మళ్లీ పాత అలవాట్లు.. బుల్లెట్ రాణిగా బిగ్ బాస్ బ్యూటీ.. తేజస్వీ రైడ్ వైరల్
వెండితెరపై తళుక్కున మెరిసి ఆకట్టుకున్న తేజస్వీ బుల్లితెరపైనా తన సత్తాను చాటుకుంది. బిగ్‌బాస్ షో ద్వారా తేజస్వీ మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ రెండో సీజన్‌లో తేజస్వీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సామ్రాట్‌తో రిలేషన్, కౌశల్‌తో గొడవలు ఇలా ఎన్నో రకాలుగా తేజస్వీ తెగ వైరల్ అయ్యాయి. బయటకు వచ్చిన తరువాత తేజస్వీకి ఎంత క్రేజ్ వచ్చిందో..అంతే స్థాయిలో నెగెటివిటీ వచ్చింది. అందుకే తేజస్వీకి మునుపటిలా అవకాశాలు రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తేజస్వీకి ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఆఫర్లు కరువు..
బిగ్‌బాస్ కంటే ముందు వెండితెరపై అడపాదడపా ఆఫర్లు తేజస్వీని వరించాయి. సీతమ్మ వాకిట్లో, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు వంటి చిత్రాల్లో కనిపించింది. ఇక వర్మ తీసిన ఐస్ క్రీమ్‌లో తేజస్వీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బిగ్‌బాస్ తరువాత ఆమెకు ఆఫర్లు తగ్గాయి. లాఫ్టర్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే అది కాస్తా బోల్తా కొట్టింది.

సోషల్ మీడియాలో రచ్చ..
వెండితెరపై,బుల్లితెరపై అంతగా మెరవకున్నా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. క్లీవేజ్ షోలతో అందరికీ హీటెక్కిస్తూ ఉంటుంది.

వెబ్‌సిరీస్‌లతో బిజీగా..
తేజస్వీకి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బోల్డ్ పాత్రలకు కూడా ఓకే చెప్పడంతో అక్కడ బాగానే వర్కౌట్ అవుతోంది. ఇప్పటికే కమిట్మెంట్ పేరుతో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన కామెంట్స్ మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది.

వస్త్రాధారణపై..
తాను ధరించే వస్త్రాలతో పాటు అభిప్రాయం కూడా మార్చుకునే వారు తనకు అవసరం లేదని తేజస్వీ హాట్ ఫోటోలను షేర్ చేసింది. చొక్కా గుండీలు విప్పేసి క్వీ వేజ్ షోతో నానా రచ్చ చేసింది. తేజస్వీ చేసే ఫోటో షూట్లు సోషల్ మీడియాలో అగ్గిని రాజేస్తుంటాయి.

తాజాగా బుల్లెట్‌పై..
వెరైటీ ఫోటోషూట్లతో పిచ్చెక్కించిన తేజస్వీ తాజాగా బైక్ రైడింగ్‌తో ఆకట్టుకుంది. తన పాత అలవాట్లను తిరిగి మళ్లీ చేసుకుంటున్నాను తెలిపింది. ఈ మేరకు బుల్లెట్ బైక్ పైకి ఎక్కి రౌండ్లు కొట్టింది. ఈ మేరకు ఆమె ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











