అది అందరూ చూశారు సిగ్గుగా అనిపించింది..అప్పుడే పెళ్లి చేసుకుంటా.. తేజస్వీ కామెంట్స్ వైరల్
వెండితెరపై చిన్న చిన్న పాత్రలతో ఫేమస్ అయిన తేజస్వీ.. బిగ్‌బాస్ షోతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. రెండో సీజన్‌లో తనీష్, సామ్రాట్, తేజస్వీ, దీప్తి సునయన గ్యాంగ్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. వీరి మధ్య జనరేట్ అయిన ఎమోషన్స్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. అయితే ఈ షో ద్వారా ఎంత క్రేజ్ వచ్చిందో.. అంతకంతా నెగెటివిటీ కూడా పెరిగింది. అందరికంటే తేజస్వీపై నెగెటివిటీ ఎక్కువగా పెరిగింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఎలాంటి మార్పు రాలేదు.

రెండో సీజన్‌లో రచ్చ...
బిగ్‌బాస్ అన్ని సీజన్లలో కెల్లా రెండో సీజన్ మస్త్ మజాగా నడిచింది. హౌస్‌లో గ్లామర్ డోస్‌ను తేజస్వీ బాగానే పెంచింది. నిత్యం గొడవలతో కాలక్షేపం అయ్యేది. కౌశల్-తేజస్వీ మధ్య ప్రతీ రోజు మాటల యుద్దం నడిచేది. ఒకానొక సమయంలో తేజస్వీ మాటలు హద్దులు దాటడంతో ఆమెపై నెగెటివిటీ పెరిగింది.

తగ్గిన అవకాశాలు..
బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తేజస్వీకి బుల్లితెరపై కొన్ని అవకాశాలు వచ్చాయి. బ్రహ్మానందంతో చేసిన లాఫ్టర్ ఛాలెంజ్ షో అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి తేజస్వీకి వచ్చిన నెగెటివిటీ ఓ కారణంగా మారింది. ఇక వెండితెరపై అంతగా అవకాశాలు రాకపోవడంతో వెబ్‌సిరీస్‌లోనూ బోల్డ్‌గా నటించేందుకు సిద్దపడింది.

నెటిజన్లతో చిట్‌చాట్..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తేజస్వీ నిత్యం హాట్ హాట్ ఫోటోలతో అందర్నీ రెచ్చగొడుతూ ఉంటుంది.తాజాగా తన ఫాలోవర్స్‌తో కాసేపు చిట్‌చాట్ చేసింది. అందులో ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అవేంటో ఓసారి చూద్దాం.

ఆ సమయంలో అందరూ చూశారు..
సిగ్గుగా అనిపించిన ఘటన ఏదైనా ఉందా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘నేను ఓ సెల్ఫీ తీసుకుంటూ ఉండగా అది సముద్రంలో పడింది.. అప్పడు అందరూ నన్నే చూస్తూ ఉన్నార'ని ఆ ఘటనను గుర్తు చేసుకుంది. ఫుడ్‌లో ఏవి ఇష్టమని అంటే.. పానీపూరి, ముంజలు, కాకరకాయ్, చెరుకు, మామిడిపండ్లు అని పెద్ద లిస్ట్ చెప్పుకొచ్చింది.

అప్పుడే పెళ్లి చేసుకుంటా..
మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని అడిగితే.. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు కనుక్కుంటే అప్పుడే చేసుకుంటానని చెప్పుకొచ్చింది. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? అంటే లేడని సమాధానమిచ్చింది. ఎందుకింత క్యూట్‌గా ఉన్నావంటే.. మా అమ్మ నన్నిలా తయారు చేసిందని తెలిపింది.


Click it and Unblock the Notifications











