేయాల్సి వస్తే నన్ను నేను చంపుకొనేలా వ్యవహరించుకోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు వచ్చిందే మంచిది అనే ఫీలింగ్ కలిగింది అని తేజూ ఆవేదన వ్యక్తం చేసింది.

నేను గయ్యాళి అన్నట్టు

నేను గయ్యాళి అన్నట్టు

ఒకసారి బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా గురించి చాలా బ్యాడ్‌గా ఉందని తెలుసుకొన్నాను. నేనో గయ్యాళిని, నేను అది, నేను ఇది అనేలా క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. దాంతో చాలా బాధపడ్డాను. ట్రోల్స్ చూసి ఇంకా బాధేసింది. బిగ్‌బాస్‌లో చూపించిన సీన్లను చూస్లే ఎవరైనా అలానే అనుకొంటారు. వాళ్లను తప్పుపట్టను అని తేజస్వి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

సామ్రాట్‌తో నా రిలేషన్

సామ్రాట్‌తో నా రిలేషన్

సామ్రాట్‌తో నా రిలేషన్ బ్యూటిఫుల్. మా రిలేషన్‌ను చాలా చీప్‌గా చూపించారు. నేను షార్ట్స్ వేసుకొంటే కెమెరాలు కిందపెట్టి చూపించారు. అలా గీతా మాధురి చేస్తే చూపించలేదు. దానిని నేను పెద్దగా పట్టించుకోను. ఇంతకుముందు కూడా నా మీద ఇలాంటి రూమర్లు వచ్చాయి అని తేజస్వి చెప్పింది.

తనీష్, దీప్తి మధ్య అఫైర్

తనీష్, దీప్తి మధ్య అఫైర్

తనీష్, దీప్తి సునైనా మధ్య అలాంటి రిలేషన్ లేదు. సునైన చాలా చిన్న పిల్ల. అలాంటి రూమర్లను వారికి అంటించకూడదు. మమల్ని రెండు జంటలుగా చూడవద్దు. రెండు గ్రూపులుగా చూడండి. బిగ్‌బాస్ హౌస్‌లో మేము మంచిగా ఉన్నాం. బాగా ఫ్రెండ్స్ అయ్యాం. మా మధ్య విభేదాలు లేవు అని తేజస్వి పేర్కొన్నది.

బిగ్‌బాస్ అవకాశం మళ్లీ వస్తే

బిగ్‌బాస్ అవకాశం మళ్లీ వస్తే

మళ్లీ బిగ్‌బాస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే నేను ఎలా ఉండాలో అనే విషయంపై స్పష్టంగా ఉన్నాను. ఎవరైనా తప్పు చేస్తే వారిని ఎత్తి చూపడంలో ఎలాంటి సంకోచం ఉండదు. నేను నాలా ఉంటాను. ప్రేక్షకులకు చాలా వినోదాన్ని పంచుతాను అని తేజూ స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X