Don't Miss!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్ బాస్ షోకు మరో షాక్ : తేజస్వి మదివాడ ఎలిమినేషన్ ముందే లీక్!
Recommended Video
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా ముందే లీక్ అవుతుండటంతో షో నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంతకు ముందు యాంకర్ శ్యామల విషయంలో ఇలానే జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తేజస్వి మదివాడ ఎలిమినేట్ అయిన విషయం లీకైంది.
లీక్ అవ్వడానికి అసలు కారకులు వారే?
ఆదివారం జరిగే ఎపిసోడ్ ఒకరోజు ముందే షూట్ చేస్తారు. నాని హోస్ట్ చేసే వీకెండ్ షోలో కొందరు ప్రేక్షకులు కూడా పాల్గొంటారు. వారి ద్వారానే ఎలిమినేట్ అయింది ఎవరు? అనే విషయాలు బయటకు లీక్ అవుతున్నాయట. తేజస్వి మదివాడ ఎలిమినేషన్ విషయం అలానే లీక్ అయిందని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్
తేజస్వి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిందని, చాలా రోజుల తర్వాత మళ్లీ ఆమెను కలిశాను అంటూ ఆమె ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది.
లీకుల పర్వం కొనసాగితే అంతే..
ఇటీవల బిగ్ బాస్ షోకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలు లీకయ్యాయి. కెమెరా ఆపరేటర్లు, రోజువారిగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వస్తున్న ఓట్ల వివరాలు అందులో ఉన్నాయి. బిగ్ బాస్ షోలో లీకుల పర్వం ఇలానే కొనసాగితే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
తేజస్వి ముందే ఊహించిందా?
శనివారం ఎలిమినేషన్ ప్రక్రియ కీలకం కావడంతో సభ్యులందరిలోనూ దానిపై చర్చ జరిగింది. హౌస్ నుంచి వెళ్లిపోయేది తనే అని కూడా తేజస్వీ హౌస్‌మెట్స్‌తో వ్యాఖ్యానించారు. తన ఎలిమినేషన్‌కు చాలా కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. గేమ్ ఆడే విషయంలో తాను కొన్ని తప్పులు చేసినట్లు తేజస్వి రియలైజ్ అయినట్లు తెలుస్తోంది.
అరికట్టకపోతే ప్రమాదమే...
బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్ ఎంత పకడ్బంధీగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సీజన్ లోనావాలా ప్రాంతంలో జరుగడం వల్ల ఎలిమినేట్ అయినవారు హైదరాబాద్ చేరడానికి చాలా సమయం పట్టేది. దాని వల్ల ఏ విషయం లీక్ అయ్యేది కాదు. అయితే ప్రస్తుతం ఈ షో అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతుండటం, బయటకు వచ్చిన వెంటనే స్నేహితులను కలుస్తుండటం, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయట పెడుతుండటంతో షో ప్రసారం కాకముందే ఎలిమినేట్ అయింది ఎవరనేది లీక్ అవుతోంది. ఇలాంటివి జరుగకుండా అరికట్టక పోతే రేటింగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు.