తేజస్వి పక్కా చీటింగ్.. అలా క్యాష్ చేసుకొంటుంది.. జిమ్మిక్కు అంటే అదే..

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Tejaswi Madivada Tries To re Enter Into the Show

బిగ్‌బాస్‌ హౌస్‌లో తొలుత ప్రేక్షకులను ఆకట్టుకొన్నా.. ఆ తర్వాత రకరకాల వివాదాలతో ఇంటి బయటకు వచ్చేసింది తేజస్వి మదివాడ. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె కౌశల్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతోపాటు తనకు మద్దతు కూడ గట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చి రాగానే ఆమెకు అదృష్టం తన్నకొచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వారికి ఓటింగ్ ద్వారా మళ్లీ ఇంట్లోకి చేరుకొనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తేజస్వి ప్లే చేసిన ట్రిక్ ఏమిటో తెలుసా?

రీఎంట్రీకి తేజస్వి ప్రయత్నం

రీఎంట్రీకి తేజస్వి ప్రయత్నం

బిగ్‌బాస్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తేజస్వి తెగ ప్రయత్నిస్తున్నది. తనకు అనుకూలంగా ఓట్లు వేయించుకొని ఇంట్లోకి వెళ్లాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకు సోషల్ మీడియాను బలంగా మార్చుకొంటున్నది.

నాకు కాల్ చేయండి

నాకు కాల్ చేయండి

తాజాగా ట్విట్టర్‌లో తేజస్వి ఓ పోస్టు పెట్టింది. నన్ను కాల్ చేయండి అని 7729998806 అనే నంబర్‌ను ఇచ్చింది. ఆ నంబర్ కాల్ చేయగానే నెటిజన్‌కు అసలు విషయం బోధపడింది.

ఓటు చేసినందుకు థ్యాంక్స్

ఓటు చేసినందుకు థ్యాంక్స్

మీ ఫేవరేట్ కంటెస్టెంట్‌కు ఓటు చేసినందుకు థ్యాంక్యూ అని ఓ మెసేజ్ వచ్చింది. ఈ రకంగా తేజూ నెటిజన్లను బాగానే ఉపయోగించుకొంటున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

రీ ఎంట్రీ ఛాయిస్ ఎవరికో..

రీ ఎంట్రీ ఛాయిస్ ఎవరికో..

ఇప్పటి వరకు బిగ్‌బాస్ హౌస్ నుంచి నూతన్ నాయుడు, సంజన అన్నె, కిరిటి, శ్యామల, భాను శ్రీ, తేజస్విని మదివాడ ఎలిమినేట్ అయ్యారు. ఇందులో ఒకరికి మళ్లీ అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. సోమవారం రాత్రి ఓటింగ్ లైన్లు తెరిచారు. ఈ ఓటింగ్ ప్రక్రియలో అత్యధిక ఓట్లు వచ్చిన వారు బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

ఆ వారం ఎలిమినేషన్

ఆ వారం ఎలిమినేషన్

బిగ్‌బాస్ హౌస్‌లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియను ఎత్తేశారు. దానికి బదులు ఎలిమినేటెడ్ సెలబ్రిటీల రీ ఎంట్రీ ప్రొగ్రాంను పెట్టారు. ఈ వారం భారీ సంఖ్యలో నామినేషన్ గురైన కౌశల్‌కు ఇది ఊరట అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X